MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-infoaebe579d-3516-455f-8890-89ce2b5c32ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-infoaebe579d-3516-455f-8890-89ce2b5c32ab-415x250-IndiaHerald.jpgఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డికె రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తున్న విజయ్ సేతుపతికి ఆ సిరీస్ లో నటిస్తున్న కోస్టార్... బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ కంటే ఎక్కువ పారితోషికం చెల్లించారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. vijay sethupathi info;shahid kapoor;kirti;raj;sethu;vijay;vijay sethupathi;bollywood;tollywood;cinema;rajani kanth;amazon;kollywood;tamil;event;comedy;husband;hero;joseph vijay;shahid;nijamబాలీవుడ్ ని షేక్ చేస్తున్న విజయ్ సేతుపతి...భారీ డిమాండ్...?బాలీవుడ్ ని షేక్ చేస్తున్న విజయ్ సేతుపతి...భారీ డిమాండ్...?vijay sethupathi info;shahid kapoor;kirti;raj;sethu;vijay;vijay sethupathi;bollywood;tollywood;cinema;rajani kanth;amazon;kollywood;tamil;event;comedy;husband;hero;joseph vijay;shahid;nijamThu, 04 Feb 2021 12:59:58 GMTకామెడీ టైమింగ్, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగల నటన ఆ హీరో సొంతం. అతడే తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి. ఎంతో సాధారణమైన వ్యక్తిగా సినీ జీవితాన్ని మొదలు పెట్టి, ఇప్పుడు ఈ రేంజ్ కి చేరుకున్నారు విజయ్ సేతుపతి. ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ అబ్బురపరిచే నటనతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఈ హీరో. నాయకుడు, ప్రతినాయకుడు, సహాయనటుడు... ఇలా ఏ పాత్రలో అయినా నటించి, మెప్పించగల నటుడు విజయ్‌ సేతుపతి. అయితే ఈ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి.. ఓ బాలీవుడ్ హీరో కి మించి పారితోషికం తీసుకున్నాడు అన్న ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాదు అటు ఉత్తరాదిన కూడా ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇదేమి అంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.. మా అన్న ఎందులోనైనా ఫస్ట్ అంటున్నారట ఈయన ఫాన్స్. ఇంతకీ ఎవరా బాలీవుడ్ హీరో..??ఎందులో వీరిద్దరూ కలిసి నటించారు అంటే..?? ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డికె రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తున్న విజయ్ సేతుపతికి ఆ సిరీస్ లో నటిస్తున్న కోస్టార్... బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ కంటే ఎక్కువ పారితోషికం చెల్లించారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ `సన్నీ` పేరుతో ఇది రూపొందుతోంది. మొత్తం సీజన్ కు గాను షాహిద్ రూ .40 కోట్లకు డీల్ కుదుర్చుకోగా.. ఇదే ప్రాజెక్ట్ కోసం సేతుపతి సుమారు 55 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం.

ఇది షాహిద్ తో పోలిస్తే చాలా పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవడం సెన్సేషనల్ న్యూస్ గా మారింది. మరోవైపు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈయనకు పెద్దపీట వేస్తున్నారు. టాలీవుడ్ మరియు కోలీవుడ్ లోనూ... కొందరు దర్శక నిర్మాతలు సేతుపతితో వారి సినిమా ట్రైలర్ లాంచ్ లు.. ఈవెంట్ గెస్ట్ అంటూ పలు కార్యక్రమాలకు సేతుపతిని సెలబ్రిటీ గెస్ట్ గా పిలిచి.. ఆయన చేతుల మీదగా జరిపిస్తూ ఆయన కీర్తి ప్రతిష్టలు మరింత పెంచేస్తున్నారు. ఒక చిన్న నటుడిగా ప్రారంభమై ఇంత పెద్ద స్థాయికి చేరుకోవడం అంటే నిజంగా విజయ్ సేతుపతి కేక అంటున్నారు ఫ్యాన్స్.


కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>