MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simbu-produser6a06e235-0255-45bd-91a4-ca565b775f85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simbu-produser6a06e235-0255-45bd-91a4-ca565b775f85-415x250-IndiaHerald.jpg కోలీవుడ్ లో హీరో శింబు పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇక గత కొద్ది కాలం నుండి టాలీవుడ్ కి కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు.bతమిళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తోపాటు కాంట్రవర్సీ కింగ్ అని పేరు తెచ్చుకున్న హీరో శింబు. ఈయనకు అభిమానులతో పాటు వివాదాలు కూడా బాగానే ఉన్నాయి. గత కొద్దికాలం క్రితం శింబు నటించిన " అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ " (ఏ ఏ ఏ ) సినిమా తాలూకు వివాదం ఇప్పటికీ శింబు ని వదలడం లేదు. ఈ మధ్య శింబు చాలా సినిమాలు చేశాడు. కానీ ఏ ఏ ఏ సినిమా మాత్రం తలనొప్పులు తెచ్చిపెడుతూ నీడలా వెంటాడుతోంది.simbu,produser;tollywood;cinema;january;kollywood;tamil;producer;king;press;producer1;hero;king 1;silambarasanనిర్మాతల మండలి నుంచి మరోసారి వెలివేయబడ్డ శింబు.. అయితే ఈ సారి ఏం జరిగిందో.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..నిర్మాతల మండలి నుంచి మరోసారి వెలివేయబడ్డ శింబు.. అయితే ఈ సారి ఏం జరిగిందో.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..simbu,produser;tollywood;cinema;january;kollywood;tamil;producer;king;press;producer1;hero;king 1;silambarasanThu, 04 Feb 2021 10:00:00 GMT కోలీవుడ్ లో  హీరో  శింబు  పరిచయం అవసరం లేని వ్యక్తి.  ఇక గత కొద్ది కాలం నుండి టాలీవుడ్ కి కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు.bతమిళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తోపాటు కాంట్రవర్సీ కింగ్ అని పేరు తెచ్చుకున్న హీరో శింబు. ఈయనకు అభిమానులతో పాటు వివాదాలు కూడా బాగానే ఉన్నాయి. గత కొద్దికాలం క్రితం శింబు నటించిన  " అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ " (ఏ ఏ ఏ ) సినిమా తాలూకు వివాదం ఇప్పటికీ శింబు ని వదలడం లేదు. ఈ మధ్య శింబు  చాలా సినిమాలు చేశాడు. కానీ ఏ ఏ ఏ సినిమా మాత్రం తలనొప్పులు తెచ్చిపెడుతూ నీడలా వెంటాడుతోంది.

తాజాగా ఈ వివాదం కారణంగా తమిళ నిర్మాతల మండలి శింబుని వెలివేసే  పరిస్థితి వచ్చింది. అసలు శింబుకి అంత కష్టం ఎందుకు వచ్చిందంటే? శింబు
హీరో గా మైకేల్ రాయప్పన్  అనే నిర్మాత   " అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ " అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు . దీన్ని ట్రిపుల్ ఏ అని కూడా అంటారు.  అయితే ఈ సినిమాకు మధ్యలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ,అత్యంత కష్టం మీద ఈ సినిమాను విడుదల చేశారు. అయితే ఎలాంటి లాభం లేదు. సినిమా డిజాస్టర్ గా నిలిచింది.  ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో   నిర్మాత రివర్స్ అయ్యాడు. ప్రమోషన్ సమయంలోనే కాదు సెట్ పై ఉన్నప్పుడు కూడా శింబు ఈ సినిమాకు ఏమాత్రం సహకరించలేదని, తనను చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు అని, నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశాడు.

అప్పట్లో ఈయన చేసిన కామెంట్స్ బాగా వైరల్  అయ్యాయి.  అప్పుడు ఆ చిత్ర దర్శకుడు కూడా నిర్మాతకే సపోర్ట్ చేశాడు. ఈ విషయమై తమిళ నిర్మాతల మండలి జోక్యం చేసుకొని శింబు కి,రాయప్పన్ కి మధ్య ఒక ఒప్పందం ప్రకారం రాజీ కుదిర్చింది. కానీ ఇప్పటికీ అది సరిగ్గా కుదరలేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

ఆ ఒప్పందం ఏమిటంటే శింబు  రాయప్పన్ సినిమాకు ఉచితంగా చేయడం.. లేదంటే శింబు "ఏఏఏ" సినిమా కోసం తీసుకున్న 6.6 కోట్ల మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లించేలా ఇద్దరికీ ఒప్పందం కుదిర్చింది. కానీ శింబు, రాయప్పన్ కు  సినిమా చేయలేదు, అలాగని తీసుకున్న డబ్బులు కూడా తిరిగి  ఇవ్వలేదు. అందుకే ఈ విషయం పై మైకేల్ రాయప్పన్  తిరిగి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ కోరాడు. ఇక దీని పై సీరియస్ అయిన నిర్మాతల మండలి జనవరి 19న అత్యవసరంగా సమావేశమైంది. ఇక శింబు  భవిష్యత్తులో నటించే చిత్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని  తీర్మానించింది. ఇక ఇదే నిజమైతే శింబు  హీరోగా నటించే సినిమాలకు తిప్పలు తప్పవు ఏమో..




చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>