PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని భారతీయ జనతా పార్టీ నేతలు త్వరలోనే కలిసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు సానుకూలంగా ఉండి ఆయనను హీరో అంటూ కొంతమంది నేతలు కొనియాడే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ వ్యతిరేకులలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆదరణ పెరిగింది. ఆయనకు అభిమానులు కూడా కొంతమంది ఏర్పడ్డారు. సోషల్ మీడbjp;kumaar;varsha;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telugu;hero;ycp;partyషాక్... బిజెపిలోకి నిమ్మగడ్డను ఆహ్వానిస్తారా గురూ...?షాక్... బిజెపిలోకి నిమ్మగడ్డను ఆహ్వానిస్తారా గురూ...?bjp;kumaar;varsha;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telugu;hero;ycp;partyThu, 04 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని భారతీయ జనతా పార్టీ నేతలు త్వరలోనే కలిసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు సానుకూలంగా ఉండి ఆయనను హీరో అంటూ కొంతమంది నేతలు కొనియాడే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ వ్యతిరేకులలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆదరణ పెరిగింది.

ఆయనకు అభిమానులు కూడా కొంతమంది ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఆయనను కీర్తిస్తూ కొన్ని పార్టీల నేతల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కొంత మంది ఇతర పార్టీల కార్యకర్తలు అయితే ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఆయనకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయనను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అనుకూలంగానే ఉంది. ఆయనపై విమర్శలు చేసే విషయంలో బీజేపీ నేతలు అంతగా ఆసక్తి చూపించలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయనతో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రమేష్ కుమార్ కి రాజకీయాలపై ఆసక్తి ఉంటే తమ పార్టీలోకి వస్తే మంచి ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ నేతలు ఆయనకు హామీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు అని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద బిజెపి దృష్టి పెట్టిందని... ఆయనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఆదరణను క్యాష్ చేసుకునే విధంగా అడుగులు వేస్తుందని కొంతమంది అంటున్నారు.


హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డను వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోందో తెలుసా ?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>