CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimeee507a6a-fd8a-4d9f-8acd-48d8c9dae5da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimeee507a6a-fd8a-4d9f-8acd-48d8c9dae5da-415x250-IndiaHerald.jpgఅనుమానం 17ఏళ్ల ప‌చ్చ‌టి సంసారంలో చిచ్చు రేపింది.. గొడ‌వ‌ల‌తో మొద‌లై.. చివ‌రికి క‌డ‌వ‌ర‌కు క‌ల‌సి తోడు నీడ‌గా జీవిస్తామ‌ని ఏడడుగులు వేసిన భ‌ర్తే భార్య‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. ఈ సంఘ‌ట‌న గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం మున్నంవారి పాలేనికి చెందిన పలిమినేని సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన దివ్య అనే మహిళను 17 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. సజావుగా సాగుతున్న వారి సంసారంలో అనుమానం అనే భూతం ప్రవేశించింcrime;munna;nithya new;prema;district;police;love;husband;wife;reddy;divya bhatnagar;bapatlaఅక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌ని... రోక‌లి బండ‌తో త‌ల ప‌గ‌ల‌గొట్టాడు...అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌ని... రోక‌లి బండ‌తో త‌ల ప‌గ‌ల‌గొట్టాడు...crime;munna;nithya new;prema;district;police;love;husband;wife;reddy;divya bhatnagar;bapatlaThu, 04 Feb 2021 10:15:00 GMTజిల్లా బాపట్ల పరిధిలో జరిగింది.   గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం మున్నంవారి పాలేనికి చెందిన పలిమినేని సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన దివ్య అనే మహిళను 17 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. సజావుగా సాగుతున్న వారి సంసారంలో అనుమానం అనే భూతం ప్రవేశించింది. భార్యపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ రెడ్డి నిత్యం వేధించాడు.


దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుల పెద్దలు వారి మధ్య సయోధ్య కుదిర్చినా కొన్నాళ్లపాటు బాగానే ఉన్నారు. మళ్లీ వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే  బుధ‌వారం అర్ధరాత్రి ఇంట్లోనే భార్య నిద్రపోతోంది. భార్య గాఢ నిద్రలో ఉండటాన్ని గమనించిన భర్త రోకలిబండతో ఆమె తల పగలగొట్టాడు.అనంతరం ఇంట్లోంచి పరారయ్యాడు. ఆమె అరుపులు విన్న పక్కింటి వాళ్లు వచ్చి చూశారు. ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


అంత్యక్రియలు కూడా బుధవారమే పూర్తయ్యాయి. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడైన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. గ‌డిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహేత‌ర సంబంధాలు, అనుమానాల‌తో భార్య‌భ‌ర్త‌ల మధ్య వివాదాలు త‌లెత్తి హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న సంఘ‌ట‌న‌లు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు పోలీసులు. ఇలాంటి ప‌రిణామాల‌తో ప్రాణాలు గాలిలో క‌లిసిపోవ‌డంతో పుట్టిన సంతానం అనాథ‌లుగా మారుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదో పెద్ద సామాజిక స‌మ‌స్య‌గా మారుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.




మంచువారబ్బాయి రెండో పెళ్లి.. ఇంతకీ వధువు ఎవరంటే..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>