PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-plans-over-chandrababu6ae191fc-7de7-4059-bf30-b22671425611-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-plans-over-chandrababu6ae191fc-7de7-4059-bf30-b22671425611-415x250-IndiaHerald.jpgచంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీ గారి కాళ్ల బేరానికి వచ్చిన చంద్రబాబు ఒకప్పట్లో ..మోదీ మీద, ఆయన కుటుంబం మీద చంద్రబాబు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో, వాటికి సంబంధించిన వీడియోలు మా దగ్గరున్నాయి. jagan plans over chandrababu;cbn;modi;amit shah;chandra bose;chandrabose;editor mohan;ram pothineni;jagan;pilli subhash chandra bose;andhra pradesh;narendra modi;amith shah;rajya sabha;mp;prime minister;minister;subhas chandra bose;tdp;central government;ycp;hindus;sv mohan reddy;reddy;party;narendraజగనోరి ప్లాన్ యు టర్న్ తీసుకుందా...బాబోరే టార్గెట్...?జగనోరి ప్లాన్ యు టర్న్ తీసుకుందా...బాబోరే టార్గెట్...?jagan plans over chandrababu;cbn;modi;amit shah;chandra bose;chandrabose;editor mohan;ram pothineni;jagan;pilli subhash chandra bose;andhra pradesh;narendra modi;amith shah;rajya sabha;mp;prime minister;minister;subhas chandra bose;tdp;central government;ycp;hindus;sv mohan reddy;reddy;party;narendraFri, 05 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ వైరం పీక్స్ కు చేరుకుంది. అధికార పార్టీకి మరియు టిడిపి పార్టీకి మధ్య నడుస్తున్న యుద్ధం ఢిల్లీలో మారుమోగింది. టీడీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి  రాష్ట్రంలో వైసిపి పార్టీ వైఖరిపై ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు, మీడియాపై జగన్ వరుస దాడులు చేయిస్తున్నారని, ఎదురు తిరిగిన వారిపై కక్ష కట్టి కుట్రలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జగన్ పాలనలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జగన్ సర్కారు మత కల్లోలం సృష్టిస్తోందని అన్నారు.

వైసీపీ మతమార్పిడులను ప్రోత్సహిస్తోందని ...పాస్టర్లకు రూ.5వేల గౌరవ వేతనమే ఇందుకు నిదర్శనమని  ఆరోపించారు. దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని, హిందువులకు గౌరవం తగ్గిందని పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని, ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక అవినీతి పెరిగిందని, ఆ పార్టీలోని కొందరు నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు సీఎం జగన్ తన సతీమణికి చెందిన సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆ పార్టీలోని కొందరు నాయకులు సైతం తమ ఆర్థిక లబ్దికోసం అవినీతికి పాల్పడుతున్నారు అంటూ వాపోయారు అమిత్ షాను కలిసిన టీడీపీ ఎంపీలు.

అయితే ఈ విషయం తెలిసిన వైసీపీ పార్టీ నేతలు టిడిపిపై భగ్గుమంటున్నారు. ఇంత పెద్ద అబద్ధపు ఆరోపణలు చేసే ముందు కాస్త అయినా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఉంటే బాగుండేదన్నారు.‘మేం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తాం. ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తాం. అలాగే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా కలుస్తాం. టిడిపి అరాచకాల చిట్టా వారి ముందు ఉంచుతాం అని ఘాటుగా స్పందించారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం వారికి పరిపాటే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను కలిసిన టీడీపీ ఎంపీలు జగన్ మీద అబద్ధాలు చెప్పారని.. అందులో ఏ మాత్రం నిజం లేదని... జగన్ సర్కారు అభివృద్ధి బాటలో నడవడం చూసి ఓర్వలేకే ఇంత చేస్తున్నారంటూ... టిడిపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీ గారి కాళ్ల బేరానికి వచ్చిన చంద్రబాబు ఒకప్పట్లో ..మోదీ మీద, ఆయన కుటుంబం మీద చంద్రబాబు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో, వాటికి సంబంధించిన వీడియోలు మా దగ్గరున్నాయి. వాటిని కూడా మేము ప్రజలకు చూపిస్తాము’ అని బాలశౌరి మండిపడ్డారు. వైసిపి పార్టీ పై అమిత్ షా వద్ద టీడీపీ నేతలు ఈ రేంజ్ లో ఆరోపణలు చేయడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు అధికార పార్టీ నేతలు కూడా అంతకుమించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగనోరు మళ్ళీ మరుగున పడిపోయిన ఓటుకు నోటు కేసును తిరగదోలే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.


వరంగల్ శ్రీను... దిల్ రాజు కి సరైనోడు దొరికాడే..అన్ని పెద్ద సినిమాలు ఆయనకే..?

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?

హీరోయిన్ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్.. మైండ్ బ్లాంక్ అయ్యే పిక్ పెట్టింది..!

కాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?

స‌జ్జ‌ల సొంత పార్టీలోనే టార్గెట్ అయ్యారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>