PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-leader-sensational-comments-on-babu-and-nimmagadda0e6ce2b3-2a91-435b-a004-5cb92f720980-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-leader-sensational-comments-on-babu-and-nimmagadda0e6ce2b3-2a91-435b-a004-5cb92f720980-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాకిచ్చారు అంటూ వైసిపి అనుకూల మీడియాలో ప్రచారం మొదలైంది. ఇంతకీ ఆ షాక్ ఏమిటి అనుకున్నారు ? చాలా రోజుల క్రితం చంద్రబాబు ఆన్లైన్ లో ప్రకటించిన మానిఫెస్టోని వెనక్కి తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించడమే ఆ షాక్ సారాంశ. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోనుjagan nimmagadda elections;cbn;kumaar;hari;hari music;telugu desam party;andhra pradesh;telangana;telugu;media;panchayati;village;tdp;ycp;sara shrawan;partyజగడ్డ : దీన్నే షాక్ అంటారా ?జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?jagan nimmagadda elections;cbn;kumaar;hari;hari music;telugu desam party;andhra pradesh;telangana;telugu;media;panchayati;village;tdp;ycp;sara shrawan;partyFri, 05 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాకిచ్చారు అంటూ వైసిపి అనుకూల మీడియాలో ప్రచారం మొదలైంది. ఇంతకీ ఆ షాక్ ఏమిటి అనుకున్నారు ? చాలా రోజుల క్రితం చంద్రబాబు ఆన్లైన్ లో ప్రకటించిన మానిఫెస్టోని వెనక్కి తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించడమే ఆ షాక్ సారాంశ. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. 

ఎక్కడా దీనికి సంబంధించిన ప్రచారం చేయ వద్దని జిల్లాలకు పంపిన కాపీలను కూడా వెనక్కి తప్పించుకోవాలని ఆదేశించారు. నిజానికి నిమ్మగడ్డ ఎన్నికల నియమావళినే ఫాలో అయ్యారు. ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు ఆధారంగా జరగవు. పైకి మాత్రం అలా చెబుతున్నా ఏ గ్రామంలో చూసినా ఏదో ఒక పార్టీకి సంబంధించిన మద్దతుదారులు సర్పంచ్ అభ్యర్థిగా లేకుంటే వార్డు మెంబర్ అభ్యర్థిగా ఉంటారు. ఎక్కడో నూటికో కోటికో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తూ ఉంటారు. అంటే పైకి పార్టీలు లేవంటూనే పార్టీలను రంగులతోనే ప్రచారం చేస్తారు. ఆ విషయాలు ఎలా ఉన్నా ఇప్పుడు బాబుకు షాక్ అనే అంశమే ఆశ్చర్యకరంగా మారింది.

ఎందుకంటే సాధారణంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఎన్నికల సంఘం కానీ తీసుకునే చర్యలు కఠినంగా అయితే ఉండవు. బాగా కఠినంగా శిక్షించడం అంటే వారిని ప్రచారానికి వెళ్లొద్దని నిషేధించడం. గత తెలంగాణ ఎన్నికల సమయంలో కొందరు నేతలకు ఈ శిక్ష విధించారు కూడా. ఇక ఆ తర్వాత హెచ్చరికలు జారీ చేయడం వివరాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మ్యానిఫెస్టో విషయంలో జరిగింది కూడా అలాంటిదే. నిజానికి ఆన్లైన్ లో ప్రకటించిన మేనిఫెస్టో ని ఎలా ఉపసంహరించుకుంటారా తెలియదు. కనీసం ఆ మేరకు టిడిపి ప్రకటన చేస్తుందా అనేది కూడా ఆశ్చర్యకరమే. దీనిని షాక్ అని మీడియా ఎలా ప్రొజెక్ట్ చేసిందో వారికే తెలియాలి మరి.




బీరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే...

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>