PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections1667478f-9eb5-4d6a-9dd3-bf215f96e0df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections1667478f-9eb5-4d6a-9dd3-bf215f96e0df-415x250-IndiaHerald.jpgవిశాఖలో పంచాయతీ ఒక రేంజిలో సాగుతోంది. ఇది తెలుగుదేశానికి కంచుకోట. గత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి చావు దెబ్బ తగిలింది. అదే రిపీట్ అయితే ఇక ఇంతే సంగతులు అన్నది పసుపు పార్టీకి బాగా తెలుసు. అందుకే పోయిన చోటనే వెతుక్కోవాలనుకుంటోంది. jagan-nimmagadda-elections;view;anakapalle;cinema;telugu;vishakapatnam;panchayati;minister;fort;cycle;tdp;local language;ycp;ayyannapatrudu;dookudu;party;paruguజగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?jagan-nimmagadda-elections;view;anakapalle;cinema;telugu;vishakapatnam;panchayati;minister;fort;cycle;tdp;local language;ycp;ayyannapatrudu;dookudu;party;paruguThu, 04 Feb 2021 14:43:00 GMTపంచాయతీ ఒక రేంజిలో సాగుతోంది. ఇది తెలుగుదేశానికి కంచుకోట. గత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి చావు దెబ్బ తగిలింది. అదే రిపీట్ అయితే ఇక ఇంతే సంగతులు అన్నది పసుపు పార్టీకి బాగా తెలుసు. అందుకే పోయిన చోటనే వెతుక్కోవాలనుకుంటోంది.

దాని కోసం తమ్ముళ్ళు గట్టిగానే కష్టపడుతున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ జోరుకు  ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారం తమ్ముళ్ళు ముందుకు అడుగు వేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే తమ్ముళ్ళు ఎక్కడివారు అక్కడే ఉన్నారు. కానీ కేవలం ఏడాది గ్యాప్ లోనే టీడీపీ బాగా పుంజుకుంది.  పోరాడితే పోయేది ఏముంది అన్న డేరింగ్ వారిలో కనిపిస్తోంది.

ఎందుకు గెలవం అన్న ధీమా కూడా వస్తోంది. తొలి దశ పోలింగ్ జరుగుతున్న అనకాపల్లి డివిజన్ లో టీడీపీ బాగానే ఆశలు పెట్టుకుంది, అధికార పార్టీతో సమ ఉజ్జీగా రాణిస్తామని చెబుతోంది. దాదాపు 1800 పై చిలులు సర్పంచ్ పదవికి నామినేషన్లు పడ్డాయంటే జిల్లాలో పంచాయతీ హోరు తొలిదశ పోరు ఎలా ఉందో చెప్పేయవచ్చు. ఇక ఇపుడు రెండవ దశలో కూడా టీడీపీ తమ్ముళ్ళు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా  మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అడ్డాగా ఉన్న నర్శీపట్నం లో టీడీపీ సైకిల్ ఈసారి బాగా పరుగులు తీయడం ఖాయమని అంటున్నారు. ఇక చోడవరం, ఎలమంచిలిలో గతంతో పోలిస్తే పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు  పాయక‌రావుపేటలో కూడా మంచి బలం టీడీపీకి కనిపిస్తోంది. మొత్తానికి ఈసారి రూరల్ జిల్లాలో తలెత్తుకుని తిరిగేలా తమ మద్దతుదారులను గెలిపించుకుంటామని క్లారిటీగా తమ్ముళ్ళు చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ దూకుడుతో వైసీపీకి అచ్చమైన సినిమానే చూపిస్తోంది. ఈ దెబ్బతో విశాఖలో పసుపు సత్తా చాటడం ఖాయమని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు.






జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?

ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో.. !!

కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>