MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal10ffeaaf-209c-4a21-a4ef-66c4ae0174ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal10ffeaaf-209c-4a21-a4ef-66c4ae0174ce-415x250-IndiaHerald.jpgవివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రతి నిత్యం ఎదో ఒక్క విషయంలో వార్తలో నిలుస్తూనే ఉంటాడు. ఇక ఆయన రూటే సపరేట్. ఇక ప్రణయ్ అమృత జీవితాల ఆధారంగా ఓ సినిమాను రూపొందించాగా ఆ సినిమా కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు అనుకోని షాక్ త‌గిలింది. ram gopal;soniagandhi;ram gopal varma;amrutha;nithya new;ram pothineni;cinema;police;media;court;pranay 1రామ్ ‌గోపాల్ వర్మ సినిమాకు షాకిచ్చినా‌ సెన్సార్ బోర్డు..!రామ్ ‌గోపాల్ వర్మ సినిమాకు షాకిచ్చినా‌ సెన్సార్ బోర్డు..!ram gopal;soniagandhi;ram gopal varma;amrutha;nithya new;ram pothineni;cinema;police;media;court;pranay 1Fri, 05 Feb 2021 11:00:00 GMTప్రణయ్ అమృత జీవితాల ఆధారంగా ఓ సినిమాను రూపొందించాగా ఆ సినిమా కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు అనుకోని షాక్ త‌గిలింది. సాధార‌ణంగా త‌న వ్యాఖ్యల‌తో సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రికీ షాక్ ఇచ్చే ఆర్జీవీకి ఎవ‌రు షాక్ ఇచ్చారా? అనే సందేహం రాక మాన‌దు. ఎవ‌రో కాదు.. సెన్సార్ బోర్డు స‌భ్యులు.

ఇక పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నాన్ని సృష్టించిందో మ‌న‌కు తెలుసు. దీనిపై ‘దిశ ఎన్‌కౌంట‌ర్ ’ పేరుతో సినిమాను రూపొందించ‌నున్న‌ట్లు ఆర్జీవీ తెలియ‌జేశారు. అన్న‌ట్లుగానే రామ్‌గోపాల్ వ‌ర్మ దిశ ఎన్‌కౌంట‌ర్ సినిమాను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి ఈ నెల 19న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు. ఈ సినిమాపై దిశ కుటుంబ స‌భ్యులు అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే దిశ ఎన్‌కౌంట‌ర్ సినిమాను వీక్షించిన నలుగురు స‌భ్యులున్న సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. దీంతో సినిమా ఇప్పుడు రివైజింగ్ క‌మిటీ చూడ‌నుంది. దీన్ని ఎనిమిది మంది స‌భ్యులున్న రివైజింగ్ క‌మిటీ చూసి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుందో అనే ఆస‌క్తి అందరిలోనూ నెల‌కొంది. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్‌, సోనియా, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 19న సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావించిన త‌రుణంలో సెన్సార్ స‌భ్యుల నుంచి అవాతరం ఏర్ప‌డింది. హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో జ‌రిగిన దిశ ఘ‌ట‌న‌పై దేశం యావ‌త్తు విస్తుపోయింది. పోలీసులు నేర‌స్థుల‌ను ప‌ట్టుకుని ఎన్‌కౌంట‌ర్ కూడా చేశారు.


బీట్రూట్ పకోడాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!

ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..

తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>