SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news04e45303-3f8a-4708-a1b8-464e381942e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news04e45303-3f8a-4708-a1b8-464e381942e3-415x250-IndiaHerald.jpgఫిబ్రవరి 5 నుండి మరో ప్రతిష్టాత్మక పోరుకు సర్వం సిద్దమైంది. ప్రపంచ క్రికెట్ లో రెండు బలమైన జట్లుగా ఉన్న టీమిండియా , ఇంగ్లాండ్ జట్లు స్వదేశంలో తలపడనున్నాయి. భారత్ లో ఇంగ్లాండ్ సుదీర్ఘ పర్యటన చెయ్యనుంది. ఈ పర్యటనలో భాగంగా 4 టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టి20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 5నుండి చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. అయితే సిరీస్ మొదలవ్వకుండానే ఇంగ్లాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.sports news;ali;cricket;india;england;february;chennai;letter;chepauk;paruguసిరీస్ కు ముందే ఇంగ్లాండ్ కు షాక్ !!సిరీస్ కు ముందే ఇంగ్లాండ్ కు షాక్ !!sports news;ali;cricket;india;england;february;chennai;letter;chepauk;paruguThu, 04 Feb 2021 22:20:10 GMTఫిబ్రవరి 5 నుండి మరో ప్రతిష్టాత్మక పోరుకు సర్వం సిద్దమైంది. ప్రపంచ క్రికెట్ లో రెండు బలమైన జట్లుగా ఉన్న టీమిండియా , ఇంగ్లాండ్ జట్లు స్వదేశంలో తలపడనున్నాయి. భారత్ లో ఇంగ్లాండ్ సుదీర్ఘ పర్యటన చెయ్యనుంది. ఈ పర్యటనలో భాగంగా 4 టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టి20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 5నుండి చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. అయితే సిరీస్ మొదలవ్వకుండానే ఇంగ్లాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా  జాక్‌ క్రాలీ సిద్ధమవుతూ తన రూం నుంచి వస్తూ మార్బుల్‌ ఫ్లోర్‌పై జారిపడ్డాడు. దీంతో అతని చేతికి గాయమవ్వగా.. క్రాలీని వెంటనే స్కానింగ్‌కు తరలించారు. అయితే రిపోర్ట్‌ ప్రకారం క్రాలీ మణికట్టుకు తీవ్రమైన గాయమైనట్లు తేలడంతో తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఈసీబీ వెల్లడించింది. కాగా క్రాలీ ఇంగ్లండ్‌ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్‌ సెంచరీతో(267 పరుగులు) మెరవడంతో క్రాలీ అందరి దృష్టిలో పడ్డాడు.

మరి క్రాలీ దూరమవ్వడం ఇంగ్లాండ్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. కాగా గాయపడ్డ క్రాలీ స్థానంలో రోరీ బర్న్స్‌.. డోమ్ సిబ్లీతో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. అయితే జట్టులో అదనపు ఓపెనర్‌గా ఉన్న ఓలీ పోప్‌ మూడో స్థానంలో బరిలోకి దిగితే.. కెప్టెన్‌ జో రూట్‌ నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మూడో స్థానంలో బరిలోకి దిగితే మాత్రం ఓలీ పోప్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ స్థానం మారే అవకాశం కనిపిస్తుంది. అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, ఆర్చర్‌లతో పేస్‌ దళం పటిష్టంగా ఉండగా.. ఆల్‌రౌండర్‌ కోటాలో మెయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌లో ఒకరికే అవకాశం ఉంది..  


బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>