PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc3f82b18-63ce-4690-bd65-a02f01b64920-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc3f82b18-63ce-4690-bd65-a02f01b64920-415x250-IndiaHerald.jpgఏపిలో రాజకీయ రచ్చలు కొనసాగుతున్నాయి.. మొదటి విడత నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. గతంలో అనుకున్న దానికన్నా తక్కువ నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇకపోతే నేటి తో రెండో విడత నామినేషన్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. అయిన రాజకీయ నాయకులు అంతా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో మద్యం, నగదు పంపిణీ జరుగుతూనే ఉంది. వాటిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. jagan-nimmagadda-elections;cbn;ram madhav;police;media;mla;tdp;central government;ycp;research and analysis wing;party;mantraజగడ్డ: చచ్చిన పాము లాంటి చంద్రబాబుపై కక్ష కడతామా?జగడ్డ: చచ్చిన పాము లాంటి చంద్రబాబుపై కక్ష కడతామా?jagan-nimmagadda-elections;cbn;ram madhav;police;media;mla;tdp;central government;ycp;research and analysis wing;party;mantraThu, 04 Feb 2021 11:00:00 GMT


ఇది ఇలా ఉండగా .. టీడీపీ పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం లో బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంలో తయారైన లేఖనే గతంలో నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు యాప్‌ అదే మాదిరిగా ఉందన్నారు. 'టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ యాప్‌ తెచ్చారని భావిస్తున్నాం. పక్ష పాతంతో వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని పేర్కొన్నారు.



మంత్రుల హక్కులకు భంగం కలిగిస్తే విచారించే అధికారం ప్రివిలేజ్‌ కమిటీకి ఉంటుంది. విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయి' అని పేర్కొన్నారు. టీడీపీ నేత పట్టాభిని పరామర్శించిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ఆరోపణలపై అంబటి ఘాటుగా స్పందించారు. చచ్చిన పాము లాంటి చంద్రబాబుపై కక్ష కట్టాల్సిన అవసరం మాకులేదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మళ్లీ అధికారం లోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని ఈ సందర్బంగా ఎద్దేవా చేశారు. ఇకపోతే నిన్న జరిగిన పట్టాభి పై ఘటన వల్ల బాబు మరో నాటకానికి తెర తీస్తున్నాడు అంటూ మండిపడ్డాడు. రాష్ట్రం లో టీడీపీ నేతల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి.. వాటికి ప్రజలు చూస్తున్నారు.. వాళ్ళే బుద్ది చెప్తారు.. వైసీపీ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు..





ఆధార్ లింక్‌తో అవస్థలు.. అవకాశం ఉన్నా ఇంత దారుణమా..?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>