SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/vedula-suryanarayana-sastryc829c559-a79d-4af1-baf0-82e8359bb1c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/vedula-suryanarayana-sastryc829c559-a79d-4af1-baf0-82e8359bb1c2-415x250-IndiaHerald.jpgసాహిత్య, వ్యాకరణ శాస్త్రాల్లో నిష్ణాతునిగా తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వేదుల సూర్యనారాయణ శర్మ.1911 ఫిబ్రవరి 4 న పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు లో జన్మించారు. వేదుల‌ సంస్కృతం, పాళీ, ఆంగ్ల భాషల్లో మంచి పట్టు సాధించారు. వివిధ భాషల్లో ప్రావీణ్యాన్ని సాధిస్తూనే మరో వైపు రచనలకు శ్రీకారం చుట్టారు. శర్మగారు 1936లో ‘శృంగార నళీయం’ అనే మాలికా రచన చేశారు. ఇందులో మూడు వందల చంపక మాలికా పాదాలున్నాయి. ఇది ‘ల’కార ప్రాసతో ఉంటుంది. ఆయన రచనల్లో ‘లక్ష్మీసహస్ర కావ్యం’ (1942) ఎందరి దృష్టినో ఆకర్షింvedula_suryanarayana_sastry;ankhita;arya;chakravarthy;rachana;ramya;ramya krishnan;godavari river;chanakya-movie-2019;district;telugu;west godavari;chanakya;february;doctor;sanskrit;aryaaహెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు వెలుగు వేదుల సూర్య‌నారాయ‌ణ‌...హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు వెలుగు వేదుల సూర్య‌నారాయ‌ణ‌...vedula_suryanarayana_sastry;ankhita;arya;chakravarthy;rachana;ramya;ramya krishnan;godavari river;chanakya-movie-2019;district;telugu;west godavari;chanakya;february;doctor;sanskrit;aryaaThu, 04 Feb 2021 07:00:00 GMTఫిబ్రవరి 4 న పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు లో జన్మించారు. వేదుల‌ సంస్కృతం, పాళీ, ఆంగ్ల భాషల్లో మంచి పట్టు సాధించారు. వివిధ భాషల్లో ప్రావీణ్యాన్ని సాధిస్తూనే మరో వైపు రచనలకు శ్రీకారం చుట్టారు. శర్మగారు 1936లో ‘శృంగార నళీయం’ అనే మాలికా రచన చేశారు. ఇందులో మూడు వందల చంపక మాలికా పాదాలున్నాయి. ఇది ‘ల’కార ప్రాసతో ఉంటుంది. ఆయన రచనల్లో ‘లక్ష్మీసహస్ర కావ్యం’ (1942) ఎందరి దృష్టినో ఆకర్షించి తెలుగునాట ప్రసిద్ధి చెందింది. ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు.


ఇతివృత్తాన్ని బట్టి శైలీ వైవిధ్యాన్ని చూపడం తన ప్రత్యేకతగా శర్మగారు నిరూపించుకున్నారు. అహింసామూర్తి బుద్ధ భగవానుడు తన శిష్యులకు పాళీ భాషలో అందించిన సూక్తిరత్నాల్లో కొన్నింటిని శర్మగారు ‘బుద్ధగీత’ పేరిట తెలుగులో తేటగీతులుగా రాశారు. ‘బుద్ధగీత’లో విషయాలు లోకోత్తరము, ఇందులో శైలి ఎంతో రమ్యంగా ఉందని ప్రథమ ముద్రణ సందర్భంగా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ప్రశంసించారు. ఆదిశంకరుల వారి ‘వివేక చూడామణి’ని శర్మగారు ‘శ్రీ శంకర భగవద్గీత’గా 1989లో ఆంధ్రీకరించారు.


సరళమైన వ్యాఖ్యానంతో హృదయానికి హత్తుకుపోయేలా తేటగీతుల్లో ఆదిశంకరుల వారి హృదయాన్ని ఇందులో తేటతెల్లం చేశారు. వ్యాసప్రోక్తమైన భగవద్గీతను ‘తెలుగు వెలుగు భగవద్గీత’గా తేటగీతుల్లో రాసి, వ్యాస హృదయాన్ని ఆవిష్కరించారు. శర్మగారు రాసిన ‘ఆర్య చాణక్యుడు’, ‘కాకతి ప్రోలరాజు’ నవలలు చారిత్రక ఇతివృత్తంతో కూడినవి. ‘ఆర్య చాణక్యుడు’లో చాణక్యుడు (అర్థశాస్త్రం), వాత్స్యాయనుడు (కామశాస్త్రం) ఒకరేనని, ఈ రెండు గ్రంథాలను వేర్వేరు పేర్లతో రాశారని పలు ఆధారాలను చూపారు. ఈ వాదనలు పండితుల ఆమోదాన్ని పొందాయి. పురాణ వాజ్మయాన్ని శాసనాధారాలతో సమన్వయం చేసి కాకతీయులు ఎవరో ‘కాకతి ప్రోలరాజు’ నవలలో తేల్చి చెప్పారు.తన జీవితాన్ని సాహితీ సేవకే అంకితం చేసిన శర్మగారు 1999 ఫిబ్రవరి 2న ప‌ర‌మ ప‌దించారు.


హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డను వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోందో తెలుసా ?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>