PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-ysrcp-reddies-are-upper-hand-in-kapu-fort651f8f13-0dac-4b80-8f04-cb68df2af26e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-ysrcp-reddies-are-upper-hand-in-kapu-fort651f8f13-0dac-4b80-8f04-cb68df2af26e-415x250-IndiaHerald.jpgపార్టీలోనూ న‌డుస్తోందంటున్నారు. కాపు సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం ఉన్న‌ప్ప‌ట‌కీ కూడా ఈ జిల్లాలో ఏకంగా ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. అన‌ప‌ర్తిలో స‌త్తి సూర్య‌నారాయ‌ణ రెడ్డి, కొత్త‌పేట‌లో చిర్ల జ‌గ్గిరెడ్డి, కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జిల్లాలో కాపు, శెట్టిబ‌లిజ‌, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రెడ్డి ఎమ్మెల్యేలు చెప్పిన ప‌నులే స్పీడ్‌గా జ‌ర‌గ‌డంతో పాటు వారికే పైన కూడా ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్న చ‌ర్చ‌లు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ysrcp;krishna;venu;indiaherald group;rbi;district;scheduled caste;backward classes;smart phone;mla;minister;letter;central government;ycp;kakinada;reddy;mantra;venu thottempudiకాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?కాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?ysrcp;krishna;venu;indiaherald group;rbi;district;scheduled caste;backward classes;smart phone;mla;minister;letter;central government;ycp;kakinada;reddy;mantra;venu thottempudiFri, 05 Feb 2021 08:30:00 GMTజిల్లా కాపు సామాజిక వ‌ర్గానికి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి నేటి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా తూర్పు గోదావ‌రి జిల్లాలో మాత్రం రాజ‌కీయ అధికారం కాపుల‌దే. ఆ మాట‌కు వ‌స్తే కాపు మంత్రి ఒక‌రు త‌ప్ప‌కుండా కేబినెట్లో ఉండేవారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక కూడా ఏర్ప‌డిన తొలి ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు కాపుల‌కు ఈ జిల్లా కాపు కోటాలో నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌ను హోం మంత్రిని చేయ‌డంతో పాటు ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు. ఇక ప్ర‌స్తుతం కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు కూడా కాపు కోటాలో జిల్లా నుంచి జ‌గ‌న్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు.

క‌న్న‌బాబుతో పాటు మ‌రో ఇద్ద‌రు మంత్రులు పినిపే విశ్వ‌రూప్‌, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సైతం ఎస్సీ, బీసీ వ‌ర్గాల నుంచి మంత్రులు ఉన్నారు. అయితే జిల్లాలో మంత్రుల క‌న్నా కూడా రెడ్ల హ‌వానే ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ న‌డుస్తోందంటున్నారు. కాపు సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం ఉన్న‌ప్ప‌ట‌కీ కూడా ఈ జిల్లాలో ఏకంగా ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. అన‌ప‌ర్తిలో స‌త్తి సూర్య‌నారాయ‌ణ రెడ్డి, కొత్త‌పేట‌లో చిర్ల జ‌గ్గిరెడ్డి, కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

జిల్లాలో కాపు, శెట్టిబ‌లిజ‌, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రెడ్డి ఎమ్మెల్యేలు చెప్పిన ప‌నులే స్పీడ్‌గా జ‌ర‌గ‌డంతో పాటు వారికే పైన కూడా ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్న చ‌ర్చ‌లు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతెందుకు క‌న్న‌బాబు మంత్రిగా ఉన్నా కూడా జిల్లా కేంద్రంలో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పూర్తి ఆధిప‌త్యం చెలాయిస్తోన్న ప‌రిస్థితి ఉంద‌ట‌. క‌న్న‌బాబు మంచి జ‌ర్న‌లిస్టు అయ్యి ఉండి.. అన్ని అంశాల‌పై స‌మ‌గ్రంగా ప‌ట్టు ఉండి కూడా ఇటీవ‌ల పూర్తిగా సైలెంట్ అయిపోతోన్న ప‌రిస్థితి.

జిల్లా కాపు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉండి కూడా ఏం చేయ‌లేక ల‌బోదిబో మంటున్నారు. ఏదేమైనా జిల్లా కాపుల్లో మాత్రం ఈ ప‌రిణామాల‌పై ఓ మార్పు అయితే మొద‌లైంద‌ని అంటున్నారు.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​




అది మితిమీరడం వల్లే ప్రభుదేవాతో విడిపోయా..నయనతార..?

జగడ్డ: చంద్రబాబు మైకంలో నిమ్మగడ్డ -వైసీపీ మహిళానేత సంచలన వ్యాఖ్యలు

హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>