PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc9276907-277a-449b-9470-ec90368e37ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc9276907-277a-449b-9470-ec90368e37ec-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల కమిషనర్ E-Watch పేరిట ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. అందుకు తగిన ప్రచారం కూడా చేసింది. ఇక దీనికి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా E-నేత్ర పేరుతో మరో యాప్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంత జరుగుతుంటే జాతీయ పార్టీ బిజెపి ఊరికే ఉంటుందా.... ఈ పార్టీ కూడా ఇంకో యాప్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది. jagan-nimmagadda-elections;watch;cbn;amala akkineni;naina;delhi;bharatiya janata party;jagan;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;panchayati;chief minister;assembly;tdp;central government;ycp;reddy;partyజగడ్డ: సోము వీర్రాజు సవాల్ కు జగన్, చంద్రబాబు సై అంటారా...?జగడ్డ: సోము వీర్రాజు సవాల్ కు జగన్, చంద్రబాబు సై అంటారా...?jagan-nimmagadda-elections;watch;cbn;amala akkineni;naina;delhi;bharatiya janata party;jagan;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;panchayati;chief minister;assembly;tdp;central government;ycp;reddy;partyThu, 04 Feb 2021 12:00:00 GMTపంచాయతీ ఎన్నికల... వైఖరి చూస్తుంటే ఆ సామెత కరెక్టుగా సరిపోతుందనే అంటున్నారు. వాస్తవానికి ఇవేమీ అసెంబ్లీ ఎన్నికలు కాదు.. కానీ ఆ రేంజులో పోటాపోటీగా హోరెత్తిస్తున్నారు పోటీదారులు.

అందుకు తమ తమ పార్టీ అగ్రనాయకులు సైతం అండగా నిలబడుతూ ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవలే జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారాలు సైతం గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపించాయి. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే తరహాలో అసెంబ్లీ ఎన్నికలను తలపించడం విశేషం. ఏకగ్రీవం అనే పదం గ్రామాల్లో మారుమోగుతోంది. కొందరు మద్దతు పలుకుతూ ఉంటే... మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. అధికార పార్టీ ఏకగ్రీవాలకు ప్రోత్సాహం కలిగిస్తుంటే... ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని నిరుత్సాహపరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ E-Watch పేరిట ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. అందుకు తగిన ప్రచారం కూడా చేసింది. ఇక దీనికి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా E-నేత్ర పేరుతో మరో యాప్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంత జరుగుతుంటే జాతీయ పార్టీ బిజెపి ఊరికే ఉంటుందా.... ఈ పార్టీ కూడా ఇంకో యాప్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది. E-గ్రామ స్వరాజ్య యాప్ రిలీజ్ చేయబోతోంది. రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా, నామినేషన్లను అడ్డుకున్నా, తప్పుడు కేసులు నమోదు చేసినా... లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

అంతేకాక ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు పెడితే ‘9650713714’ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా అటు అధికార పార్టీ వైసిపికి, ఇటు టీడీపీకి చురకలు కూడా అంటించారు సోము. ఏకగ్రీవాలు పేరు చెప్పి వైసిపి పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని విజయసాయి రెడ్డి అనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో వాటర్ గ్రిడ్, రోడ్లు, ఇళ్ల నిర్మాణం, ఇంటర్నెట్ లాంటి ఎన్నో పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్న విషయం మర్చిపోకూడదు అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సోము వీర్రాజు సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. మరి  ఇటు వైసీపీ, అటు టీడీపీ ఈ చాలెంజ్ కు ఎలా స్పందిస్తుందో చూడాలి.


అక్కడ తేనెటీగలు సీజ్ ..అంతపెద్ద తప్పు ఏం చేశాయో..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>