Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/star-musiceed090b5-9acb-4fcd-805a-b6d8df93158e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/star-musiceed090b5-9acb-4fcd-805a-b6d8df93158e-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రస్తుతం సీరియల్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు ప్రేక్షకులు కూడా ప్రస్తుతం సినిమాల కంటే సీరియల్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కేవలం రెండున్నర గంటలపాటు థియేటర్లో ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాలకంటే రోజుల తరబడి ఎన్నో ట్విస్టులతో ఎంటర్టైన్మెంట్ అందించే సీరియల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో అయితే సీరియల్స్ కి బాగా కనెక్ట్ అయి పోతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే బుల్లితెర పై వస్తున్న సీరియల్స్ అన్నిటిలో సరికొత్త చరిత్ర సృష్టిsuma;deepa;suma;suma kanakala;tiru;korcha;television;history;doctor;katthiకార్తీక దీపం నిరూపమ్ కి వార్నింగ్ ఇచ్చిన యాంకర్ సుమా.. ఎందుకో తెలుసా..?కార్తీక దీపం నిరూపమ్ కి వార్నింగ్ ఇచ్చిన యాంకర్ సుమా.. ఎందుకో తెలుసా..?suma;deepa;suma;suma kanakala;tiru;korcha;television;history;doctor;katthiThu, 04 Feb 2021 09:10:00 GMTచరిత్ర సృష్టించి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ వెనక్కి నెట్టిఎన్నో  రోజుల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్.



 సీరియల్ లోని ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వంటలక్క పాత్రలో నటించిన ప్రేమే విశ్వనాధన్  పాత్ర ప్రేక్షకులందరికీ మరింత కనెక్ట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత డాక్టర్ బాబు పాత్ర కూడా ఎంతగానో కనెక్ట్ అయిపోయింది. రెండు పాత్రల చుట్టే కార్తీకదీపం సీరియల్ తిరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక కార్తీకదీపం సీరియల్ కి ఎంతలా  బుల్లితెర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు అంటే..  కార్తీకదీపం సీరియల్ వస్తుందంటే చాలు ఎన్ని పనులున్నా అక్కడే వదిలేసి టీవీ ముందుకు వచ్చి కూర్చుంటారు ఇక ఆ సమయంలో ఎవరైనా ఛానల్ మార్చారా ఇక వారి పరిస్థితి అదోగతి.


 ఇలా బుల్లితెర ప్రేక్షకులను  ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది కార్తీకదీపం సీరియల్. అయితే ఇటీవలే కార్తీకదీపం సీరియల్ బృందం మొత్తం మా టీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న.. స్టార్ట్ మ్యూజిక్ అనే కార్యక్రమానికి వచ్చారు.  ఈ క్రమంలోనే కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న నీరూపమ్ కూడా వచ్చాడు. నిరుపమ్ రాగానే కత్తి పట్టుకున్న యాంకర్ సుమ..  నువ్వు మా వంటలక్కను  ఎందుకు అంతలా బాధ పెడుతున్నావ్ అంటూ బెదిరిస్తుంది. ఇక అంతలో  అయ్యో డాక్టర్ బాబు మీకు కత్తి  చూపించానా  అంటూ యాక్టింగ్  చేస్తుంది.. ఆ తర్వాత మళ్లీ కత్తి చూపించి డాక్టర్ బాబు ఇంకోసారి మా వంటలక్క ను  బాధ పెట్టావో   అస్సలు బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తుంది.  ఇక దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


చి చి... బిజెపిని ఇప్పుడు కూడా తిట్టలేకపోతున్నారా...?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>