EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/do-you-know-why-ycp-is-targetting-nimmagadda410a8e81-7c88-4b3a-aa42-21f63ea107ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/do-you-know-why-ycp-is-targetting-nimmagadda410a8e81-7c88-4b3a-aa42-21f63ea107ca-415x250-IndiaHerald.jpgమొదటిదేమో కింజరాపు అప్పలనాయుడు వైసీపీ తరపున సర్పంచుగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పలనాయుడు నిర్ణయాన్ని మార్చుకోవాలని అచ్చెన్న ఫోనులో పదే పదే మాట్లాడారు. అంటే అప్పలనాయుడును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని అచ్చెన్న ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోయేసరికి నామినేషన్ సందర్భంగా అప్పలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అచ్చెన్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటం తర్వాత అప్పలనాయుడు నామినేషన్ను అడ్డుకునే ప్రయత్నం చేయటంపై నిమ్మగడ్డ తనంతట తానుగా ఎందుకు చర్యలకు దిగలేదు ? అన్నదే పెద్ద ప్రశ్న. సరే అప్పలనాయుడు అచ్చెన్నnimmagadda election commissioner ycp jagan tdp nai;cbn;kumaar;telugu desam party;n. chandrababu naidu;telugu;police;audio;tdp;central government;ycp;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డను వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోందో తెలుసా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డను వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోందో తెలుసా ?nimmagadda election commissioner ycp jagan tdp nai;cbn;kumaar;telugu desam party;n. chandrababu naidu;telugu;police;audio;tdp;central government;ycp;partyThu, 04 Feb 2021 03:00:00 GMTస్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పుడు మాట్లాడినా ఎలక్షన్ కమీషన్ నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహిస్తుందని చెబుతుంటారు. నిమ్మగడ్డ మాటల్లో మాత్రమే నిష్పాక్షికత కనబడుతోంది కానీ చేతల్లో కాదని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వీళ్ళ ఆరోపణలకు మద్దతుగా రాష్ట్రంలో రెండు ఘటనలు వెంటవెంటనే జరిగాయి. అయినా కమీషన్ ఎందుకని చర్యలు తీసుకోలేకపోతోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇందుకనే నిమ్మగడ్డ నిష్పాక్షికతపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. విచిత్రమేమంటే జరిగిన ఘటనలు కూడా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్రంగా సొంతూరులో జరగటమే.




మొదటిదేమో కింజరాపు అప్పలనాయుడు వైసీపీ తరపున సర్పంచుగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పలనాయుడు నిర్ణయాన్ని మార్చుకోవాలని అచ్చెన్న ఫోనులో పదే పదే మాట్లాడారు. అంటే అప్పలనాయుడును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని అచ్చెన్న ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోయేసరికి నామినేషన్ సందర్భంగా అప్పలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అచ్చెన్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటం తర్వాత అప్పలనాయుడు నామినేషన్ను అడ్డుకునే ప్రయత్నం చేయటంపై నిమ్మగడ్డ తనంతట తానుగా ఎందుకు చర్యలకు దిగలేదు ? అన్నదే పెద్ద ప్రశ్న. సరే అప్పలనాయుడు అచ్చెన్న అండ్ కో పై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు బుక్ చేసుకున్నారు.




ఇక రెండో అంశం మరుసటి రోజే జరిగింది.  అచ్చెన్నపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అధ్యక్షుడిని అరెస్టు చేయటం కోసం నిమ్మాడలోని అచ్చెన్న ఇంటికి చేరుకున్నారు. ఆ సందర్భంగా అచ్చెన్న పోలీసు అధికారులపై నోటికొచ్చినట్లు విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాగానే చంద్రబాబునాయుడును ఒప్పించి హోంమంత్రవుతానన్నారు. ఇపుడు తనపై కేసులు పెడుతున్న పోలీసులు ఎక్కడున్నా వెతికి వెతికి మరీ కేసులు పెడతానంటూ బెదిరించారు. ఇదంతా ఆడియో, వీడియో ఫుటేజీలు స్పష్టంగా కనబడుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించినందుకు అచ్చెన్నపై నిమ్మగడ్డ ఎందుకని చర్యలకు ఆదేశించలేదు ? మరి ఈ రెండు చర్యలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే నిమ్మగడ్డ ఏ విధంగా సమర్ధించుకుంటారు ?





కార్తీక బాబు - సుమ కొత్త సీరియల్ కాదు.. మరీ..!

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>