Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/adhaar-link52d35b46-73c5-4977-bd7f-ee310f814a66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/adhaar-link52d35b46-73c5-4977-bd7f-ee310f814a66-415x250-IndiaHerald.jpgఒక చిన్న నిర్ణయం ప్రజలను అష్టకష్టాల పాలు చేయగలదు. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పరిస్థితే ఉంది. హైకోర్టు ఉత్తర్వుల సాకుతో రేషన్ డీలర్లకు ఎదురు చెప్పలేక రాష్ట్ర సర్కార్ పాటిస్తున్న నిబంధనలను ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తోంది. ఇంకా విచిత్రం ఏంటంటే అవకాశం ఉన్నా కూడా ఈ కష్టాల నుంచి ప్రజలను బయటపడేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. రేషన్‌ షాపుల్లో సరుకులు పొందేందుకు..adhaar link;technology;tiru;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;aadharఆధార్ లింక్‌తో అవస్థలు.. అవకాశం ఉన్నా ఇంత దారుణమా..?ఆధార్ లింక్‌తో అవస్థలు.. అవకాశం ఉన్నా ఇంత దారుణమా..?adhaar link;technology;tiru;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;aadharThu, 04 Feb 2021 11:41:11 GMTహైదరాబాద్: ఒక చిన్న నిర్ణయం ప్రజలను అష్టకష్టాల పాలు చేయగలదు. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పరిస్థితే ఉంది. హైకోర్టు ఉత్తర్వుల సాకుతో రేషన్ డీలర్లకు ఎదురు చెప్పలేక రాష్ట్ర సర్కార్ పాటిస్తున్న నిబంధనలను ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తోంది. ఇంకా విచిత్రం ఏంటంటే అవకాశం ఉన్నా కూడా ఈ కష్టాల నుంచి ప్రజలను బయటపడేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. రేషన్‌ షాపుల్లో సరుకులు పొందేందుకు ఐరిస్‌ డిటెక్షన్ టెక్నాలజీ లేదా వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) విధానాన్ని వినియోగించాలని హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పౌరసరఫరాల శాఖ దుకాణాల్లో ఈ నెల 1 నుంచి ఇది తప్పనిసరి అయింది. దీంతో ప్రజల అవస్థలు మొదలయ్యాయి.

ముఖ్యంగా ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్‌ నెంబరుకే ఓటీపీ రావడం, ఆ ఓటీపీ ఉంటే కానీ సరుకులు ఇవ్వనని రేషన్ డీలర్లు తెగేసి చెప్పడంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఐరిస్‌ లేదా ఓటీపీని వినియోగించాలని హైకోర్టు ఆదేశించినా.. రేషన్‌ డీలర్లు మాత్రం ‘ఓటీపీ’నే కావలని భీష్మించుకు కూర్చుంటున్నారు. దీంతో రేషన్ సరుకులు లభించక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 87,56,012 రేషన్‌ కార్డులుంటే.. వాటిపై లబ్ధిదారులు 2,80,58,651 మంది ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది లబ్ధిదారులకు చెందిన ఆధార్‌ కార్డులు సెల్‌ఫోన్‌ నంబర్లతో అనుసంధానం కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నడిచే ప్రజాపంపిణీ వ్యవస్థంతా ‘ఆధార్‌’ సర్వర్‌తో అనుసంధానమై పని చేస్తోంది. ఆధార్‌లో కూడా వేలిముద్రలు, ఐరిస్‌ రెండూ ఉంటాయి. కానీ రేషన్ డీలర్లు మాత్రం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు వచ్చే ఓటీపీనే కావాలంటున్నారు.

ఈ పరిస్థితుల్లో అనేకమంది రేషన్ లబ్ధిదారుల్లో మీసేవ, ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో మీసేవ సెంటర్ల వద్ద భారీ రద్దీ పెరిగిపోయింది. మరింత దైన్యం ఏంటంటే కొంతమంది ఆ లైన్లలో నిలబడలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరికొందరు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా మీ సేవా సెంటర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే మీ సేవా సెంటర్లు తెరవకముందే ప్రజలు అక్కడకు చేరుకుని చలిమంటలు వేసుకుని వేచి చూస్తున్నారు.

మరోవైపు, ఆధార్‌-సెల్‌ నంబర్‌ అనుసంధానానికి మీసేవ సెంటర్లలో రూ.50 చార్జి చేయాల్సి ఉండగా రూ.100 నుంచి రూ.200 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అది కూడా మీసేవ, ఆధార్‌ సెంటర్లలో రోజుకు 30-40 వరకు మాత్రమే ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేస్తున్నారు. ఇక ఆధార్‌ కేంద్రాల్లో ఒక్కో కార్డుకు లింక్‌ చేసేందుకు కొన్నిచోట్ల అరగంటకుపైగా సమయం పడుతుండడంతో క్యూలలో ఉన్నవారు ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి.

కొన్నిచోట్ల ఐరిస్‌ యత్నాలు చేసినా... వృద్ధులకు కళ్లు కనిపించకపోవటం, కను పాపలు స్కాన్‌ కాకపోవటం, కొందరు కంటి ఆపరేషన్లు చేసుకోవటం, కొన్నిచోట్ల సర్వర్‌ పనిచేయక పోవటం కూడా సమస్యగా మారింది. అయితే తొలుత ఐరిస్‌, అది సాధ్యంకాక పోతేనే ‘ఓటీపీ’ విధానాన్ని వినియోగించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.




జగడ్డ: వాళ్ళ కక్కుర్తే జగన్ కు సమస్య...?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>