PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpg ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా తూర్పు కాపుల‌కు త‌ప్ప‌కుండా ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది ఈ జిల్లాలో గ‌త ఏడెనిమిదేళ్లుగా పార్టీ కోసం ఎంతో ప‌ని చేస్తోన్న ఓ కాపు నేత‌ను పార్టీ అధిష్టానం వ్యూహాత్మ‌కంగా సైడ్ చేసేసింది. నిన్నటి వ‌ర‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ప‌నిచేసిన ఆకుల వీర్రాజును ఆ ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేసింది. గ‌తంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నేత‌ చంద‌న ర‌మేష్ కుమారుడు చంద‌న నాగేశ్వ‌ర్‌ను ఇక్క‌డ కొత్త ఇన్‌చార్జ్‌గా నియ‌మించింది. వాస్త‌వంగా ysrcp;indiaherald group;rbi;y. s. rajasekhara reddy;mp;backward classes;smart phone;letter;tdp;ycp;partyకాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?ysrcp;indiaherald group;rbi;y. s. rajasekhara reddy;mp;backward classes;smart phone;letter;tdp;ycp;partyThu, 04 Feb 2021 08:30:00 GMTఏపీలో అధికార వైఎస్సార్ సీపీలో కేవ‌లం కొన్ని కులాల‌కు మాత్ర‌మే భారీగా ల‌బ్ధి క‌లుగుతుంద‌ని.. ఆ కులాల వారికే ఎక్కువ ప‌ద‌వులు... పెత్త‌నంతో పాటు నామినేటెడ్ ప‌ద‌వులు అన్నీ వాళ్ల‌కే వెళ్లిపోతున్నాయ‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ అయితే కొన్ని కులాల పేర్లు చెప్పి మ‌రీ విమ‌ర్శ‌లు చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఇక కాపు కులాల‌కు గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ పెద్ద‌గా ఒరిగింది లేదు.. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంలోనూ ఒరిగింది లేదు. అయితే వైసీపీలో కాపుల‌కు ఉన్న ప‌ద‌వులు కూడా ఊడిపోతున్నాయి.

కీల‌క‌మైన తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపుల ప్రాబ‌ల్యం చాలా ఎక్కువ‌. ఇక్క‌డ రాజ‌కీయంగా శాసించేది ఈ సామాజిక వ‌ర్గం వాళ్లే. ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా తూర్పు కాపుల‌కు త‌ప్ప‌కుండా ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది ఈ జిల్లాలో గ‌త ఏడెనిమిదేళ్లుగా పార్టీ కోసం ఎంతో ప‌ని చేస్తోన్న ఓ కాపు నేత‌ను పార్టీ అధిష్టానం వ్యూహాత్మ‌కంగా సైడ్ చేసేసింది. నిన్నటి వ‌ర‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ప‌నిచేసిన ఆకుల వీర్రాజును ఆ ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేసింది. గ‌తంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నేత‌ చంద‌న ర‌మేష్ కుమారుడు చంద‌న నాగేశ్వ‌ర్‌ను ఇక్క‌డ కొత్త ఇన్‌చార్జ్‌గా నియ‌మించింది.

వాస్త‌వంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్లో ఆకుల వీర్రాజు పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న ఆ త‌ర్వాత ఐదేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి మ‌రీ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే ట్ర‌యాంగిల ఫైట్‌లో మ‌ళ్లీ జ‌న‌సేన దెబ్బ బ‌లంగా త‌గిలి వీర్రాజు ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే ఎంపీ మార్గాని భ‌ర‌త్ చ‌క్రం తిప్పి త‌న వ‌ర్గానికి చెందిన బీసీ నేత చంద‌న నాగేశ్వ‌ర్‌కు రూర‌ల్ ఇన్‌చార్జ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఆకుల వీర్రాజు పార్టీ రాజ‌కీయాల‌కు బ‌ల‌య్యారు. ఏడెనిమిదేళ్లు క‌ష్ట‌ప‌డినందుకు పార్టీ అధికారంలో ఉండ‌గానే ఆయ‌న్ను ఇలా బ‌లి చేయ‌డం అన్యాయ‌మ‌ని ఆయ‌న వ‌ర్గం మండి ప‌డుతోంది. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>