Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/brisbane-testf1fb736d-d116-4a7e-9205-a4cc8ec09727-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/brisbane-testf1fb736d-d116-4a7e-9205-a4cc8ec09727-415x250-IndiaHerald.jpgఆసీస్ జట్టును ఆసీస్ గడ్డపైనే ఓడించి సగర్వంగా కప్పును తీసుకొచ్చారు టీమిండియా యువ ఆటగాళ్లు. అది కూడా ఆసీస్ జట్టుకు ఓటమంటే తెలియని గాబా పిచ్‌పైనే ఆ జట్టును మట్టి కరిపించి విజయకేతనం ఎగురవేశారు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో లేడు. ఇండియాలో తన భార్య అనుష్క ప్రసవం కోసం ఆసుపత్రిలో..brisbane test;anoushka;jeevitha rajaseskhar;delhi;virat kohli;korcha;chennai;doctor;wife;girl;qualification;yuva;brisbane;father;nijam;anandam;paruguమ్యాచ్ చూస్తుంగానే డాక్టర్ పిలిచారు.. ఒక్కసారిగా..!మ్యాచ్ చూస్తుంగానే డాక్టర్ పిలిచారు.. ఒక్కసారిగా..!brisbane test;anoushka;jeevitha rajaseskhar;delhi;virat kohli;korcha;chennai;doctor;wife;girl;qualification;yuva;brisbane;father;nijam;anandam;paruguThu, 04 Feb 2021 22:08:41 GMTన్యూఢిల్లీ: ఆసీస్ జట్టును ఆసీస్ గడ్డపైనే ఓడించి సగర్వంగా కప్పును తీసుకొచ్చారు టీమిండియా యువ ఆటగాళ్లు. అది కూడా ఆసీస్ జట్టుకు ఓటమంటే తెలియని గాబా పిచ్‌పైనే ఆ జట్టును మట్టి కరిపించి విజయకేతనం ఎగురవేశారు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో లేడు. ఇండియాలో తన భార్య అనుష్క ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉన్నాడు. అయితే భార్యకు ఒక పక్క ప్రసవం జరుగుతున్నా.. తాను మాత్రం బ్రిస్బేన్ మ్యాచ్ చూస్తూ బయట కూర్చున్నానని కోహ్లీ చెప్పాడు. ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగానే కోహ్లీ బ్రిస్బేన్ విన్ గురించి మాట్లాడాడు.

‘బ్రిస్బేన్‌ టెస్టులో టీమిండియా సాధించిన చారిత్రక విజయం గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాను. ఆ మ్యాచ్‌ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అయితే అదే రోజు జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. బ్రిస్బేన్‌ టెస్టు సమయంలో ఆసుపత్రిలో ఉన్న నేను సుందర్‌, శార్దూల్‌ బ్యాటింగ్‌ను నా ఫోన్‌లో చూస్తున్నా. మ్యాచ్ సాగుతున్న తీరు ఎంతో టెన్షన్ కలిగిస్తోంది.  127 పరుగుల భారీ పార్ట్‌నర్‌షిప్‌తో వారు అదిరిపోయే ఆటఆడుతుండగానే.. డాక్టర్‌ వచ్చి నన్ను పిలిచారు. నాకు ఆడపిల్ల పుట్టినట్లు చెప్పారు.

నిజంగా ఆ క్షణం ఒక బిడ్డకు తండ్రి అయ్యానన్న ఆనందం గొప్ప అనుభూతి జీవితంలో కలిగింది. మరో రెండు రోజుల్లో మా జట్టు చారిత్రక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేను చెప్పిన రెండు కారణాలు విభిన్న శైలిలో ఉన్నాయి. యాదృశ్చికంగా నా జీవితంలో రెండు ఆనందాలు ఒకేసారి పొందడం ఆనందంగా ఉన్నా.. వాటిని ఒకదానితో మరొకటి ఎన్నటికీ పోల్చలేను. నేను లేకున్నా జట్టు విజయం సాధించి దేశం పేరు నిలబెట్టింది. ఆ మ్యాచ్‌ను నేను కళ్లారా వీక్షించలేకపోయినా.. ఎక్కడ ఉన్నా జట్టుతో అనుబంధం మాత్రం అలాగే ఉంటుంది’ అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో రెడీగా ఉందని కోహ్లీ చెప్పాడు. పెటర్నిటీ సెలవుల అనంతరం జట్టుతో కలవడం ఆనందంగా అనిపిస్తోందని, ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ విజయాన్ని ఇంగ్లండ్‌తోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌పిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ఈ సిరీస్ ఆడుతామని కోహ్లీ స్పష్టం చేశాడు.

ఇక రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపర్‌గా తుది జట్టులో కచ్చితంగా ఆడతాడని, అందులో ఎలాంటి సందేహం లేదని, బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో పేస్‌ విభాగం మరింత పటిష్టంగా తయారైందని అన్నాడు. స్వదేశంలో బుమ్రాకు ఇదే తొలి టెస్టు అయినా.. ఇప్పటికే తనేంటో ప్రపంచానికి తెలియచేశాడని, అతని ఫామ్‌పై ఎలాంటి సందేహాలు లేవని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.


ఏకగ్రీవాలు జరిగింది ఇక్కడే! జిల్లాల వారీగా లిస్ట్

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>