PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/amaravathi-farmers0b2687f7-4378-47e9-a1b1-53b502c9eeac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/amaravathi-farmers0b2687f7-4378-47e9-a1b1-53b502c9eeac-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దేనికీ భయపడిన దాఖలాలు లేవు. పెద్ద నోట్ల రద్దు విషయంతో దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తినా ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రభావితం చేయలేదు. ఓ దశలో బీజేపీ నాయకులు చేసిందే చట్టం, చెప్పిందే వేదం. ప్రతిపక్షాలకు కూడా ప్రశ్నించే సీన్ లేదు, ఇక సామాన్య ప్రజలకు ఎక్కడిది. అలాంటి సమయంలో ఢిల్లీలో రైతులు బీజేపీని వణికిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేపట్టి హస్తినపై పోరు కొనసాగిస్తున్నారు. amaravathi farmers;delhi;bharatiya janata party;amaravati;andhra pradesh;capital;wednesday;local language;central government;international;jac;adhursఅమరావతి రైతుల ప్లాన్ అదుర్స్ కదూ..అమరావతి రైతుల ప్లాన్ అదుర్స్ కదూ..amaravathi farmers;delhi;bharatiya janata party;amaravati;andhra pradesh;capital;wednesday;local language;central government;international;jac;adhursThu, 04 Feb 2021 07:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దేనికీ భయపడిన దాఖలాలు లేవు. పెద్ద నోట్ల రద్దు విషయంతో దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తినా ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రభావితం చేయలేదు. ఓ దశలో బీజేపీ నాయకులు చేసిందే చట్టం, చెప్పిందే వేదం. ప్రతిపక్షాలకు కూడా ప్రశ్నించే సీన్ లేదు, ఇక సామాన్య ప్రజలకు ఎక్కడిది. అలాంటి సమయంలో ఢిల్లీలో రైతులు బీజేపీని వణికిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేపట్టి హస్తినపై పోరు కొనసాగిస్తున్నారు.

వాయిదాల పద్ధతిలో జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడం, చట్టాలు రద్దు చేసే వరకు మేం వెనక్కు తగ్గం అని రైతులు తేల్చి చెప్పడంతో ఢిల్లీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఈ ఉద్యమానికి అంతర్జాతీయ సమాజం కూడా అనూహ్యంగా మద్దతివ్వడం మరో కీలక పరిణామం. ఈ దశలో ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా వెళ్లి, పనిలో పనిగా తమ ఆందోళనలు జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో పడ్డారు అమరావతి రైతులు. ఢిల్లీ ఉద్యమాల్లో అమరావతి జెండాను రెపరెపలాడించారు.

ఢిల్లీలో రాజధాని రైతులు అమరావతి గళం వినిపించారు. ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు బుధవారం ఢిల్లీకి వెళ్లి సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. సేవ్‌ అమరావతి అంటూ బ్యానర్‌ పట్టుకుని నినాదాలు చేశారు. రైతుల సభలో అమరావతి దళిత జేఏసీ, మహిళా జేఏసీ, యంగ్‌ ఫర్‌ యూత్‌ సభ్యులు పాల్గొని మాట్లాడారు, వారికి మద్దతు తెలిపారు. అమరావతి ఆందోళనలు బుధవారంతో 414వ రోజుకు చేరుకోవడం విశేషం. ఏపీలో తమ ఆందోళనలు కొనసాగుతున్నా ఫలితం లేకపోయే సరికి.. ఢిల్లీకి వెళ్లి అందరి దృష్టిలో పడాలని చూస్తున్నారు రైతులు.

స్థానికంగా ఉద్యమాలు చేస్తున్న పలువురు నేతలు సైతం.. ఇప్పుడు ఢిల్లీ ఉద్యమంపై దృష్టిపెట్టారు. స్థానికంగా తమ సమస్యలను మరింత హైలెట్ చేయాలంటే రైతుల ఉద్యమానికి మద్దతివ్వడంతోపాటు, ఢిల్లీకి వెళ్లి ఆందోళనల్లో పాల్గొనడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నారు. అందుకే అమరావతి ఉద్యమకారులు కూడా ఢిల్లీబాట పట్టారు. ఏపీ రాజధాని సమస్యను జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా పథకం రచించారు.




హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డను వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోందో తెలుసా ?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>