VictoryVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/victory/139/george-reddy-victory-as-human-beinge92cadff-e512-42ad-8a14-a356266c70ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/victory/139/george-reddy-victory-as-human-beinge92cadff-e512-42ad-8a14-a356266c70ec-415x250-IndiaHerald.jpgజార్జి రెడ్డికి కాలేజీలో అత్యంత ఇష్టమైన ప్రదేశాలు రెండే రెండు.. ఒకటి లైబ్రరీ, మరొకటి జిమ్. ఎక్కువ సమయాన్ని ఈ రెండు ప్రదేశాల్లోనే గడిపేవాడు. జార్జిరెడ్డి పుస్తకాల పురుగు, తన సబ్జెక్టుకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఎన్నో పుస్తకాలను చదివేవాడు. george reddy victory as human being;cbn;chiranjeevi;jeevitha rajaseskhar;surya sivakumar;police;university;history;letter;murder.;local language;international;college;nijam;george reddy;reddy;maha;panjaa;mantraవిప్లవ నాయకుడు జార్జి రెడ్డి జీవిత రహస్యాలివే...?విప్లవ నాయకుడు జార్జి రెడ్డి జీవిత రహస్యాలివే...?george reddy victory as human being;cbn;chiranjeevi;jeevitha rajaseskhar;surya sivakumar;police;university;history;letter;murder.;local language;international;college;nijam;george reddy;reddy;maha;panjaa;mantraFri, 05 Feb 2021 15:00:00 GMTఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎంతమంది కోసం బ్రతికాము అన్నది ముఖ్యం. అభ్యుదయ భావాలు కలిగిన ఒక మహోన్నత వ్యక్తిని ఏకంగా 60 కత్తిపోట్లు పొడిచి హతమార్చారు. చరిత్ర చెప్పని ఆ మహోన్నత విప్లవ నాయకుడే జార్జి రెడ్డి.  ఉస్మానియా కాలేజీ క్యాంపస్ లో ఉదయించిన విప్లవ సూర్యుడు జార్జి రెడ్డి. ఇతడు ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. దోపిడీ వ్యవస్థను కూల్చి సమ సమాజాన్ని నిర్మించాలనుకున్న ఇతని జీవితం అర్ధాంతరంగా, దారుణంగా ముగిసింది. నిండా ఇరవై ఐదు ఏళ్ళు కూడా బ్రతక లేదు కానీ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయేలా పదిమందికి ఉపయోగపడే పనులు చేశారు.

జార్జిరెడ్డి వంటి ఆదర్శ వ్యక్తిని కోల్పోవడం నిజంగా మన దురదృష్టం. జార్జి రెడ్డి ఎవరు 25 ఏళ్లకే అంత దారుణంగా ఎందుకు చంపేశారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉస్మానియా కాలేజ్ ఎంతోమంది మేధావులను అందించిన ఈ విశ్వవిద్యాలయం, ఎంతోమంది విద్యార్థి నాయకులను కూడా తయారుచేసింది. జార్జి రెడ్డి ఒక మెరిట్ స్టూడెంట్ తన పైచదువుల కోసం ఉస్మానియా కాలేజ్ లో చేరారు. జార్జి రెడ్డి ఒక్క రంగం కాదు పలు రంగాల్లో నిష్ణాతుడైన వ్యక్తి. చదువులో, నైతిక ప్రవర్తనలో, ఆలోచనా స్పష్టతలో ఉన్నత భావం... మార్పు కోసం చేసే పనిలో అత్యున్నత అంకితభావం...ఇవన్నీ కలబోస్తే జార్జి రెడ్డి.

జార్జి రెడ్డికి కాలేజీలో అత్యంత ఇష్టమైన ప్రదేశాలు రెండే రెండు.. ఒకటి లైబ్రరీ, మరొకటి జిమ్. ఎక్కువ సమయాన్ని ఈ రెండు ప్రదేశాల్లోనే గడిపేవాడు. జార్జిరెడ్డి పుస్తకాల పురుగు, తన సబ్జెక్టుకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఎన్నో పుస్తకాలను చదివేవాడు. చెగువేరా విప్లవ వీరుడి బయోగ్రఫీ జార్జ్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలను క్షుణ్ణంగా చదివి వాటిపై అవగాహన పెంచుకున్నాడు. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉండే జార్జి రెడ్డి అక్కడ కాలేజీలో తక్కువ కులం వారిపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు సహించలేకపోయాడు.

ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ గుండాయిజం, రౌడీయిజంకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కాలేజీలో జరిగే అన్యాయాన్ని భరించలేక అమాయకులకు అండగా నిలబడ్డాడు జార్జ్. అరాచకాలు చేసేవారికి ఎదురు తిరిగి పంజా విసిరాడు. ఈ అరాచకాలను అనగ తొక్కాలి అంటే, విప్లవ విద్యార్థి నిర్మాణం ఒకటే మార్గం అని భావించాడు జార్జి రెడ్డి. బడా బాబులు అల్లర్లతో బాధపడుతున్న బడుగు బలహీనవర్గాల విద్యార్థులను,  టీజింగ్ కి  గురవుతున్న ఆడపడుచులకు తన పదునైన ప్రసంగాల ద్వారా ధైర్యం పోశాడు. వీటన్నింటినీ చూస్తూ భరించలేని అక్కడి స్థానిక రాజకీయ నాయకులు జార్జి రెడ్డిని చంపడానికి ఎన్నో సార్లు ప్రయత్నించారట.

ఎంతకీ కుదరకపోవడంతో జార్జి రెడ్డి ఒంటరిగా ఉండే  సమయంలో పక్కా ప్లానింగ్ చేశారు. బయట రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన దాదాపు 30 మంది రౌడీలు కాలేజీ లోకి చొరబడి అతి దారుణంగా హత్య చేశారు. అయినా తన చివరి శ్వాశ వరకు పోరాడాడు మహా వీరుడు జార్జ్. చివరికి ఈ లోకం ఒక విప్లవ  వీరుడిని కోల్పోయింది. ఆ తరువాత ఈ కేసును తూతూ మంత్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు, రాజకీయ ప్రోద్బలంతో ఈ హత్యకు కారణమైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఇప్పటికీ జార్జి రెడ్డిని  ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అతని బాటలో ముందుకు నడుస్తున్నారు. 1972 ఏప్రిల్ 14న పాతికేళ్ల ప్రాయంలో వీరుడిలా మరణించాడు జార్జి రెడ్డి. జార్జి మరణించాడు కానీ అతని ఆశయాలు  ఈ లోకాన్ని విడిచి వెళ్ళ లేదు. గొప్ప వారికి మరణం లేదంటారు. వారు చిరంజీవులు. జార్జి చిరంజీవి.. చిరంజీవి జార్జి’’.


మన పెద్దలు వాడే సౌందర్య చిట్కా ఏంటో తెలిస్తే..మీరూ పాటిస్తారు..

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పంచాయ‌తీల్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అన్యాయ‌మే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>