PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/superpower-sheikh-that-s-all-if-you-cross-the-bor79bc3d72-2906-43df-b1b3-db18a44fdea0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/superpower-sheikh-that-s-all-if-you-cross-the-bor79bc3d72-2906-43df-b1b3-db18a44fdea0-415x250-IndiaHerald.jpgఅమెరికాను మంచు తుఫాన్‌ ముంచెత్తింది. తూర్పు తీర ప్రాంతాలను పూర్తిగా కమ్మేస్తోంది. ఈ ప్రభావంతో చాలా చోట్ల విమాన రాకపోకలు నిలిచిపోయాయి. న్యూయార్క్ నగరం స్తంభించిపోయింది. దీంతో వాక్సిన్ కేంద్రాలను మూసేశారు. ముఖ్యంగా న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాల్లోని చాలా ప్రాంతాల్లో 48 సెంటి మీటర్ల మేర మంచు కురువగా, న్యూయార్క్ నగరంలో 42 సెంటిమీటర్ల మేర మంచు కురిసింది. దీంతో న్యూయార్క్ నగరం, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ తుపాను పెన్సీల్వేనియా, న్యూఇంగ్లాండ్ వైపు కదులుతోందని అమెరికా జాతీయ వాతావరణ కేsuperpower sheikh that's all if you cross the bor;england;american samoa;jersey;governor;central government;newyorkఅగ్రరాజ్యం షేక్.. గడప దాటి వస్తే అంతే సంగతులు..!అగ్రరాజ్యం షేక్.. గడప దాటి వస్తే అంతే సంగతులు..!superpower sheikh that's all if you cross the bor;england;american samoa;jersey;governor;central government;newyorkThu, 04 Feb 2021 13:00:00 GMTన్యూయార్క్ నగరం స్తంభించిపోయింది. దీంతో వాక్సిన్ కేంద్రాలను మూసేశారు. ముఖ్యంగా న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాల్లోని చాలా ప్రాంతాల్లో 48 సెంటి మీటర్ల మేర మంచు కురువగా, న్యూయార్క్ నగరంలో 42 సెంటిమీటర్ల మేర మంచు కురిసింది. దీంతో న్యూయార్క్ నగరం, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ తుపాను పెన్సీల్వేనియా, న్యూఇంగ్లాండ్ వైపు కదులుతోందని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

భారీగా కురుస్తోన్న మంచు కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నచోట్ల పాఠశాలలను మూసివేశారు. న్యూయార్క్ నగరంలోని దాదాపు 44 కౌంటీలలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ప్రకటించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పారు. కొన్ని చోట్ల తుపాను ప్రభావం తగ్గడంతో రోడ్లపై ఉన్న మంచు తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ఇక న్యూజెర్సీలోనూ మంచు తుపాను ప్రభావంతో బస్సు, రైలు సర్వీసులను నిలిపివేశారు. భారీగా కమ్మేస్తున్న మంచు కారణంగా దాదాపు 1600 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. మంచు తుపాను కారణంగా వాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. కనెక్టికట్, న్యూజెర్సీ, ఫిలడల్ఫియా, వాషింగ్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో వాక్సిన్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులు ఇంటినుంచి బయటకి రాకపోవడమే మంచిదని అధికారులు ప్రజలకు సూచించారు. మంచు తుపాను పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులతో చర్చించినట్లు వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. మొత్తానికి మంచుదెబ్బకు అగ్రరాజ్యం షేక్ అయిపోయింది. తీవ్రంగా కురుస్తున్న మంచు తుఫాన్ అమెరికాను తలకిందుకు చేస్తోంది. బయటికి వచ్చేందుకు ప్రజలకు తెగ భయపడిపోతున్నారు. మంచు తుఫాన్ బీభత్సంతో ఇంట్లోనే ఉండి గజగజ వణికిపోతున్నారు. ఫస్ట్ బతికుంటే ఏమైనా తిని బతకొచ్చు బయటికైతే వచ్చే ప్రసక్తే లేదు అనేలా ప్రవర్తిస్తున్నారు.






కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>