PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmaadda-electionsbba4f76a-8565-493b-9039-cdbe1a3087c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmaadda-electionsbba4f76a-8565-493b-9039-cdbe1a3087c0-415x250-IndiaHerald.jpgఅదేదే సినిమాలో హీరో సిద్ధార్ధ అంటాడు. నా ఇష్టంతో పని లేకుండా అంతా మీరే చేశారు అని. ఇపుడు అదే సీన్ వైసీపీలో కనిపిస్తోంది. వైసీపీలో హై కమాండ్ ఓ వైపు పంచాయతీ ఎన్నికల వేళ కచ్చితమైన ఆదేశాలు ఇస్తూ టార్గెట్లు పెడుతూంటే క్యాడర్ మాత్రం వాటి మీద గుస్సా అవుతున్నారు. అంతా మీరే చేసి చిరిగి చేట అయిన తరువాత ఇపుడు సక్సెస్ ఫుల్ గా రిజల్ట్స్ అంటే ఎలా అంటూ గుర్రుమంటున్నారు. jagan-nimmaadda-elections;kumaar;panchayati;episode;war;hero;success;ycp;march;ishtam;partyజగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?jagan-nimmaadda-elections;kumaar;panchayati;episode;war;hero;success;ycp;march;ishtam;partyThu, 04 Feb 2021 10:30:00 GMTహీరో సిద్ధార్ధ అంటాడు. నా ఇష్టంతో పని లేకుండా అంతా మీరే చేశారు అని. ఇపుడు అదే సీన్ వైసీపీలో కనిపిస్తోంది. వైసీపీలో హై కమాండ్ ఓ వైపు పంచాయతీ ఎన్నికల వేళ  కచ్చితమైన ఆదేశాలు ఇస్తూ టార్గెట్లు పెడుతూంటే క్యాడర్ మాత్రం వాటి మీద గుస్సా అవుతున్నారు. అంతా మీరే చేసి చిరిగి చేట అయిన తరువాత ఇపుడు సక్సెస్ ఫుల్ గా  రిజల్ట్స్ అంటే ఎలా అంటూ గుర్రుమంటున్నారు.

ఇంతకీ ఇదంతా ఏంటి అంటే పంచాయతీ ఎన్నికల వేళ వైసీపీలో సాగుతున్న అతి పెద్ద పంచాయతీగా చూడాలి. గత ఏడాది మార్చి 15 వరకూ నిమ్మళంగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పేచీ పెట్టుకుని మొత్తానికి మొత్తం ఒక పెద్ద వార్ లా మార్చేసిన ఘనతను వైసీపీ పెద్దలు మూటకట్టుకున్నారని అంటున్నారు. తాము అన్నీ చేసి ఇపుడు పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ రావాలంటే ఎలా అంటూ దిగువ స్థాయి నేతలు మండిపోతున్నారుట.

ఎన్నికల సంఘం అంటే రాజ్యాంగ బధ్ధమైన సంస్థ. దానికికి విశేషమైన అధికారాలు ఉంటాయి. కానీ వైసీపీ పెద్దలు ఇవన్నీ మరచి కొరివి తో తల గోక్కున్న చందంగా వ్యవహరించారని, వాటి ఫలితాలు ఇపుడు పంచాయతీ ఎన్నికల సాక్షిగా చూస్తున్నామని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వ పెద్దల మధ్య జరిగిన ఎపిసోడ్ లో ఇపుడు వైసీపీ పెద్దలదే తప్పు ఉందని కూడా అంటున్నారు. ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థతో సరిగ్గా డీల్ చేయకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు. ఇపుడు తన అసలైన పవర్స్ అన్నీ నిమ్మగడ్డ చూపిస్తూంటే విలవిలలాడడం వైసీపీ నేతల వంతు అవుతోంది. కేవలం పదకొండు నెలల్లో ఎంత మార్పు అని కూడా అంటున్నారు. నాడు పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయని ఇపుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎదురీతే అవుతోందని వైసీపీ నాయకులు వాపోతున్నారు. మొత్తానికి వైసీపీ పెద్దల అహంకారం వల్లనే కధ ఇంతవరకూ వచ్చిందని కూడా అంటున్నారుట.





కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>