PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-allegations-on-tdp-in-temple-issues3939db68-3b8d-4d5f-9f98-e20ad648d3ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-allegations-on-tdp-in-temple-issues3939db68-3b8d-4d5f-9f98-e20ad648d3ff-415x250-IndiaHerald.jpgవైసీపీ ప్రభుత్వం కొత్త లెక్కలు బయటకు తీసింది. పోలీసు రికార్డులంటూ.. కొత్త చిట్టా విప్పింది. ఆ చిట్టాలో ఆలయాల పాపాలన్నీ టీడీపీ ఖాతాలోకి నెట్టేసింది. టీడీపీ హయాంలోనే అత్యథికంగా ఆలయాలపై దాడులు జరిగాయని వివరించింది. అదే క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ దాడుల సంఖ్య తగ్గిందని, పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. temple issues in ap;police;arrest;tdp;jio;ycpఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..temple issues in ap;police;arrest;tdp;jio;ycpFri, 05 Feb 2021 11:00:00 GMTవైసీపీ ప్రభుత్వం కొత్త లెక్కలు బయటకు తీసింది. పోలీసు రికార్డులంటూ.. కొత్త చిట్టా విప్పింది. ఆ చిట్టాలో ఆలయాల పాపాలన్నీ టీడీపీ ఖాతాలోకి నెట్టేసింది. టీడీపీ హయాంలోనే అత్యథికంగా ఆలయాలపై దాడులు జరిగాయని వివరించింది. అదే క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ దాడుల సంఖ్య తగ్గిందని, పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపింది.

చంద్రబాబు హయాంలోనే అత్యధికంగా ఆలయాలపై దాడులు జరిగాయని, ఒక్క 2016 సంవత్సరంలోనే 200 దాడులు జరిగాయని పోలీసు రికార్డుల్లో ఉన్నట్టు చెబుతున్నారు వైసీపీ నేతలు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఆలయాలపై దాడులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో ఆలయాలపై 145 దాడులు జరిగినప్పటికీ వీటి ప్రధాన కుట్రదారులు టీడీపీ నేతలేనంటూ విమర్శిస్తున్నారు. ఈ కేసుల్లో ఇంతవరకు 25మంది టీడీపీ నేతల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని వీరిలో 21మందిని అరెస్ట్ చేశారని పేర్కొంటున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలివే..
- రాష్ట్రవ్యాప్తంగా 59,433 ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్‌తో మ్యాపింగ్‌ చేయడం.
- ఆలయాలలో సెక్యూరిటీ ఆడిటింగ్‌ నిర్వహించి వాచ్‌ మెన్‌ లను నియమించడం.
- అగ్నిమాపక పరికరాలు, జనరేటర్ల ఏర్పాటు
- మత సామరస్య పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం
- గ్రామాల్లోకి అసాంఘిక శక్తులు, అనుమానిత వ్యక్తులు రాకుండా కట్టడి చేసేందుకు గ్రామ రక్షణ దళాల ఏర్పాటు

మొత్తమ్మీద ఆలయాల ఘటనల వ్యవహారంలో టీడీపీని ముద్దాయిగా చేశారు వైసీపీ నేతలు. టీడీపీ హయాంలో దాడుల ఘటనలు ఎక్కువగా జరిగాయని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అలాంటి ఘటనలు తగ్గాయని లెక్కలతో సహా నిరూపిస్తున్నారు. అదే సమయంలో తమ హయాంలో తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలను కూడా వివరిస్తున్నారు. కేవలం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే టీడీపీ నేతలు, తమ హయాంలో ఆలయాల కుట్రలకు తెరతీశారని అంటున్నారు. అయితే ఆ కుట్రలను పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేస్తున్నారని, ఘటనలై సకాలంలో విచారణ జరిపి నిజానిజాలు వెలుగు తీస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.




బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!

ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..

తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>