PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nayeem3d9d09e3-9a5a-4c15-964f-dc3c3af9f2d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nayeem3d9d09e3-9a5a-4c15-964f-dc3c3af9f2d2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మళ్లీ నయీం పేరుతో దందాలు మొదలయ్యాయి. నయీం అనుచరుడినంటూ పలువురు వ్యాపారులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఓ నకిలీ నక్సలైట్‌ను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన నర్సింహ అలియాస్‌ దామోదర్‌ అలియాస్‌ దాము జులాయిగా తిరుగుతూ ఇతరులను బెదిరిస్తూ డబ్బు వసూల్ చేస్తున్నాడు.nayeem;tiru;ram madhav;district;police;car;wife;yadadri;ranga reddy;research and analysis wing;gangsterనయీం పేరుతో మళ్లీ దందాలు!నయీం పేరుతో మళ్లీ దందాలు!nayeem;tiru;ram madhav;district;police;car;wife;yadadri;ranga reddy;research and analysis wing;gangsterThu, 04 Feb 2021 09:19:54 GMTగ్యాంగ్ స్టర్ నయీం.. ఈ పేరు గతంలో తెలంగాణలో మార్మోగింది. నయీం పేరు చెబితేనే జనాలు హడలిపోయేవారు. 2017 లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. అయితే తాజాగా తెలంగాణలో మళ్లీ నయీం పేరుతో దందాలు మొదలయ్యాయి. నయీం అనుచరుడినంటూ పలువురు వ్యాపారులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఓ నకిలీ నక్సలైట్‌ను కుషాయిగూడ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన నర్సింహ అలియాస్‌ దామోదర్‌ అలియాస్‌ దాము  జులాయిగా తిరుగుతూ ఇతరులను బెదిరిస్తూ డబ్బు వసూల్ చేస్తున్నాడు.

             నర్సింహ భార్య కనకలక్ష్మి గంధమాల ఎంపీటీసీ సభ్యురాలు. నర్సింహ నాలుగు రోజుల క్రితం కుషాయిగూడ భగవాన్‌ కాలనీకి చెందిన ఓ వ్యాపారికి ఫోన్‌ చేసి తాను నక్సలైట్‌నని, సమ్మయ్య దళ సభ్యుడినని రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.చివరకు రూ.50 వేలైనా ఇవ్వాలని బెదిరిస్తుండడంతో అనుమానం వచ్చిన సదరు వ్యాపారి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వలపన్నిన పోలీసులు నర్సింహను కుషాయిగూడలో అదుపులోకి తీసుకున్నారు. నర్సింహ కొన్నాళ్లుగా నకిలీ నక్సలైట్‌ అవతారమెత్తి జవహర్‌నగర్‌, రాంపల్లి, దమ్మాయిగూడ, కీసర ప్రాంతాలలో పలువురు వ్యాపారులు, బిల్డర్‌లను లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల గ్యాంగ్‌స్టర్‌ నయీం పేరు చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న నర్సింహ నుంచి ఓ బ్రిజా కారును, అందులో నక్సల్స్‌ పేరుతో ఉన్న లెటర్‌ ప్యాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

      నయీం అనుచరులమని బెదిరింపులకు పలుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో  ఫిర్యాదు దాఖలైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పొరుండలా గ్రామానికి  చెందిన గిద్దెల యాదమ్మ,గిద్దెల శ్రీను,యదయ్యాలు ఈ ఫిర్యాదు చేశారు. కందుకూరు మండలం చిప్పేల పల్లి లో 14 ఎకరాల 11 గుంటల వ్యవసాయ భూమి తమకు ఉందని, దానిపై  కొందరు వ్యక్తులు నకిలి పాస్ పుస్తకాలు తయారు చేసి.. నయీం పేరుతో తమను బెదిరిస్తున్నారని యాదమ్మ వాపోయింది. 


ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>