MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dabbing-janaki5c05db4f-c842-45e9-a3bb-3c9aa9475801-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dabbing-janaki5c05db4f-c842-45e9-a3bb-3c9aa9475801-415x250-IndiaHerald.jpg80, 90వ దశకాల్లో అమ్మ పాత్ర అంటే గుర్తొచ్చే నటీమణి డబ్బింగ్ జానకి. స్వాతి కిరణం, సాగరసంగమం, 20వ శతాబ్దం తదితర చిత్రాల్లో నటించిన డబ్బింగ్ జానకి అందరికీ సుపరిచితురాలే. పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పిన జానకి.. తన వృత్తినే పేరుగా మార్చుకున్న నటి. తాను డబ్బింగ్ చెబితే నటీమణులకు అచ్చు అతికినట్టు ఉంటుంది.dabbing janaki;kamal hassan;swati;prema;swathi;tara;cinema;telugu;kanna lakshminarayana;tamil;kannada;love;chennai;heroine;chitramడబ్బింగ్ జానకి తినే కంచాన్ని కాలితో తన్నిన నటి ఎవరు..?డబ్బింగ్ జానకి తినే కంచాన్ని కాలితో తన్నిన నటి ఎవరు..?dabbing janaki;kamal hassan;swati;prema;swathi;tara;cinema;telugu;kanna lakshminarayana;tamil;kannada;love;chennai;heroine;chitramThu, 04 Feb 2021 17:02:46 GMT80, 90వ దశకాల్లో అమ్మ పాత్ర అంటే గుర్తొచ్చే నటీమణి డబ్బింగ్ జానకి. స్వాతి కిరణం, సాగరసంగమం, 20వ శతాబ్దం తదితర చిత్రాల్లో నటించిన డబ్బింగ్ జానకి అందరికీ సుపరిచితురాలే. పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పిన జానకి.. తన వృత్తినే పేరుగా మార్చుకున్న నటి. తాను డబ్బింగ్ చెబితే నటీమణులకు అచ్చు అతికినట్టు ఉంటుంది. భూకైలాస్ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన జానకి.. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషాల్లో 700 చిత్రాలకు పైగా నటించారు.

అయితే ఆమె సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడ్డారట. ఆమె పరిశ్రమకు వచ్చి 60 ఏళ్లు దాటింది. సినిమాల్లోకి రాకముందే తన 16వ ఏట ఆమెకు పెళ్లైంది. నటన మీద ప్రేమ ఉన్నా.. బతుకుదెరువు కోసమే సినిమాల్లోకి వచ్చానని మొహమాటం లేకుండా చెబుతారు. గూఢాచారి వన్ వన్ సెవెన్ తమిళ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసే సమయంలో శ్రీశ్రీ గారు పిలిచి ఆ సినిమాలో ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పమని అడిగారు. అలా మొదటిసారి 117 సినిమాకి డబ్బింగ్ చెప్పారట. అప్పట్లో జానకి అంటే ఎవరు అడిగేవారు. అయితే డబ్బింగ్ జానకి అని చెప్పడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. అయితే మొదటగా నటిగానే కెరీర్ ప్రారంభమైంది.

భూకైలాస్ సినిమాలో హీరోయిన్ చెలికత్తెగా నటనా జీవితాన్ని ప్రారంభించింది జానకి. తర్వాత శంకరాభరణం, కమల్ హాసన్ కి తల్లిగా సాగరసంగమం సినిమాల్లో నటించి మెప్పించారు. సినీ పరిశ్రమలో 60 ఏళ్ల పాటు కొనసాగినా పెద్దగా ఆస్తులు సంపాదించలేదట. అయితే మద్రాసులో సొంత ఇల్లు, తినడానికి తిండికి మాత్రం లోటు లేదని జానకి చెప్పింది. అయితే తనకు తమిళ పరిశ్రమే ఇష్టమని జానకి అంటోంది. తనకు తెలుగు కన్నా తమిళంలోనే మంచి గుర్తింపు వచ్చిందట.
అప్పట్లో అవుట్ డోర్ షూట్ కి వెళితే ఒకే రూమ్ లో ఇద్దరు ముగ్గురుతో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారట. అలా ఒకసారి షూటింగ్ కి వెళ్లినప్పుడు .. త్వరగా భోజనం చేసి పడుకున్నారట. అప్పుడు తనతో పాటు రూమ్ లో ఉన్న నటి.. తర్వాత వచ్చి.. జానకి తినిందా..అంటే తినేసింది అన్నారట. దానికి ఆమె కోపంతో జానకి తిన్న తర్వాత మిగిలింది నేను తినాలా అంటూ క్యారేజిని ఒక్క తన్ను తన్నిందట. దీంతో భోజనమంతా చిందరవందరగా పడిపోయింది. దానికి ఫలితం ఆమె అనుభవించిందని.. తనకు జరిగిన అవమానం గురించి డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు.


ఉప్పెన ట్రైలర్ : ప్రేమ గొప్పదైతే సమాధుల్లో కనపడాలి..!

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>