Movieskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఢిల్లీకి చెందిన ప్రముఖ టీవీ నటి ప్రాచీ తెహ్లాన్‌ను నలుగురు తాగబోతు ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె కారును వెంబడిస్తూ ఇంటివరకూ వెంటపడ్డారు. అసభ్య పదజాలంతో ఆమెను,ఆమె భర్తను దూషించారు. ఆకతాయిలు ఇంటిదాకా రావడంతో ప్రాచీ తెహ్లాన్ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం(ఫిబ్రవరి 3) నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఆకతాయిల వేధింపుల గురించి ప్రాచీ తెహ్లాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'ఇది గత రాత్రి నాకు ఎదురైన భయానక అనుభవం. నేనూ,నా భర్త ఢిల్లీలprachi tehlan;diya;delhi;india;cinema;police;television;car;february;husband;arrest;murder.;punjabiటీవీ నటికి వేధింపులు...!!!టీవీ నటికి వేధింపులు...!!!prachi tehlan;diya;delhi;india;cinema;police;television;car;february;husband;arrest;murder.;punjabiThu, 04 Feb 2021 22:49:38 GMTటీవీ నటికి వేధింపులు...!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

ఢిల్లీకి చెందిన ప్రముఖ టీవీ నటి ప్రాచీ తెహ్లాన్‌ను నలుగురు తాగబోతు ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె కారును వెంబడిస్తూ ఇంటివరకూ వెంటపడ్డారు. అసభ్య పదజాలంతో ఆమెను,ఆమె భర్తను దూషించారు. ఆకతాయిలు ఇంటిదాకా రావడంతో ప్రాచీ తెహ్లాన్ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. 

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం(ఫిబ్రవరి 3) నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఆకతాయిల వేధింపుల గురించి ప్రాచీ తెహ్లాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'ఇది గత రాత్రి నాకు ఎదురైన భయానక అనుభవం. నేనూ,నా భర్త ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి పయనమయ్యాం. ఈ క్రమంలో మార్గమధ్యలో నలుగురు తాగుబోతులు వారి వాహనంతో మమ్మల్ని వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రక్కును మా కారు ఢీకొట్టబోయింది. ఎలాగోలా ఆ ఆకతాయిల నుంచి తప్పించుకుని మా కాలనీకి వచ్చేశాం. కానీ ఆ నలుగురు మా ఇంటి వరకూ వచ్చారు. కారు నుంచి బయటకు దిగి మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించారు.' అని ప్రాచీ తెహ్లాన్ పేర్కొన్నారు.

'నా సొంత సిటీలో,సొంత ఇంట్లో నేను సేఫ్‌గా ఉన్నానని ఇంకెప్పుడు ఫీల్ అవగలను.. ఢిల్లీలో నేను స్వేచ్చగా బయటకెళ్లి రాలేనా... ఒకవేళ ఈ ఘటనలో నాపై అత్యాచారం జరిగి ఉంటే.. లేదా నన్ను హత్య చేసి ఉంటే... సమాధానం లేని చాలా ప్రశ్నలున్నాయి. నాకే కాదు ఇలాంటి వేధింపులు ఎవరికైనా ఎదురుకావొచ్చు.' అని ప్రాచీ తెహ్లాన్ తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. సోమవారం(ఫిబ్రవరి 1) రాత్రి ఈ ఘటన జరగ్గా.. మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాచీ తెహ్లాన్ ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా,ప్రాచీ తెహ్లాన్‌ 'దియా ఔర్ బాతీ హమ్' అనే టీవీ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో వచ్చిన పంజాబీ సినిమా 'అర్జన్‌'లో ఆమె నటించారు. ప్రాచీ నటి మాత్రమే కాదు.. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కూడా. 2010లో కామన్‌వెల్త్‌ క్రీడా పోటీలకు ఆమె ప్రాతినిథ్యం వహించారు. గతంలో భారత బాస్కెట్ బాల్ జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



ఏంటీ ... మరొకసారి 'మిర్చి' కాంబో రిపీట్ కానుందా ......??

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>