MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamsi-sishyudi-chethilo-rajasekhar-cinema60e83cf3-7657-4d57-a4ae-264889bef895-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamsi-sishyudi-chethilo-rajasekhar-cinema60e83cf3-7657-4d57-a4ae-264889bef895-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో రాజశేఖర్ కల్కి తర్వాత మరే సినిమా చేయలేదు. అప్పుడెప్పుడో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన అర్జున్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. అది వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా దాదాపుగా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడడంతో చాలాకాలంపాటు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నాడు. మళ్లీ సినిమా అనౌన్స్ కూడా చేసేసాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో ఉదయాన్నే శేఖర్ అనే సినిమా అని అనౌన్స్ చేశారు. మాసిన తెల్ల గడ్డం, పిల్లి కళ్ళతో రాజశేఖర్ కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. నిజానికి మన హsai dharam tej;dr rajasekhar;jeevitha rajaseskhar;krishna;krishna vamshi;neelakanta;sekhar;vamsi;cinema;vijay kumar naidu;remake;hero;krishna vamsi;arjun 1కృష్ణ వంశీ శిష్యుడి చేతిలో రాజశేఖర్ సినిమాకృష్ణ వంశీ శిష్యుడి చేతిలో రాజశేఖర్ సినిమాsai dharam tej;dr rajasekhar;jeevitha rajaseskhar;krishna;krishna vamshi;neelakanta;sekhar;vamsi;cinema;vijay kumar naidu;remake;hero;krishna vamsi;arjun 1Thu, 04 Feb 2021 15:00:00 GMTసీనియర్ హీరో రాజశేఖర్ కల్కి తర్వాత మరే సినిమా చేయలేదు. అప్పుడెప్పుడో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన అర్జున్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. అది వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా దాదాపుగా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడడంతో చాలాకాలంపాటు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నాడు. మళ్లీ సినిమా అనౌన్స్ కూడా చేసేసాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో ఉదయాన్నే శేఖర్ అనే సినిమా అని అనౌన్స్ చేశారు. మాసిన తెల్ల గడ్డం, పిల్లి కళ్ళతో రాజశేఖర్ కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. నిజానికి మన హీరోల సినిమాలు అంటే వయస్సు ఎలా ఉన్నా నవమన్మధుడులా చూపించడానికే ఎక్కువమంది దర్శకులు కష్టపడుతూ ఉంటారు. 

అలాంటిది తొలిసారి తన వయసుకు తగ్గ పాత్ర రాజశేఖర్ చేస్తూ ఉండడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాని ముందునుంచి నీలకంఠ అని సీనియర్ దర్శకుడు తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. అనంతర కాలంలో ఆయన తప్పుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. జీవిత దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం జరగగా అవి నిజం కాదని తేలింది. లలిత్ అనే కుర్ర దర్శకుడికి ఈ సినిమా బాధ్యతలు అప్పచెప్పారు. ఈయన గతంలో కృష్ణవంశీ దగ్గర అసోసియేట్ దర్శకుడిగా పని చేశాడు. 

ఈ సినిమానే మొదటి సినిమా, అయినా నిర్మాతలు, హీరో ఆయనను నమ్మి సినిమా అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వస్తున్న డెబ్యూ దర్శకులు అందరూ తమ తమ సత్తా మొదటి సినిమాతోనే చాటుకుంటున్నారు. మరి ఈ దర్శకుడు ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా నే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన జోసెఫ్ సినిమాకి రీమేక్ అనేది అర్థం అయిపోతుంది. టైటిల్ రివీల్ లుక్ చూస్తేనే ఆ విషయం జనానికి క్లారిటీ వచ్చేస్తుంది. మరి మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు లో కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

 

 

 




జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?

ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో.. !!

కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>