MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramyakrishna3b80dfb4-0248-45e4-a059-f3a271f67557-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramyakrishna3b80dfb4-0248-45e4-a059-f3a271f67557-415x250-IndiaHerald.jpgరమ్యకృష్ణ.. ఆ పేరు తెలియని వారుండరు. 1992 నుంచి 2000 సంవత్సరం వరకు తెలుగు సినీ పరిశ్రమను ఓ ఊసేసిన హీరోయిన్. దర్శకుడు రాఘవేంద్ర చిత్రాలకు రమ్యకృష్ణ మొదటి చాయిస్. అంతగా తనదైన ముంద్ర వేసుకుంది. అందాలను ఆరబోస్తూ కుర్రకారు మనసు దోచేసింది. అటు గ్లామర్ పాత్రలు చేస్తూనే పెర్ ఫామెన్స్ కి ఆస్కారం ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించింది.ramyakrishna;koti;jayalalitha;jeevitha rajaseskhar;krishna;krishna vamshi;ramya;ramya krishnan;rani;rashmika mandanna;tiru;bahubali;tamil;kannada;hindi;remake;heroine;ranga marthanda;raghavendraరమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్ramyakrishna;koti;jayalalitha;jeevitha rajaseskhar;krishna;krishna vamshi;ramya;ramya krishnan;rani;rashmika mandanna;tiru;bahubali;tamil;kannada;hindi;remake;heroine;ranga marthanda;raghavendraFri, 05 Feb 2021 15:00:00 GMTరాఘవేంద్ర చిత్రాలకు రమ్యకృష్ణ మొదటి చాయిస్. అంతగా తనదైన ముంద్ర వేసుకుంది. అందాలను ఆరబోస్తూ కుర్రకారు మనసు దోచేసింది. అటు గ్లామర్ పాత్రలు చేస్తూనే పెర్ ఫామెన్స్ కి ఆస్కారం ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించింది. డ్యాన్స్ లతో కుర్రకారు గుండెల్లో గుబులెత్తించింది. తెలుగు మాత్రమే కాదు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకుంది. నీలాంబరిగా .. శివగామిగా.. దేవతగా విభిన్న మైన పాత్రలు పోషించింది. ఎన్ని అవతారాలు ఎత్తినా ఆమెకు ఆమే సాటి.

అప్పట్లో హీరోయిన్ గా రాణించిన రమ్య కృష్ణ.. తర్వాత మంచి మంచి కారెక్టర్లు చేస్తూ తన టాలెంట్ మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటుంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నా మాటే శాసనం అనే డైలాగ్ తో అదరగొట్టింది. ఆ సినిమాలో తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెప్పుకుంది.

రమ్యకృష్ణ ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్ లో రంగ మార్తాండ సినిమాలో నటిస్తోంది. సామ్రాట్ అనే  మరాఠి సినిమాకు రీమేక్ గా వస్తోంది. సినిమతో పాటు వెబ్ సిరీస్ లతోనూ అలరిస్తోంది రమ్యకృష్ణ. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ లో జయలలిత పాత్ర పోషించి అదరగొట్టింది.

అంతేకాదు రమ్యకృష్ణ పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. పలు సీరియల్స్ లోనూ నటించి బుల్లి తెరపై కూడా తిరుగులేదని నిరూపించుకుంది. 50ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అందం తగ్గకుండా కుర్ర హీరోయిన్స్ కి ధీటుగా నటిస్తోంది. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఆమె.. రోజుకు 10 లక్షల వరకూ రెమ్యునరేఫన్ తీసుకుంటుందట. అంటే పది రోజులు ఒకే సినిమాకి పనిచేస్తే కోటి రూపాయలు వస్తాయన్న మాట.

ప్రస్తుతం టాలివుడ్ లో రష్మిక మందన్న ఒక సినిమాకి కోటిన్నర వసూలు చేస్తుందట. అంటే రమ్యకృష్ణ రెమ్యునరేషన్ పోల్చితే.. ఆమెకి ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదనే విషయం అర్దమవుతుంది.


మన పెద్దలు వాడే సౌందర్య చిట్కా ఏంటో తెలిస్తే..మీరూ పాటిస్తారు..

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పంచాయ‌తీల్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అన్యాయ‌మే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>