MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundray-ramyakrishna-movie-narashimhad6a1403a-bd94-449d-a667-265c521723ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundray-ramyakrishna-movie-narashimhad6a1403a-bd94-449d-a667-265c521723ca-415x250-IndiaHerald.jpgరమ్యకృష్ణ,సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్లు ఇద్దరూ కలిసి నటించిన సినిమా "నరసింహ". ఈ సినిమాలో కథానాయకుడిగా అగ్ర హీరో రజినీకాంత్ నటించారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు రమ్య కృష్ణ. ఇక సినీ కెరీర్ మొదలుపెట్టిన ఆ రోజుల్లో ఐరన్ లెగ్ గా పిలిపించుకున్న రమ్యకృష్ణ, ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇక ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం నరసింహ. ఇక ఈ సినిమాకు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. soundray,ramyakrishna,movie,narashimha;chiranjeevi;rajinikanth;soundarya;krishna;krishna vamshi;ramya;ramya krishnan;cinema;rajani kanth;kanna lakshminarayana;k s ravikumar;interview;iron;husband;hero;heroine;gottipati ravi kumar;wanted;ranga marthanda;narasimhaఒక సన్నివేశంలో సౌందర్యతో పాటు కలిసి పని చేసినప్పుడు, చాలా ఇబ్బంది పడ్డాను: రమ్యకృష్ణఒక సన్నివేశంలో సౌందర్యతో పాటు కలిసి పని చేసినప్పుడు, చాలా ఇబ్బంది పడ్డాను: రమ్యకృష్ణsoundray,ramyakrishna,movie,narashimha;chiranjeevi;rajinikanth;soundarya;krishna;krishna vamshi;ramya;ramya krishnan;cinema;rajani kanth;kanna lakshminarayana;k s ravikumar;interview;iron;husband;hero;heroine;gottipati ravi kumar;wanted;ranga marthanda;narasimhaFri, 05 Feb 2021 09:49:18 GMTరమ్యకృష్ణ,సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్లు ఇద్దరూ కలిసి నటించిన సినిమా "నరసింహ". ఈ సినిమాలో కథానాయకుడిగా అగ్ర హీరో  రజినీకాంత్ నటించారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు రమ్య కృష్ణ. ఇక సినీ కెరీర్ మొదలుపెట్టిన ఆ రోజుల్లో ఐరన్ లెగ్ గా పిలిపించుకున్న రమ్యకృష్ణ, ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇక ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం నరసింహ. ఇక ఈ సినిమాకు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు.

ఇక సౌందర్య గురించి చెప్పాలంటే అందరి హీరోయిన్ల కన్నా, చిరంజీవి మెగాస్టార్ పొజిషన్ ఎంతో, సౌందర్య పొజిషన్ కూడా అంతే ఉండేది. అసలు సౌందర్య సినిమా వచ్చిందంటే చాలు కచ్చితంగా హిట్ అయ్యేది. ఆ రోజుల్లో మాత్రం సౌందర్య కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. నరసింహ సినిమా లో సౌందర్య మెయిన్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ నీలాంబరి అనే పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రకి సమానంగా రమ్యకృష్ణ పాత్ర ఉంటుంది.

అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో సౌందర్య ముఖం పైన కాలు పెట్టే సన్నివేశంలో, నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటూ రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఈ సన్నివేశం చేయడానికి రమ్యకృష్ణ అసలు ఒప్పుకోలేదట.  ఇక దర్శకుడు కే.ఎస్. రవికుమార్ రమ్యకృష్ణను బాగా బ్రతిమలాడాడట. ఇక దర్శకుడు కన్విన్స్ చేయడంతో  ఆ సీన్ చేశానని ఆమె వెల్లడించింది.

అయితే ఈ సినిమా ప్రారంభంలో దర్శకుడు నీకు నీలాంబరి పాత్ర కావాలా? లేక సౌందర్య పాత్ర కావాలా? అడిగి ఉంటే, నేను కచ్చితంగా సౌందర్య పాత్ర కావాలి అని అడిగే దానిని. అయితే రజనీకాంత్ కు పోటీగా నేను అయితేనే సెట్ అవుతానని వారు నన్ను ఏమీ అడగకుండానే, నాకు నీలాంబరి పాత్ర ఇచ్చేశారు. అయితే ఈ సినిమా తరువాత నీలాంబరి పాత్రలో నటించిన నాకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పవచ్చు. అంటూ ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ వెల్లడి. ప్రస్తుతం రమ్య కృష్ణ తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న "రంగమార్తాండ"  సినిమాలో ఆమె  కీలక పాత్ర పోషిస్తోంది.




దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఓ యువతీ ఏం చేసిందంటే..!?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>