EditorialParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/telangana-mla-citizenship-cancelled7761ff60-9101-4875-8f68-74d1f131cac7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/telangana-mla-citizenship-cancelled7761ff60-9101-4875-8f68-74d1f131cac7-415x250-IndiaHerald.jpgమరోవైపు చెన్నమనేని రమేష్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. కరోనా కాలంలోనూ కంటికి నిపించడంలేదని మండిపడుతూ వేములవాడలో బిక్షాటన చేశారు. నియోజకవర్గంలో రైతులు ఎన్నోసమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడ లేకపోవడంతో నిరసన తెలియజేశారు. ప్రజల ఓట్లతో గెలిసి, జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌ పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారు ఇలా వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.telangana mla citizenship cancelled;view;amala akkineni;srinivas;telugu desam party;germany;telangana;congress;adinarayanareddy;high court;telugu;court;parliment;assembly;mla;february;chennai;letter;news;local language;central government;june;kavuru srinivas;partyఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?telangana mla citizenship cancelled;view;amala akkineni;srinivas;telugu desam party;germany;telangana;congress;adinarayanareddy;high court;telugu;court;parliment;assembly;mla;february;chennai;letter;news;local language;central government;june;kavuru srinivas;partyFri, 05 Feb 2021 07:00:00 GMTవిదేశీ పౌరుడెవరైనా మనం చట్టాలు చెసే చట్టసభలో అది, రాష్ట్ర  శాసనసభ  కావచ్చు, దేశ పార్లమెంట్ కావచ్చు - సభ్యుడుగా ఉంటే జరిగే విపరిణామాలను ఊహించలేం. విదెశీయులైన ఆ పౌరులు మన దెశపాలనపై, ముఖ్యంగా రాజకీయాలపై, అంతరంగ వ్యవహారాలపై, రక్షణ వ్యూహాలపై  ప్రభావం చూపుతున్నట్లె. ఇది చాలా సీరియస్ సమస్య. ఇదె గత పదేళ్ళుగా తెలంగాణా అసెంబ్లీలొ జరుగుతుంది. 


అవిభాజ్య ఆంధ్రప్రదెశ్ లొ ఆయన తొలిసారి తెలుగుదేశం ద్వారా, ఆ తరవాత తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా, శాసనసభకు ప్రజా ప్రతినిధ్యం వహిస్తున్నారు. వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఆయన తెలంగాణ శాసనసభ్యుడా? కాదా? అన్నది తేలవలసి ఉంది. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ నేరానికి ఎవరు బాధ్యులు? ఇదె ప్రధాన ప్రశ్న. ఆయనే చన్నమనెని రమెష్. 


చెన్నమనేని రమేష్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేములవాడ నియోజకవర్గ శాసన సభ్యుడు. ఈయన కమ్యూనిస్ట్ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు, లలిత దేవి దంపతులకు జన్మించాడు.


ఈయన జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2010లో జరిగిన వేములవాడ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో శాసన సభ్యునిగా గెలుపొందాడు


2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 28000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

 


తెలంగాణ రాష్ట్ర సమితి నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ జర్మని యువతిని వివాహమాడారు. ఆయనకు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. జర్మనీ పౌరసత్వాన్ని రమేష్ 2023 వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు తెలిపింది..  



అయితే, దీన్ని అఫిడవిట్ రూపంలో కాకుండా మెమో రూపంలో వివరాలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది.



రమేష్‌ జర్మనీ పౌరుడని, ఆయన భారత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు కాబట్టి, ఆయన ఎన్నికను కొట్టివేయాలంటూ ఆది శ్రీనివాస్ అనే నాయకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చాలా రోజుల నుంచి విచారణ జరుగుతోంది.
 


జర్మనీ పౌరసత్వ ఆరోపణలు, పాస్ పోర్టు ఉపయోగించారన్న అభియోగంపైన చెన్నమనేని తరఫు న్యాయవాదులు అఫిడవిట్, వాదనల రూపంలొ స్పందించారు.



12 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 3, 2009లో భారత పౌరసత్వాన్ని పొందిన ధ్రువీకరణ పత్రాలను జర్మనీలోని అధికారికసంస్థలకు అందించిన లేఖతో పాటు  ఆ అధికారిక సంస్థ ఆమోదం తెలిపిన పాత, కొత్త డాక్యుమెంట్లు వాటి తర్జుమాలను చెన్నమనేని తరఫున న్యాయవాదులుహైకోర్టు లొ దాఖలు చేసారు.



1993 లొ చెన్నమనేని స్వచ్చందంగా జర్మని పౌరసత్వం తీసుకున్నప్పుడు భారత పౌరసత్వం ఎలాగయితే కోల్పోయారో, అదేవిధంగా 2009లో మళ్లీ స్వచ్చందంగా భారత పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పౌరసత్వాన్ని కోల్పోయారని చెప్పారు చెన్నమనేని కి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణలకు జర్మనీ నుంచి ఆధారాలు తేవాలన్న హైకోర్టు ఆదేశాలను హోంశాఖ నెరవేర్చలేదు.



ఈ విషయంపై హైకోర్టు హోంశాఖను గతంలో తీవ్రంగా తప్పు పట్టింది. తాను కోరింది పాత మెమోలు కాదని వచ్చె వాయిదా వరకు మొత్తం సమాచారంతొ రావాలని ఆదేశించింది. అధికారులు జర్మనీ కాన్సులేట్‌ కు లేఖ రాసి వివరాలు కూడా తీసుకోలేక పోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.



ఇంక అధికారాలు ఎందుకని ఆఫీసర్స్‌ను ప్రశ్నించింది. దీంతోపాటు అఫిడవిట్ దాఖలు చేయకుండా మెమో దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.


మరోవైపు చెన్నమనేని రమేష్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. కరోనా కాలంలోనూ కంటికి నిపించడంలేదని మండిపడుతూ వేములవాడలో బిక్షాటన చేశారు.



నియోజకవర్గంలో రైతులు ఎన్నోసమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడ లేకపోవడంతో నిరసన తెలియజేశారు. ప్రజల ఓట్లతో గెలిసి, జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌ పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారు ఇలా వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 




నేడు (04.02.2021) తెలంగాణ హైకోర్టు ఈ విషయమై విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణను కొనసాగించింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. అయితే తదుపరి విచారణను జూన్ 16 వాయిదా పడింది. 

తనకు భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని నేత చెన్నమనేని రమేష్ హైకోర్టుకు విన్నవించు కున్నారు. నేడు ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోసారి పూర్తి వాదనలు వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు న్యాయమూర్తి తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది.

కాగా, చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని, ఆ దేశ పాస్ పోర్టు తో మద్రాస్ నుండి జర్మనీ వెళ్లారని కేంద్ర హోంశాఖ గతంలోనే కోర్టుకు తెలిపింది

భారత పౌరసత్వం కలిగి ఉంటే జర్మనీ పాస్ పోర్టుతో ఎందుకు వెళ్లావని చెన్నమనేని రమేష్‌ ను హైకోర్టు ఇదివరకే ప్రశ్నించింది. ఈ పౌరసత్వ వివాదంపై ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయి. తదుపరి విచారణలో ఏం తేలుతుందోనని ఆసక్తి ఏర్పడింది. మొత్తం మీద విదేశీయుడు మన శాసన సభలో పదేళ్ల పాటు ఎంఎల్ ఏ గా కొనసాగటం అన్నది చాలా సీరియస్ విషయమని చెప్పక తప్పదు.





జగడ్డ: శ్రీకాకుళం జిల్లాలో ఏకగ్రీవాల లెక్కలు వింటే షాకవ్వాల్సిందే..?

హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?

గుడివాడలో తమ్ముళ్ళు రివర్స్ అవుతున్నారుగా...!

భూమా అడ్డాలో మారిన రాజకీయం....దెబ్బ పడిపోతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>