Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/chris-gayle4b706ed3-4398-4067-b24e-18e544549dd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/chris-gayle4b706ed3-4398-4067-b24e-18e544549dd1-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెటర్లు 35 ఏళ్ల వచ్చాయంటే రిటైర్మెంట్‌కు దగ్గర పడినట్లే. అక్కడి నుంచి ఒకటి, రెండేళ్లు క్రికెట్ ఆడేసి రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. అప్పటికే వారి ఫాం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ అతడికి వయసు 41 ఏళ్ల 120 రోజులు. ఇప్పటికీ పట్టు తగ్గలేదు. బౌలర్లను ఊచకోత కోయడం ఆపలేదు. ‘నా కంటి టార్గెట్ ఉన్నప్పుడు టార్గెట్ తప్ప మరేం కనపడకూడదు’ అనే టాలీవుడ్ డైలాగ్ టైప్‌లో..chris gayle;cricket;maratha;tollywood;tsunami;chris morris;paruguఅబుధాబిలో సుడి‘గేల్’ సునామీ.. 41 ఏళ్లు దాటినా ఈ దూకుడేంటి..? 22 బంతుల్లోనే..అబుధాబిలో సుడి‘గేల్’ సునామీ.. 41 ఏళ్లు దాటినా ఈ దూకుడేంటి..? 22 బంతుల్లోనే..chris gayle;cricket;maratha;tollywood;tsunami;chris morris;paruguThu, 04 Feb 2021 20:52:00 GMTఅబుధాబి: సాధారణంగా క్రికెటర్లు 35 ఏళ్ల వచ్చాయంటే రిటైర్మెంట్‌కు దగ్గర పడినట్లే. అక్కడి నుంచి ఒకటి, రెండేళ్లు క్రికెట్ ఆడేసి రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. అప్పటికే వారి ఫాం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ అతడికి వయసు 41 ఏళ్ల 120 రోజులు. ఇప్పటికీ పట్టు తగ్గలేదు. బౌలర్లను ఊచకోత కోయడం ఆపలేదు. ‘నా కంటి టార్గెట్ ఉన్నప్పుడు టార్గెట్ తప్ప మరేం కనపడకూడదు’ అనే టాలీవుడ్ డైలాగ్ టైప్‌లో కంటి బంతి ఉన్నప్పుడు దానిని స్టాండ్స్‌లోకి పంపాలనే ఆలోచన తప్ప మరే ఆలోచన అతడి మైండ్‌లో ఉండదు.  ఆ బ్యాట్స్‌మన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అవును.. అతడే.. జమైకన్ క్రికెటర్ క్రిస్‌ గేల్. యూనివర్సల్ బాస్ అనే తన పేరుకు పూర్తి సార్థకత చేసుకుంటూ 41 ఏళ్లు దాటినా ఇప్పటికీ మైదానంలో సుడి‘గేల్’ అనింపించుకుంటూనే ఉన్నాడు. అబుదాబిలో బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో గేల్ విజృంభణకు వేదికైంది.

అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో క్రిస్ గేల్ భీకర ఇన్నింగ్స్ ఆడాడు. టీం అబుదాబి తరఫున బరిలోకి దిగిన గేల్ కేవలం 22 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. అంటే గేల్ కేవలం 15 బంతుల్లోనే బౌండరీల రూపంలో ఏకంగా 78 పరుగులు రాబట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. అయితే గేల్ భీకర ఇన్నింగ్స్‌తో అబుదాబి జట్టు ఈ టార్గెట్‌ను కేవలం ఐదున్నర ఓవర్లలోనే పూర్తి చేసింది.

ఇదిలా ఉంటే గేల్ ఇప్పటివరకు ఈ ఏడాది అబుదాబి టీ10 లీగ్‌లో తన స్థాయి ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్‌లో గేల్ సాధించిన అత్యధిక స్కోరు ఇంతవరకు కేవలం 9 పరుగులే అంటే ఆశ్చర్యం కలగకమానదు. అంటే ఒక్కసారి కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. అయితే, బుధవారం ఇన్నింగ్స్‌తో తాను బ్యాటు ఝుళిపిస్తే ప్రత్యర్థి పరిస్థితేంటే మరోసారి చూపించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో తన మార్క్‌ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు. స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. ప్రత్యర్థికి ఘోర పరాజయాన్ని మిగిల్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో గేల్ కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. టీ10 లీగ్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. గేల్‌కు ముందు, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ షెహజాద్ కూడా 2018 లో 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.


పాకిస్థాన్ పై మరో దేశం సర్జికల్ స్ట్రైక్.. ఏ దేశమంటే..

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>