Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/surgical-strikes3531b5f8-b436-4cc7-b6af-8f9b4505d291-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/surgical-strikes3531b5f8-b436-4cc7-b6af-8f9b4505d291-415x250-IndiaHerald.jpg2016 సెప్టెంబరు 29, 2019 ఫిబ్రవరి 26.. ఈ రెండు తేదీలు గుర్తుకురాగానే పాకిస్తాన్‌పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ మనకు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా 2019లో చేసిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్‌లో పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలను సమూలంగా నేలమట్టం చేశాం. దీంతో కక్కలేక మింగలేక పాకిస్తాన్ ఇప్పటికీ నానా అవస్థలు పడుతోంది. అయితే ఇప్పుడు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు..surgical strikes;review;rakshita;india;pakistan;iran;2019;february;october;armyపాకిస్థాన్ పై మరో దేశం సర్జికల్ స్ట్రైక్.. ఏ దేశమంటే..పాకిస్థాన్ పై మరో దేశం సర్జికల్ స్ట్రైక్.. ఏ దేశమంటే..surgical strikes;review;rakshita;india;pakistan;iran;2019;february;october;armyThu, 04 Feb 2021 21:08:00 GMTఇస్లామాబాద్: 2016 సెప్టెంబరు 29, 2019 ఫిబ్రవరి 26.. ఈ రెండు తేదీలు గుర్తుకురాగానే పాకిస్తాన్‌పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ మనకు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా 2019లో చేసిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్‌లో పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలను సమూలంగా నేలమట్టం చేశాం. దీంతో కక్కలేక మింగలేక పాకిస్తాన్ ఇప్పటికీ నానా అవస్థలు పడుతోంది. అయితే ఇప్పుడు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు పాకిస్తాన్‌పై మరో దేశం సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు ప్రకటించింది. తాము పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసి.. అక్కడున్న తమ సైనికులను విడిపించుకున్నామని అధికారికంగా ప్రకటించింది.

మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైష్ ఉల్ అదుల్ సంస్థ తమ దేశానికి చెందిన ఇద్దరు సైనికులను కిడ్నాప్ చేసి దాచిపెట్టింది. ఈ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఇరాన్ వారిని విడిపించుకుంది. ఇరాన్ ప్రకటన ప్రకారం..ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి సమయంలో ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. దీనికి సంబంధించి ఇరాన్ సైన్యం పాకిస్తాన్‌కు ఎలాంటి క్లూ కూడా ఇవ్వలేదు. వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దెబ్బకొట్టింది. మిలటరీ విభాగానికి ఏ మాత్రం అందకుండా వారి దేశం లోపలికి వెళ్లడమే కాకుండా అక్కడున్న తమ వారిని సురక్షితంగా తిరిగి తెచ్చుకుంది.
 
ఉగ్రవాదుల డెన్‌కు కాపాలాగా ఉన్న కొందరు ఆర్మీ అధికారులు చనిపోయినట్టు తెలిసింది. ఇరాన్ సైనికులు క్షేమంగా తిరిగి స్వదేశానికి కూడా చేరుకున్నారు. ఇరాన్ ఎలైట్ రివ్యూషనరీ గార్డ్స్ ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. పాకిస్తాన్‌లో ఉన్న తమ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు కిడ్నాప్‌నకు గురైన సైనికులను ఉగ్రవాదులు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుని వారి ప్రాంతంలోనే దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

2018 అక్టోబర్ 16న ఇరాన్ - బలూచిస్తాన్ సరిహద్దుల వద్ద గొడవల్లో 12 మంది సైనికులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ అదుల్ కిడ్నాప్ చేసింది. వారిని తమ ఆధీనంలో పెట్టుకుంది. అయితే, ఈ ఘటన అనంతరం మిలటరీ అధికారులు ఓ జాయింట్ కమిటీగా ఏర్పడి రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చారు. కిడ్నాప్ చేసిన వారిలో ఐదుగురిని 2018 మే 15న రిలీజ్ చేశారు. మరో నలుగురిని 2019 మే 21 మిలటరీ అధికారులు రక్షించారు. ఇప్పుడు ఇద్దరు సైనికులను రక్షించినట్టు ఇరాన్ ప్రకటించింది.


మహిళా డాక్టర్ ఆరోగ్యంపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>