Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/head-master-beat-a-student-for-asking-ammavodi6959ce00-59eb-4e1d-be53-f53461897d69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/head-master-beat-a-student-for-asking-ammavodi6959ce00-59eb-4e1d-be53-f53461897d69-415x250-IndiaHerald.jpg‘నన్నే అమ్మఒడి పథకం గురించి అడుగుతావా..? నీకెంత ధైర్యం..?’ ఇవి ఓ హెచ్ఎం విద్యార్థితో అన్న మాటలు. ఈ మాటలంటూనే ఆ విద్యార్థి చెంప ఛెళ్లుమనిపించాడు. అక్కడితో ఆగకుండా బయటకు తీసుకొచ్చి చితకబాదాడు. ఈ దృశ్యమంతా అక్కడున్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో..ammavodi;district;vishakapatnam;school;fort;local language;ammavodi;tuni;fatherఅమ్మఒడి రాలేదన్న విద్యార్థి.. హెచ్‌ఎం ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇంత దారుణమా..అమ్మఒడి రాలేదన్న విద్యార్థి.. హెచ్‌ఎం ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇంత దారుణమా..ammavodi;district;vishakapatnam;school;fort;local language;ammavodi;tuni;fatherThu, 04 Feb 2021 13:49:50 GMTవిశాఖపట్నం: ‘నన్నే అమ్మఒడి పథకం గురించి అడుగుతావా..? నీకెంత ధైర్యం..?’ ఇవి ఓ హెచ్ఎం విద్యార్థితో అన్న మాటలు. ఈ మాటలంటూనే ఆ విద్యార్థి చెంప ఛెళ్లుమనిపించాడు. అక్కడితో ఆగకుండా బయటకు తీసుకొచ్చి చితకబాదాడు. ఈ దృశ్యమంతా అక్కడున్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతునిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం రుప్పేశ్‌కు అనే విద్యార్థి 8వ తరగతి చదివాడు. కానీ అప్పట్లో అమ్మఒడి పథకం నుంచి అతడికి లబ్ధి చేకూరలేదు. నిరుపేద కుటుంబానికి చెందిన రుప్పేశ్‌తో పాటు అతని తల్లిదండ్రులు అమ్మఒడి పథకం వచ్చేలా చూడాలని పలుమార్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మను కలిసి ప్రాధేయపడ్డారు. కానీ సాంకేతిక కారణాలతోనే రాలేదని ఆయన చెప్పి తప్పించుకున్నాడు.

ఈ ఏడాది రుప్పేశ్‌ పాఠశాల మారాడు. సమీపంలో వున్న నర్సింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేరాడు. ఈ పాఠశాలలో అమ్మఒడి పథకం గురించి హెచ్‌ఎంను అడగ్గా.. ముందు చదివిన పాఠశాలలోని హెచ్‌ఎం అప్‌లోడ్‌ చేశారా? లేదా? తెలుసుకుని రావాలని సూచించారు. దీంతో ఆఖరి ప్రయత్నంగా రుప్పేశ్‌ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం శర్మను కలిసి పథకం లబ్ధి గురించి అడిగాడు.

దీంతో హెచ్‌ఎం శర్మ ఒక్కసారిగా ఎక్కడ లేని కోపం తెచ్చుకున్నాడు. విచక్షణ మరచి విద్యార్థి రుప్పేశ్‌ చెంప ఛెళ్లుమనిపించాడు. అంక్కడితో ఆగకుండా ‘నన్నే అమ్మఒడి పథకం డబ్బులు అడిగుతావా..? ఎంత ధైర్యం నీకు’ అంటూ విద్యార్థిని రోడ్డుపైకి తీసుకువచ్చి చితకబాదాడు. ఈ ఘటనను స్థానికులు చాలామంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ విషయమై హెచ్‌ఎం శర్మను ప్రశ్నించగా.. ఓ విచత్రమైన కథను చెప్పుకొచ్చాడు. విద్యార్థి రుప్పేశ్‌, అతని తండ్రి తనను తరచూ వేధిస్తున్నారని, అందుకే మందలించానని చెప్పడం గమనార్హం. బ్యాంకు ఖాతా తప్పుగా పడడం వల్లనే రుప్పేశ్‌కు అమ్మఒడి పథకం అందలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఘటన అనంతరం రూప్నేశ్ కుటుంబానికి అండగా అనేకమంది నిలుస్తున్నారు. వారికి ఎందుకు పథకం వర్తించలేదో తెలుసుకుని, వారికి లబ్ధి చేకూరేలా చూస్తామని చెబుతున్నారు.




బంగారం కొనాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్..ఈరోజు ధరలు ఇలా...!!

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>