MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-mahesh-babu-boxoffice-war4964d8d1-e0db-4615-937c-2e274028fc4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-mahesh-babu-boxoffice-war4964d8d1-e0db-4615-937c-2e274028fc4a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇప్పటివరకు చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో తమ సినిమాలతో తలపడ్డారు. అయితే దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా సమానమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ కలిగిన ఈ ఇద్దరు హీరోలు కూడా సమానంగా విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం పరశురాం పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, సర్కారు వారి పాట మూవీ చేస్తుంటే, మరోవైపు ఏకంగా మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. pawan kalyan - mahesh babu;pawan;mahesh;kalyan;kranthi;kranti;pawan kalyan;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;producer;september;remake;producer1;thief;research and analysis wing;dongaపవన్ కళ్యాణ్ తో మహేష్ బాబు యుద్ధం .... అసలు మ్యాటర్ ఇదే .....?పవన్ కళ్యాణ్ తో మహేష్ బాబు యుద్ధం .... అసలు మ్యాటర్ ఇదే .....?pawan kalyan - mahesh babu;pawan;mahesh;kalyan;kranthi;kranti;pawan kalyan;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;producer;september;remake;producer1;thief;research and analysis wing;dongaThu, 04 Feb 2021 22:36:51 GMTటాలీవుడ్ టాప్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇప్పటివరకు చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో తమ సినిమాలతో తలపడ్డారు. అయితే దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా సమానమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ కలిగిన ఈ ఇద్దరు హీరోలు కూడా సమానంగా విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం పరశురాం పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, సర్కారు వారి పాట మూవీ చేస్తుంటే, మరోవైపు ఏకంగా మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

వాటిలో ముందుగా వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్  9న రిలీజ్ కానుండగా, అయ్యప్పనుమ్ కొషియం తెలుగు రీమేక్ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. అయితే వీటితో పాటు పవర్ స్టార్, క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న పీరియడికల్ డ్రామా మూవీ కూడా వేగవంతంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట మూవీ ని సంక్రాంతి కానుకగా 2022లో రిలీజ్ చేస్తాం అంటూ యూనిట్ ఇటీవల అధికారిక ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అలానే పవన్, క్రిష్ ల సినిమా కూడా 2022 సంక్రాంతి ని టార్గెట్ చేసి, అదే సమయంలో రిలీజ్ కానుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదని మరికొందరు అంటున్నారు. ఒకవేళ ఈ మూవీ పక్కాగా సంక్రాంతికి వస్తే మాత్రం చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సూపర్ స్టార్, పవర్ స్టార్ ల సినిమాల మధ్య భారీ బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంటున్నారు విశ్లేషకులు. అయితే యూనిట్ మాత్రం వీలైనంత త్వరగా మూవీని పూర్తి చేసి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తోందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే......!!


బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>