MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kathi-kantharao-wife0ea362ec-abd1-44e5-8f8e-326dc336d36e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kathi-kantharao-wife0ea362ec-abd1-44e5-8f8e-326dc336d36e-415x250-IndiaHerald.jpg‌పాత కాలం నాటి హీరోల‌లో కాంతారావుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ప్రమఖ సినీ నటుడు కాంతారావు సతీమణి హైమావతి(87) ఈ రోజు తుది శ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో మల్లాపూర్‌లోని వారి నివాసంలో ఆమె గుండెపోటుకు గురయ్యారుkathi kantharao wife;susheela;nageshwara rao akkineni;telangana;district;suryapeta;mandalam;village;marriage;wife;march;kodadసినీ న‌టుడు కాంతారావు భార్య కన్నుమూత..!?సినీ న‌టుడు కాంతారావు భార్య కన్నుమూత..!?kathi kantharao wife;susheela;nageshwara rao akkineni;telangana;district;suryapeta;mandalam;village;marriage;wife;march;kodadFri, 05 Feb 2021 16:23:17 GMT‌పాత కాలం నాటి హీరోల‌లో కాంతారావుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ప్రమఖ సినీ నటుడు కాంతారావు సతీమణి హైమావతి(87) ఈ రోజు తుది శ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో మల్లాపూర్‌లోని వారి నివాసంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె కన్నుమూశారు. కాంతారావు 2009 మార్చి 22న మరణించారు. హైమావతి మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇక కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ రోజు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాంతారావు 1940లో సుశీల అనే మహిళను వివాహాం చేసుకున్నారు. అయితే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హైమావతిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగిన కొన్ని రోజులకు సుశీల మరణించారు.

కాంతారావు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో జన్మించారు. అనేక సాంఘీక, జానపద చిత్రాల ద్వారా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. ఒక దశలో ఆయన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావు లాంటి అగ్ర కథానాయకులకు గట్టి పోటీని ఇచ్చారు. ఆయన 400లకు పైగా చిత్రాల్లో నటించారు.

అయితే వెండితెరపై కత్తియుద్ధాలతో అశేష ప్రేక్షకులను అలరించారు కాంతారావు. కానీ కత్తుల్లాంటి సమస్యల నుంచి తన కుటుంబాన్ని మాత్రం గట్టెక్కించుకోలేకపోయారు. ‘ప్రతిజ్ఞ’ సినిమాతో 1953లో చిత్ర సీమకు పరిచయమైన ఆయన దాదాపు 100 చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన చేసిన ఇతర పాత్రలు కూడా కలిపి చూస్తే దాదాపు 450 సినిమాల్లో నటించారు. కాకపోతే సినీ కెరీర్ ఆయన కుటుంబానికి అస్సలు కలిసిరాలేదు. కొన్ని చిత్రాలు నిర్మించి అప్పులపాలైన ఆయన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. ఆప్తులు అందించిన ఆర్థికసాయంతో కాలం వెళ్లదీస్తూ 2009 సంవత్సరంలో అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇక అప్పటి నుంచి ఆయన కుటుంబం అద్దె ఇళ్లలో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. కాంతారావుగారు సినిమాలు తీసి ఆస్తి పోగొట్టుకున్నారు గానీ, చెడు వ్యసనాల వల్ల కాదని గతంలో ఆయన సతీమణి హైమావతి మీడియాతో చెప్పారు. ప్రభుత్వ సహకారం కావాలని పలు సందర్భాల్లో ఆమె అభ్యర్థించారు.


ఆ సినిమాకు 5 కోట్లు పెడితే, కేవలం 14 లక్షలు వచ్చాయి.. కారణం అదే..

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>