PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marketing-addse172b7d9-e225-4bf1-b146-db4847db0a2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marketing-addse172b7d9-e225-4bf1-b146-db4847db0a2d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇటువంటి అబూతకల్పనకు సంబంధించిన ప్రకటనలు చాలానే వస్తున్నాయి. జాతకాలను నమ్మే వారిని వాడుకుంటూ సొమ్ము చేసుకునేటటువంటి స్టైల్ పెద్ద ఎత్తునే జరుగుతుంది అన్నారు సాయి. అశాస్త్రీయ మైనటువంటి ఇటువంటి ప్రకటనలకు సెలబ్రిటీలను పెట్టి చేస్తుంటారు.marketing adds;lakshmi;tara;maharashtra - mumbai;television;maharashtra;customer;aurangabad;shaktiసెలబ్రిటీస్ అటువంటి యాడ్స్ చేస్తే, వారికి తప్పదు భారీ మూల్యం...?సెలబ్రిటీస్ అటువంటి యాడ్స్ చేస్తే, వారికి తప్పదు భారీ మూల్యం...?marketing adds;lakshmi;tara;maharashtra - mumbai;television;maharashtra;customer;aurangabad;shaktiThu, 04 Feb 2021 14:00:00 GMTటీవీ చానెళ్లలో వాటికి సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు ఇస్తున్నారు. వాటి డిమాండ్ మరింత పెంచేందుకు ప్రముఖ సెలబ్రెటీలతో ఆ యాడ్స్ ను చేయిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఆ వస్తువు గురించి అర్థమవుతుంది. అదేవిధంగా కొనుగోలుదారులు పెరుగుతారు. శాస్త్రీయమైన యాడ్స్ వలన  సమస్య లేదు... కానీ ఇంకో రకమైన యాడ్స్.. అనగా అభూతకల్పనలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఇదే తరహాలోనే నడుస్తున్నాయి.
 
ఉదాహరణకు ఈ యంత్రం మీ ఇంటి ముందు పెట్టుకుంటే ఎటువంటి శక్తి మిమ్మల్ని ఏమి చేయలేదు...  ఈ రుద్రాక్ష మెడలో వేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది...మీరు ఊహించని రీతిలో ఐశ్వర్యవంతులుగా మారుతారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా ట్రోల్ అవుతున్న మరో ప్రకటన, ఈ మందును రెండు చుక్కలు కలిపి ఇస్తే చాలు ఆ వ్యక్తి ఇక మద్యాన్ని కానీ ధూమపానాన్ని కానీ ముట్టడు. కావాలంటే దీన్ని వాళ్లకు తెలియకుండా కూడా ఆహారంలో కలిపి ఇవ్వవచ్చు. ఎటువంటి రంగు, రుచి మరియు వాసన ఉండదు అంటూ పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తున్నారు.

ఇలాంటి.. ప్రకటనలు చాలానే చూస్తున్నాము. వీటి గురించి కొన్ని కీలక విషయాలను తెలియజేశారు ప్రముఖ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు సాయి. ప్రస్తుతం ఇటువంటి అబూతకల్పనకు సంబంధించిన ప్రకటనలు చాలానే వస్తున్నాయి. జాతకాలను నమ్మే వారిని వాడుకుంటూ సొమ్ము చేసుకునేటటువంటి స్టైల్ పెద్ద ఎత్తునే జరుగుతుంది అన్నారు సాయి. అశాస్త్రీయ మైనటువంటి ఇటువంటి ప్రకటనలకు సెలబ్రిటీలను పెట్టి చేస్తుంటారు. అప్పుడు వాటిని మరింత నమ్మి ఎక్కువగా కొనుగోలు చేస్తారని వారి ఉద్దేశం. దీని మీదనే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ కోర్ట్ బెంచి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిందని తెలియచేశారు సాయి.

ఆ తీర్పు ఏంటంటే..?? టీవీలో వచ్చే అశాస్త్రీయమైన ప్రకటనలతో పాటుగా... ఆ ప్రకటనలు ఇచ్చేవారు వాటిని ప్రచారం చేసేవారు సెలబ్రిటీలు అయినా సరే... వారి మీద కేసు నమోదు చేయమని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. కాబట్టి ఇటువంటి అశాస్త్రీయమైన నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకుని చేసే ఏ యాడ్స్ అయినా... వాటిలో చేసే సెలబ్రిటీలపై, ఆ సంస్థల పై కూడా కేసులు పెట్టమని ఆర్డర్స్ జారీ అయ్యాయి . కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకటనల విషయంలో జాగ్రత్త వహించాలి అని పేర్కొన్నారు సాయి.


బంగారం కొనాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్..ఈరోజు ధరలు ఇలా...!!

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>