PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sonal-modi-narendra-modi221eaadf-cc16-4a33-9463-93adb73437b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sonal-modi-narendra-modi221eaadf-cc16-4a33-9463-93adb73437b3-415x250-IndiaHerald.jpgఅయితే గుజరాత్‌లో ఇప్పుడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ కుటుంబ సభ్యులు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోడీ సోదరుడి కూతురు సోనాల్ మోడీ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు.తామంతా ఎవరికి వారు.. సొంతంగా కష్టపడి సంపాదిస్తున్నామని, తాను కూడా ఓ రేషన్ షాప్ నిర్వహిస్తున్నానని ప్రహ్లాద్ చెప్పారు.sonal modi narendra modi;modi;bharatiya janata party;ahmedabad;gujarat - gandhinagar;narendra modi;congress;prime minister;qualification;party;narendraమోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..sonal modi narendra modi;modi;bharatiya janata party;ahmedabad;gujarat - gandhinagar;narendra modi;congress;prime minister;qualification;party;narendraThu, 04 Feb 2021 08:33:57 GMTబీజేపీ బలంగా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఆగ్యమ గోచరంగా ఉంది. కాంగ్రెస్ పై బీజేపీ సహా ఇతర విపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ వారసత్వ రాజకీయం. కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయాలే తప్ప కొత్త వారికి అవకాశం ఉండదని వాదిస్తుంటారు. ఇటు బీజేపీలో మాత్రం వారసత్వ రాజకీయాలు చాలా తక్కువ, ప్రధాని నరేంద్ర మోడీ కుటుంబం నుంచి ఇంతవరకు ఎవరూ రాజకీయాల్లో లేరు. ఇదే ఆయనకు ప్లస్ గా ఉందంటారు.

        అయితే గుజరాత్‌లో ఇప్పుడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ కుటుంబ సభ్యులు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోడీ సోదరుడి కూతురు సోనాల్ మోడీ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అహ్మదాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు నామినేషన్ దాఖలు చేసేందుకు అర్హత ఉందని ఆమె చెప్పారు. అయితే ప్రధాని మోడీకి బంధువుగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని, నిజాయతీ కలిగిన బీజేపీ కార్యకర్తగా మాత్రమే తాను పోటీ చేయాలనుకుంటున్నానని సోనాల్ చెప్పారు.

    సోనాల్ మోడీ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుమార్తె. ఆమె అహ్మదాబాద్‌లో ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గుజరాత్ కిరాణా దుకాణ సముదాయాల సంఘానికి సోనాల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.  అహ్మదాబాద్‌లోని బోడక్‌దేవ్ వార్డు రిజర్వేషన్‌లో భాగంగా మహిళకు కేటాయించారు. దీంతో అక్కడి నుంచి పోటీకి ఆమె సిద్ధమవుతున్నారు.

   మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కుమార్తె నిర్ణయాన్ని ప్రహ్లాద్ మోడీ సమర్థించారు. తన కుటుంబ సభ్యులకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. తామంతా ఎవరికి వారు.. సొంతంగా కష్టపడి సంపాదిస్తున్నామని, తాను కూడా ఓ రేషన్ షాప్ నిర్వహిస్తున్నానని ప్రహ్లాద్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన ఉంటున్న నివాసానికి కూడా తాను ఇప్పటిదాకా వెళ్లలేదని తెలిపారు. మొత్తానికి  సోనాల్ మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం... గుజరాత్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.




నిమ్మగడ్డ యాప్ నిలిచేనా? హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>