PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-police-stationa5fe4f9a-0984-4dd3-a167-26a4a2497929-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-police-stationa5fe4f9a-0984-4dd3-a167-26a4a2497929-415x250-IndiaHerald.jpg రైతులకు అన్ని విధాలుగా వారికవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్. అలాగే దిశ చట్టం పై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్. దిశ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించిన ... మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. farmers police station;amala akkineni;ranina;jagan;andhra pradesh;2019;court;chief minister;2020;police station;traffic police;college;reddyశుభవార్త: రైతుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్...!శుభవార్త: రైతుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్...!farmers police station;amala akkineni;ranina;jagan;andhra pradesh;2019;court;chief minister;2020;police station;traffic police;college;reddyThu, 04 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు రైతులకు అండగా నిలబడి వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. నాణ్యమైన విత్తనాలు అందేలా చూస్తామన్నారు. అలాగే రైతుకు పంట చేతికొచ్చాక విక్రయం తదితర వ్యవహారాల్లో రైతులకు అండగా నిలవాలని సూచించారు. అంతేకాకుండా రైతులకు సంబంధించిన సమస్యలు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా జిల్లాకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు సీఎం.

అందరికీ అన్నం పెట్టే రైతు జీవితానికి భరోసా కల్పించేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్. ప్రతి పోలీస్ స్టేషన్లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల సమస్యల కొరకు కూడా ఒక డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి కనుక... దీనిపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం జగన్. తద్వారా రైతులకు ఎప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా ఈ వ్యవస్థ వెంటనే స్పందించి వారికి అండగా నిలుస్తుందన్నారు.

రైతులకు అన్ని విధాలుగా వారికవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్. అలాగే దిశ చట్టం పై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్. దిశ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించిన ... మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. రాష్ట్రంలోని ఏ ఆడపడుచుకు ఇక అన్యాయం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. 2019 తో పోలిస్తే..2020 లో మహిళలపై 7.5% శాతం నేరాలు తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దిశ చట్టం మహిళలకు కొండంత అండగా నిలబడింది అని పేర్కొన్నారు.  రాష్ట్రంలో 12 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. దిశ చట్టం సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు.

మహిళలు మరియు బాలల నేరాలపై వెంటనే స్పందించి అక్కడికి చేరుకోవాలని ఆదేశించారు వైఎస్ జగన్. దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో  మౌలిక సదుపాయాల పరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిపై  దృష్టి పెట్టాలని సూచించారు. దిశ కేసులో విచారణ కొరకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ప్రజల్లో మరింత అవగాహన పెంచి... మహిళలకు అండగా ప్రభుత్వం ఉందని నేరగాళ్లు గుర్తించేలా, దిశ పోలీస్ స్టేషన్ వద్ద కాలేజీ వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు రక్షణ భద్రత అంశాలను పొందుపరుస్తూ హోల్డింగ్స్ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.


నిమ్మగడ్డ యాప్ నిలిచేనా? హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>