PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-voltage-news-you-are-shockedfe0bd825-bd79-4d2d-a31f-74ec16dead92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-voltage-news-you-are-shockedfe0bd825-bd79-4d2d-a31f-74ec16dead92-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌లో ఆల్‌‌ టైమ్‌‌ రికార్డు నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఏపీలోని అత్యధిక డిమాండ్‌‌కు మించి కరెంటు వాడకం గత వారం చివరిలో నమోదయింది. 13వేల 252 మెగావాట్ల డిమాండ్‌‌ నమోదయింది. గత ఏడాది ఫిబ్రవరి 28న 13వేల 168 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఉమ్మడి ఏపీలో 2014 మార్చి 23న అత్యధికంగా 13వేల 162 మెగావాట్ల కరెంటు వాడగా.. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకుమించి డిమాండ్‌‌ నమోదయింది. గత ఏడాది జనవరి 30న రాష్ట్రంలో డిమాండ్ 11వేల 300 మెగావాట్లే. యాసంగి సాగు పెరగడంతhigh voltage news you are shocked;vidya;telangana;january;pond;2020;electricity;september;february;aqua;marchహై ఓల్టేజ్ న్యూస్.. మీకు షాక్ కొట్టేంతలా..!హై ఓల్టేజ్ న్యూస్.. మీకు షాక్ కొట్టేంతలా..!high voltage news you are shocked;vidya;telangana;january;pond;2020;electricity;september;february;aqua;marchThu, 04 Feb 2021 15:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌లో ఆల్‌‌ టైమ్‌‌ రికార్డు నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఏపీలోని అత్యధిక డిమాండ్‌‌కు మించి కరెంటు వాడకం గత వారం చివరిలో నమోదయింది. 13వేల 252 మెగావాట్ల డిమాండ్‌‌ నమోదయింది. గత ఏడాది ఫిబ్రవరి 28న 13వేల 168 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఉమ్మడి ఏపీలో 2014 మార్చి 23న అత్యధికంగా 13వేల 162 మెగావాట్ల కరెంటు వాడగా.. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకుమించి డిమాండ్‌‌ నమోదయింది. గత ఏడాది జనవరి 30న రాష్ట్రంలో డిమాండ్ 11వేల 300 మెగావాట్లే. యాసంగి సాగు పెరగడంతో అగ్రికల్చర్‌‌ సెక్టార్‌‌లో కరెంటు వాడకం పెరుగుతోంది.

రాష్ట్రం ఏర్పడే నాటికి 19. 02 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు అవి 24.31 లక్షలకు పెరిగాయి. అనధికార కనెక్షన్లతో కలిపి 25. 50 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రెండేళ్లుగా వర్షాలు కురిసి బావులు, బోర్లు, చెరువుల్లో నీళ్లు ఉండటంతో సాగుకు కరెంటు వాడకం పెరిగింది. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్, కల్వకుర్తి, దేవాదుల, కాళేశ్వరం లింక్ 1, 2 ప్రాజెక్టుల్లో నీటి లిఫ్టింగ్‌‌కు కరెంటు వాడుతున్నారు. యాసంగి సాగు పెరిగినందున ఫిబ్రవరి, మార్చిల్లో కరెంటు వాడకం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2014లో ఎత్తిపోతల పథకాలకు 680 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా..  పంపుహౌజ్‌‌లలో పంపింగ్‌‌ మొదలయ్యేందుకు 2వేల 200 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతోంది.

రాష్ట్రంలో పట్టణీకరణ పెరగడంతో కమర్షియల్ కరెంటు కనెక్షన్లు పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం కరెంటు కనెక్షన్లు 1.11 కోట్లు ఉంటే ఇప్పుడవి 1.54 కోట్లకు చేరాయి. ఎండాకాలం ప్రారంభం కాకముందే రాష్ట్రంలో కరెంటు డిమాండ్‌‌ పెరుగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యాసంగి పంటలకు కరెంటు వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఎండాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరుగుతుంది. దీంతో ఫిబ్రవరి తొలివారం నుంచి కరెంటు వినియోగం 14 వేల మెగావాట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో విద్యుత్ వినియోగం 189. 6 గిగావాట్లకు చేరుకుంది.


జనవరి 28న రికార్డ్ అయిన ఆల్ టైమ్ హై 188.4 గిగావాట్స్‌‌ను దాటిపోయినట్లు ఎలక్ట్రిసిటీ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రిసిటీ డిమాండ్‌‌తోపాటు రిఫైనరీలు, జీఎస్టీ కలెక్షన్లు, రైల్వే రవాణా పెరుగుతుండటంతో ఎకానమీ రికవర్‌‌ అవుతోందని తెలుస్తోంది. 2020 సెప్టెంబర్ నుంచి ఎలక్ట్రిసిటీ సెక్టార్ పాజిటివ్ గ్రోత్‌‌ను రికార్డు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో ఎలక్ట్రిసిటీ, కన్‌‌స్ట్రక్షన్ రంగాలు 7.1 శాతం, 4.4 శాతంతో వీ- షేప్ రికవరీని రిజిస్టర్ చేస్తున్నాయని అంచనాలున్నాయి. నిరంతరం కరెంట్‌ సప్లైకు, డిస్కమ్‌‌లను ఆదుకునేందుకు సరికొత్త స్కీమ్‌‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.


జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?

ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో.. !!

కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>