Movieskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg2019 తరువాత ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం.. దానికి సమాధానం ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు, అకౌంట్లపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించడానికి కట్టుబడి ఉన్నామంటూ అఫిడవిట్‌ రూపంలో బదులు ఇచ్చింది. తాజాగా- దాన్ని అమలు చేయడానికి జగన్ సర్కార్ సన్నహాలు చేపట్టినట్లు చెబుతున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఆరంభం కాబోయే 2021-2022 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ నిధులు, బ్యాంకు అకౌంట్లపై కాగ్ ఆడిట్ జరిపించడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారttd;amala akkineni;thirtha;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;jagan;vijayawada;andhra pradesh;indiaherald group;2019;high court;tirupati;husband;central government;party;tirumala tirupathi devasthanamకేంద్రం ఆధీనంలో టీటీడీ నిధులు....!!!!కేంద్రం ఆధీనంలో టీటీడీ నిధులు....!!!!ttd;amala akkineni;thirtha;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;jagan;vijayawada;andhra pradesh;indiaherald group;2019;high court;tirupati;husband;central government;party;tirumala tirupathi devasthanamThu, 04 Feb 2021 21:49:10 GMT
కేంద్రం ఆధీనంలో టీటీడీ నిధులు....!!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

 పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల.. క్రమంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకు అకౌంట్లు, నిధులను ఆడిట్ జరిపించడానికి జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ అకౌంట్లను కాగ్ ద్వారా ఆడిట్ జరిపిస్తామంటూ ప్రభుత్వం ఇదివరకే ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక కాగ్ ద్వారా ఆడిట్ జరిపించడానికి ముహూర్తం కూడా కుదిరినట్లు చెబుతున్నారు.
 

తిరుమల తిరుపతి దేవస్థానం సహా కొన్ని ప్రముఖ ఆలయాలకు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయ వ్యవయాలపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలనే డిమాండ్‌ను సుబ్రహ్మణ్యస్వామి చాలాకాలం నుంచి వినిపిస్తూ వస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆలయాల నిధులను దారి మళ్లించినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ధర్మపోరాట దీక్ష, నవనిర్మాణ దీక్ష వంటి పార్టీ కార్యక్రమాల కోసం ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను మళ్లించినట్లు వచ్చిన వార్తలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి 2018లోనే ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులను పంపించింది.
 
 2019 తరువాత ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం.. దానికి సమాధానం ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు, అకౌంట్లపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించడానికి కట్టుబడి ఉన్నామంటూ అఫిడవిట్‌ రూపంలో బదులు ఇచ్చింది. తాజాగా- దాన్ని అమలు చేయడానికి జగన్ సర్కార్ సన్నహాలు చేపట్టినట్లు చెబుతున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఆరంభం కాబోయే 2021-2022 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ నిధులు, బ్యాంకు అకౌంట్లపై కాగ్ ఆడిట్ జరిపించడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి త్రైమాసికానికి సంబంధించి.. టీటీడీకీ భక్తుల నుంచి అందిన విరాళాలు, కానుకలకు సంబంధింంచిన నివేదికలను కాగ్‌కు అందజేసేలా ఏర్పాట్లు చేయబోతోన్నట్లు తెలుస్తోంది.
 

 చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను తమ ప్రభుత్వ హయాంలో అవకాశం ఇవ్వకూడదని జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు.తిరుమల సహా మరి కొన్ని ప్రముఖ ఆలయాలను ఈ జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది. భక్తుల నుంచి అందే విరాళాలు, హుండీ కానుకలు, టికెట్లు, తీర్థ ప్రసాదాలను విక్రయించడం, అద్దె లేదా లీజుల రూపంలో వచ్చే రాబడి.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. ఏటా కోట్లాది రూపాయల మేర ఆదాయం వచ్చే ప్రధాన ఆలయాలను ఈ జాబితాలో చేర్చవచ్చని అంటున్నారు. తిరుమలతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వంటివి ఉంటాయని తెలుస్తోంది.
 
ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 




ఏకగ్రీవాలు జరిగింది ఇక్కడే! జిల్లాల వారీగా లిస్ట్

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>