PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections3fd4c9e6-df58-4e34-9b5e-b66fd6ae4f72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections3fd4c9e6-df58-4e34-9b5e-b66fd6ae4f72-415x250-IndiaHerald.jpgఏపి లో ఎన్నికల జోరు స్పీడ్ అందుకుంది. ఎన్నికల రెండో విడత నామినేషన్ ఈరోజు ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని నామినేషన్లు వేశారు అనే అంశం అందరినీ ఆలోచనలో పడేసింది..ఈరోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్లు ముగుస్తాయి. ఈ నెల 13 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా కడప జిల్లాలో పచ్చ నేతల ఆగడాలు మితి మీరుతున్నాయి. ఒక వైపు మద్యం పోస్తూ, మరో వైపు దాడులు, ఇంకా డబ్బుల పంపిణీ చేస్తూ, చేయిస్తూ ప్రజలను ప్రలోబాలకు గురిచేస్తున్నారని సమాచారం..jagan-nimmagadda-elections;krishna;sridhar;andhra pradesh;adinarayanareddy;district;kadapa;scheduled caste;police;panchayati;village;tdp;partyజగడ్డ: కడపలో రెచ్చిపోతున్న పచ్చ నేతలు..ఒకవైపు మద్యం..మరోవైపు దాడులు..కట్టడిలేదా?జగడ్డ: కడపలో రెచ్చిపోతున్న పచ్చ నేతలు..ఒకవైపు మద్యం..మరోవైపు దాడులు..కట్టడిలేదా?jagan-nimmagadda-elections;krishna;sridhar;andhra pradesh;adinarayanareddy;district;kadapa;scheduled caste;police;panchayati;village;tdp;partyThu, 04 Feb 2021 10:00:00 GMTఏపి లో ఎన్నికల జోరు స్పీడ్ అందుకుంది. ఎన్నికల రెండో విడత నామినేషన్ ఈరోజు ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని నామినేషన్లు వేశారు అనే అంశం అందరినీ ఆలోచనలో పడేసింది..ఈరోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్లు ముగుస్తాయి. ఈ నెల 13 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా కడప జిల్లాలో పచ్చ నేతల ఆగడాలు మితి మీరుతున్నాయి. ఒక వైపు మద్యం పోస్తూ, మరో వైపు దాడులు, ఇంకా డబ్బుల పంపిణీ చేస్తూ, చేయిస్తూ ప్రజలను ప్రలోబాలకు గురిచేస్తున్నారని సమాచారం..



ఖాజీపేట మండలం దుంపలగట్టు సర్పంచి పదవికి రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి సతీమణి అరుణ పోటీ చేస్తున్నారు. బుధవారం ఎస్సీ కాలనీలో డబ్బు పంపిణీ చేస్తుండగా పోలీసులు వెళ్లారు. రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు ఆదినారాయణరెడ్డి, మరికొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద కొంత డబ్బులు స్వాదీనం చేసుకున్న పోలీసులు వారిని ఖాజీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు గ్రామంలో ఇరువర్గాల ఇళ్లను తనిఖీ చేయసాగారు. ఈ సమయంలో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా సోదరులనే అరెస్టు చేస్తారా.. మీ సంగతి తేలుస్తా.. అంటూ పోలీసు అధికారులపై దౌర్జన్యాలకు దిగారు. 


ఇది ఇలా ఉండగా..వైఎస్సార్‌ జిల్లా ఓబులవారిపల్లె మండలం గద్దలరేపుపల్లెలో బుధవారం పాయలవారిపల్లె దళితవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు బయనేని రెడ్డికుమార్‌పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. గద్దలరేపుపల్లె పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని ఓసీ మహిళకు రిజర్వు చేశారు.అదే ప్రాంతానికి చెందిన గిరిజన మహిళతో నామినేషన్ వేయించాలని చూసిన వారిపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.టీడీపీ నాయకులు సురపురాజు శ్రీధర్, సురపురాజు కృష్ణంరాజు, సురపురాజు మోటార్‌ బైక్‌పై వచ్చి దాడి చేశారు. మా ఊరికి వచ్చి .. అభ్యర్థిని నిలబెడతావా అంటూ దాడికి దిగారు.. పోలీసులకు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.. 




చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>