MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshb094d8e5-5993-4fae-b676-177bf62a092a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshb094d8e5-5993-4fae-b676-177bf62a092a-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం మహేష్ ‘సర్కారువారి పాట’ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్నప్పటికీ అతడి ఆలోచనలు అన్నీ రాజమౌళి చుట్టూ తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి మహేష్ ల కాంబినేషన్ లో ఒక మూవీ ప్రాజెక్ట్ ఉండి తీరుతుంది అన్న విషయం స్వయంగా రాజమౌళి అనేకసార్లు చెప్పాడు. ఈ విషయాన్ని మహేష్ కూడ అనేకసార్లు సూచన ప్రాయంగా అంగీకరించాడు.హాలీవుడ్ జేమ్స్ బాండ్ కథ లా ఒక స్పై థ్రిల్లర్ గా ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఈమూవీ కథ విషయమై లాక్ డౌన్ సమయంలో రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ల మధ్య కొంతవరకు ప్రాధమిక చర్చలmahesh;view;mahesh;prasad;rajamouli;tiru;rrr movie;cinema;hollywood;september;thriller;k v vijayendra prasad;dubai;james bond;james cameronరాజమౌళి కోసం కొత్త ఆలోచనలలో మహేష్ !రాజమౌళి కోసం కొత్త ఆలోచనలలో మహేష్ !mahesh;view;mahesh;prasad;rajamouli;tiru;rrr movie;cinema;hollywood;september;thriller;k v vijayendra prasad;dubai;james bond;james cameronThu, 04 Feb 2021 10:00:00 GMTమహేష్ ‘సర్కారువారి పాట’ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్నప్పటికీ అతడి ఆలోచనలు అన్నీ రాజమౌళి చుట్టూ తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి మహేష్ ల కాంబినేషన్ లో ఒక మూవీ ప్రాజెక్ట్ ఉండి తీరుతుంది అన్న విషయం స్వయంగా రాజమౌళి అనేకసార్లు చెప్పాడు. ఈ విషయాన్ని మహేష్ కూడ అనేకసార్లు సూచన ప్రాయంగా అంగీకరించాడు.


హాలీవుడ్ జేమ్స్ బాండ్ కథ లా ఒక స్పై థ్రిల్లర్ గా ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఈమూవీ కథ విషయమై లాక్ డౌన్ సమయంలో రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ల మధ్య కొంతవరకు ప్రాధమిక చర్చలు కూడ జరిగాయి అని అంటారు.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకుని వచ్చే సంవత్సరం ప్రధమార్థంలో మహేష్ మూవీని ప్రారంభించాలని రాజమౌళి ఆలోచన అని టాక్. ఇప్పుడు జక్కన్న ఆలోచనకు అనుగుణంగా మహేష్ వ్యూహాలు ఉండబోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ ప్రాంతంలో పూర్తి అయిపోయినప్పటికీ రాజమౌళి మళ్ళీ మహేష్ కు రెడీ చెప్పేవరకు కొన్ని నెలల గ్యాప్ ఉన్నప్పటికీ మరొక సినిమాను ఒప్పుకునే ఆలోచన మహేష్ చేయడంలేదు అని అంటున్నారు.


వాస్తవానికి మహేష్ డేట్స్ ఇస్తే అతడితో సినిమాలు తీయడానికి ఎందరో ప్రముఖ దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. అంతేకాదు మహేష్ ఒప్పుకుంటే చాలు అత్యంత భారీ పారితోషికం ఇవ్వడానికి కూడ నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ఈ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ‘సర్కారువారి పాట’ మూవీ తరువాత మరొక సినిమాను కమిట్ అయిపోతే రాజమౌళి తన మనసు మార్చుకుని మరో టాప్ హీరోతో వెళ్ళిపోతాడు అన్న భయంతో మహేష్ రాజమౌళి కోసం వచ్చే సంవత్సరం అంతా వేచి చూసే ధోరణి అవలంభించే ఆలోచనలలో ఉన్నాడని ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి..  





చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>