PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడే క్రమంలో కొంత మంది కీలక నేతలకు గాలం వేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మంత్రి పదవులను రాని టిఆర్ఎస్ పార్టీ నేతల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా కష్టపడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తే అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పిస్తామని... అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మీరు అడిగిన నియోజకవర్గం నుంచి సీటు ఇస్తానని హామీలు ఇచ్చారట. కొంతమంది నేతలకు ఇప్పటికే హామీలు కూడా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది. కొంతమంది నేతలు మాత్రం ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదbjp;kcr;allu aravind;kumaar;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;warangal;2019;mp;telugu;parliment;minister;thota chandrasekhar;tdp;reddy;partyషాకింగ్: బిజెపిలోకి టీడీపీ అగ్ర నేతలుషాకింగ్: బిజెపిలోకి టీడీపీ అగ్ర నేతలుbjp;kcr;allu aravind;kumaar;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;warangal;2019;mp;telugu;parliment;minister;thota chandrasekhar;tdp;reddy;partyThu, 04 Feb 2021 17:15:00 GMTభారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడే క్రమంలో కొంత మంది కీలక నేతలకు గాలం వేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మంత్రి పదవులను రాని టిఆర్ఎస్ పార్టీ నేతల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా కష్టపడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తే అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పిస్తామని... అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మీరు అడిగిన నియోజకవర్గం నుంచి సీటు ఇస్తానని హామీలు ఇచ్చారట. కొంతమంది నేతలకు ఇప్పటికే హామీలు కూడా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది.

కొంతమంది నేతలు మాత్రం ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దామని భావించిన సరే ఇప్పుడు అనుకున్న విధంగా పరిణామాలు లేకపోవడంతో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు బిజెపి వైపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి తో పాటు అరవింద్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

వరంగల్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు సైలెంట్ గా ఉన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేసినా సరే అవి పెద్దగా ఫలించలేదు. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం వెనుక మండవ వెంకటేశ్వరరావు సరిగా పనిచేయకపోవడమే కారణం అనే ఆగ్రహంలో  కూడా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటికి వెళ్ళినా సరే ఆయన మాత్రం అనుకున్న విధంగా తెరాస పార్టీకి సహకరించలేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. త్వరలోనే దీనిపై ఒక స్పష్టతకు రానున్నారు.


టీచర్ల వెతలు: గురువులకు ఇదేనా...మీ గురుదక్షిణ...?

బ్రాహ్మణ ఘోష: ఈ సామాజిక వర్గ మహిళల కష్టాలు జగన్ కు కనపడవా...?

హీరోయిన్ కోసం లూసిఫర్ కథను మార్చమన్న మెగాస్టార్....!

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>