SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news95f112b3-10aa-4ff0-bcde-5ad703c7f31f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news95f112b3-10aa-4ff0-bcde-5ad703c7f31f-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు భారత్ - ఇంగ్లాండ్ మద్య మొదటి టెస్ట్ మొదలు అయ్యింది. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు బర్న్స్‌, సిబ్లీ శుభారంభం అందించారు. ఇదిలా ఉండగా మ్యాచ్ ప్రారంభానికి ముందు అందరి చూపు భారత అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పై పడింది. ఎందుకంటే స్వదేశంలో అతనికి మొదటి టెస్ట్ కావడం, ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడాడు.sports news;india;england;netizens;media;rishabh pant;letter;international;indianభారత్ vs ఇంగ్లాండ్ : బుమ్రా కు షాక్ ఇచ్చిన పంత్..నెటిజన్స్ ఫైర్ !!భారత్ vs ఇంగ్లాండ్ : బుమ్రా కు షాక్ ఇచ్చిన పంత్..నెటిజన్స్ ఫైర్ !!sports news;india;england;netizens;media;rishabh pant;letter;international;indianFri, 05 Feb 2021 17:00:00 GMTఎట్టకేలకు భారత్ - ఇంగ్లాండ్ మద్య మొదటి టెస్ట్ మొదలు అయ్యింది. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు బర్న్స్‌, సిబ్లీ శుభారంభం అందించారు. ఇదిలా ఉండగా మ్యాచ్ ప్రారంభానికి ముందు అందరి చూపు భారత అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పై పడింది. ఎందుకంటే  స్వదేశంలో అతనికి మొదటి టెస్ట్ కావడం, ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడాడు.

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీసి మంచి గణాంకాలనే నమోదు చేశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఘనత కూడా ఉంది. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా బుమ్రా రికార్డుకెక్కాడు. దీంతో ఈ టెస్ట్ సిరీస్ స్వదేశంలో అతనికి మొదటి టెస్ట్ కావడంతో అతని ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారిన నేపథ్యంలో ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బుమ్రాకు ఓ గొప్ప రికార్డును దూరం చేశాడు .

మ్యాచ్ ప్రారంభం అయ్యాక బుమ్రా తన బౌలింగ్ లో తొలి బంతి విసిరాడు.ఆ బంతి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బ్యాటును తాకుతూ కీపర్ పంత్ వద్దకు వెళ్లింది. కానీ పంత్ దానిని అందుకోలేక జారవిడిచాడు. దీంతో స్వదేశంలో తొలి టెస్ట్ లోనూ అదికూడా తొలి బంతికే వికెట్ తీసే అరుదైన ఘనతకు బుమ్రా ను దూరం చేశాడు పంత్. దీంతో సోషల్ మీడియా లో పంత్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. పంత్ తన డ్రాప్ క్యాచుల రికార్డును తానే అధిగమిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఏపిలో విద్యార్థులకు షాక్.. పనివేళల్లో మార్పులు..!

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?

నిజ జీవితంలో కార్తీక దీపం సౌందర్య, కార్తీక్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>