PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో చూసి చూడనట్టుగా పోతున్నారనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రాకపోయినా సరే ముఖ్యమంత్రి జగన్ వారి విషయంలో అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలను జగన్ పిలిచినా సరే అసలు అందుబాటులో కూడా రావడం లేదు అని అంటున్నారు. బెంగళూరులో వ్యాపారాలు చేసుకోవడం లేకపోతే హైదరాబాద్ లో ఉండటం వంటివి మాత్రమే సదరు ఎమ్మెల్యేలు చేయడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం పెరిగిys jagan;hyderabad;jagan;andhra pradesh;chief minister;bengaluru 1;partyజగన్ మౌనాన్ని వాళ్ళు చేతగాని తనం అనుకున్నారా...?జగన్ మౌనాన్ని వాళ్ళు చేతగాని తనం అనుకున్నారా...?ys jagan;hyderabad;jagan;andhra pradesh;chief minister;bengaluru 1;partyFri, 05 Feb 2021 10:07:25 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో చూసి చూడనట్టుగా పోతున్నారనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రాకపోయినా సరే ముఖ్యమంత్రి జగన్ వారి విషయంలో అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలను జగన్ పిలిచినా సరే అసలు అందుబాటులో కూడా రావడం లేదు అని అంటున్నారు. బెంగళూరులో వ్యాపారాలు చేసుకోవడం లేకపోతే హైదరాబాద్ లో ఉండటం వంటివి మాత్రమే సదరు ఎమ్మెల్యేలు చేయడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం పెరిగిపోతుంది.

కనీసం తన మాటకు కూడా ఎమ్మెల్యేలు విలువ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రిలో ఆగ్రహం ఉంది. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డారు అనే భావనలో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ల విషయంలో కాస్త చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళు పార్టీ కోసం పని చేశారని అలాగే నిధులు కూడా భారీగా ఖర్చు పెట్టారని ఇలాంటి తరుణంలో వాళ్ళని ఇబ్బంది పెడితే బాగోదు అని సీఎం జగన్ వాళ్ల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం కఠినంగా ముందుకు వెళ్లాలని భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని టాక్.

అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల తీరు కారణంగా పార్టీలో కార్యకర్తలు ఇబ్బంది పడటమే సంచలనంగా మారింది అని చెప్పాలి. కొంతమంది ఎమ్మెల్యేలు అసలు కార్యకర్తలతో కనీసం ఫోన్లో కూడా చర్చలు జరపడం లేదని తెలుస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమాచారాన్ని కూడా తెప్పించుకున్నారు అని తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కచ్చితంగా సంచలనంగా మారే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యేల విషయంలో జగన్ కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.


మూడు రాజదానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>