MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunil-helthff353504-ecd7-44c7-a889-54d54d8e52f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunil-helthff353504-ecd7-44c7-a889-54d54d8e52f7-415x250-IndiaHerald.jpgసునీల్ మొదట హాస్య పాత్రలో నటించి, ఆ తర్వాత కథానాయకుడిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సుమారు 200 చిత్రాలకు పైగా నటించి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సునీల్ మొదట హాస్యనటుడిగా నువ్వే కావాలి,నువ్వు నేను,నువ్వు నాకు నచ్చావ్,నువ్వే నువ్వే,సొంతం,మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు వంటి సినిమాలు ఎన్నో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. 2003 లో వచ్చిన నువ్వు నేను, 2006లో వచ్చిన ఆంధ్రుడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు.sunil,helth;health;rajamouli;sunil;cinema;smart phone;media;hero;nuvve kavali;nuvvu naaku nachav;maryada ramanna;nuvve nuvve;manasantha nuvveతీవ్ర అస్వస్థతకు గురైన హీరో సునీల్: కారణం అదే..తీవ్ర అస్వస్థతకు గురైన హీరో సునీల్: కారణం అదే..sunil,helth;health;rajamouli;sunil;cinema;smart phone;media;hero;nuvve kavali;nuvvu naaku nachav;maryada ramanna;nuvve nuvve;manasantha nuvveFri, 05 Feb 2021 16:00:00 GMTసునీల్ మొదట హాస్య పాత్రలో నటించి, ఆ తర్వాత కథానాయకుడిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సుమారు 200 చిత్రాలకు పైగా నటించి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సునీల్ మొదట హాస్యనటుడిగా నువ్వే కావాలి,నువ్వు నేను,నువ్వు నాకు నచ్చావ్,నువ్వే నువ్వే,సొంతం,మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు వంటి సినిమాలు ఎన్నో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. 2003 లో వచ్చిన నువ్వు నేను, 2006లో వచ్చిన ఆంధ్రుడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు.


ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాద రామన్న" సినిమా ద్వారా కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమాకు గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది. కేవలం హాస్యనటుడు, కథానాయకుడు మాత్రమే కాకుండా నృత్యకారుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా "కలర్ ఫోటో" సినిమాలో విలన్ పాత్ర పోషించి, ఏ పాత్రలోనైనా లీనమైపోగలని నిరూపించుకున్నాడు. సునీల్ నటించిన పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రకు తగిన న్యాయం చేసేవాడు.

 అయితే రీసెంట్ గా సునీల్ ఒక హెల్త్ ఇష్యూ కారణంగా హాస్పిటల్ లో చేరాడు ఇక ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా సునీల అభిమానించే ఎంతో మంది అభిమానులు ఈ వార్త తెలిసినప్పటి నుండి కలవరపడుతున్నారు సోషల్ మీడియా ద్వారా సునీల్ కు మెసేజ్ లు చేస్తున్నారు దీంతో వెంటనే సునీల్ ఈ విషయంపై స్పందిస్తూ ఇలా క్లారిటీ ఇచ్చాడు.

సునీల్ మాట్లాడుతూ.. " నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చాలామంది నాకు ఏమైందా అని కంగారు పడుతూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నాపై ఉన్న మీ అభిమానానికి థాంక్స్ అండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చిన్నపాటి సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు నా బంధువులు కూడా కంగారుపడి, మెసేజ్ లు,ఫోన్లు చేస్తున్నారు. ఎవరూ కంగారు పడకండి. త్వరలోనే రికవరీ అవుతాను. "అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ లో సునీల్ చికిత్స పొందుతున్నాడు.




ఆచార్యలో ఆ సీన్స్ కి విజిల్స్ పడటం ఖాయమట....

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>