Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/tej-pratap-yadavaf7553d1-4670-4ddb-9c39-76850abc7d3f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/tej-pratap-yadavaf7553d1-4670-4ddb-9c39-76850abc7d3f-415x250-IndiaHerald.jpgప్రాచీన కాలంలో మహారాజులు మారువేషాల్లో వీధుల్లో తిరుగుతూ తమ పాలన ఎలా ఉందా అని ఆరా తీసేవారట. ఎక్కడైనా తప్పు జరిగితే తిరిగి వచ్చి చర్యలు తీసుకునేవారట. అయితే ఇప్పుడు రాజ్యాలూ పోయాయి.. రాజులూ పోయారు. ప్రజాస్వామ్యంలో, ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులతో కూడిన పాలక వర్గాలు వచ్చేశాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం అప్పటిలానే మారు వేషాల్లో తిరుగుతూ విచిత్రవేషధారణలో..tej pratap yadav;laloo prasad yadav;shiva;deva;krishna;prasad;tiru;bihar;prime minister;chief minister;king;sri krishna;lord siva;cycle;wife;v;mantraభక్తుడి వేషంలో మాజీ సీఎం తనయుడు.. సైకిల్ పైనుంచి కిందపడడంతో...భక్తుడి వేషంలో మాజీ సీఎం తనయుడు.. సైకిల్ పైనుంచి కిందపడడంతో...tej pratap yadav;laloo prasad yadav;shiva;deva;krishna;prasad;tiru;bihar;prime minister;chief minister;king;sri krishna;lord siva;cycle;wife;v;mantraThu, 04 Feb 2021 15:52:36 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రాచీన కాలంలో మహారాజులు మారువేషాల్లో వీధుల్లో తిరుగుతూ తమ పాలన ఎలా ఉందా అని ఆరా తీసేవారట. ఎక్కడైనా తప్పు జరిగితే తిరిగి వచ్చి చర్యలు తీసుకునేవారట. అయితే ఇప్పుడు రాజ్యాలూ పోయాయి.. రాజులూ పోయారు. ప్రజాస్వామ్యంలో, ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులతో కూడిన పాలక వర్గాలు వచ్చేశాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం అప్పటిలానే మారు వేషాల్లో తిరుగుతూ విచిత్రవేషధారణలో దర్శనమిస్తుంటారు. ప్రస్తుతం బీహార్ మాజీ ముఖ్యమంత్రి prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా అదే తరహాలో దేవుడి భక్తుల వేషాల్లో తిరుగుతూ చుట్టుపక్కల వారికి షాక్ ఇస్తుంటాడు.

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ తన విచిత్ర వేషధారణతో తిరిగే ఫొటోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేయడమే కాకుండా మీడియాలో కూడా నిలుస్తుంటారు. ముఖ్యంగా తన భక్తి భావాన్ని ప్రకటించుకోవడంలో తేజ్ ఎప్పుడూ ముందుంటారు. శివుడు కృష్ణుడు గెటప్‌లు వేసుకుని, వారి భక్తుల వేషధారణలు ధరించి ప్రజలకు కనువిందు చేస్తుంటారు. కొన్ని సార్లయితే ఏకంగా శ్రీకృష్ణుడి వేషం వేసి మురళీగానం కూడా చేస్తుంటారు. గతంలో ఆయన సైకిల్‌పై తన భార్య ఐశ్వర్యను ఎక్కించుకుని తిరిగిన ఫొటోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఇప్పడు మరోమారు తేజ్ ప్రతాప్ భక్తుని వేషధారణలో బృందావన్‌లో సైకిల్‌పై తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఫోటోలో ఓ ఫోటోలో తేజ్ సైకిల్ మీద నుంచి పడిపోయిన ఫొటో కూడా ఉంది. తేజ్ ప్రతాప్ సైకిల్‌పై వెళుతున్న సందర్భంలో అక్కడున్నవారు తేజ్‌ను ఆసక్తిగా గమనించారు. ఈ సమయంలో అతని సెక్యూరిటీ గార్డులు కూడా సైకిల్‌పై అతనిని అనుసరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తేజ్ బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతడిని పైకి లేపి తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఐశ్వర్యారాయ్ అంటే పరమ అసహ్యం: బిగ్ బి కూతురు

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>