Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kerala-born-uae-businessman-announced-that-he-is-goint-to-give-salaries-to-wives-of-employeesec0673af-4512-422d-88b1-176a1d4d0429-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kerala-born-uae-businessman-announced-that-he-is-goint-to-give-salaries-to-wives-of-employeesec0673af-4512-422d-88b1-176a1d4d0429-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు కమల్ హాసన్ ఈ మధ్యనే తన మ్యానిఫెస్టోలో గృహిణులకు కూడా జీతాలిస్తానంటూ ఓ సంచలన ప్రకటన చేసిన విషయం గుర్తుంది కదా. ఇప్పుడు అలాంటి విధానాన్నే ఓ కేరళ వ్యాపారి పాటించబోతున్నారు. ఆయన తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకే కాకుండా వారి భార్యలకు కూడా జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఆయన..salaries to wives;kamal hassan;kerala;media;tamil;husband;wife;local language;central government;sharjah;forbesఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా.. ఇదీ అసలైన మానవత్వమంటే..ఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా.. ఇదీ అసలైన మానవత్వమంటే..salaries to wives;kamal hassan;kerala;media;tamil;husband;wife;local language;central government;sharjah;forbesThu, 04 Feb 2021 16:14:40 GMTఇంటర్నెట్ డెస్క్: తమిళ నటుడు కమల్ హాసన్ ఈ మధ్యనే తన మ్యానిఫెస్టోలో గృహిణులకు కూడా జీతాలిస్తానంటూ ఓ సంచలన ప్రకటన చేసిన విషయం గుర్తుంది కదా. ఇప్పుడు అలాంటి విధానాన్నే ఓ కేరళ వ్యాపారి పాటించబోతున్నారు. ఆయన తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకే కాకుండా వారి భార్యలకు కూడా జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఆయన ఉద్యోగుల భార్యల వివరాలను కూడా సేకరిస్తున్నారు.

కేర‌ళ‌కు చెందిన సోహ‌న్ రాయ్‌.. షార్జా కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న ఎరైస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్ర‌మోట‌ర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క‌రోనా సంక్షోభం సమయంలో నిజాయితీగా, నిబ‌ద్ధ‌తతో పని చేసిన సంస్థలోని ఉద్యోగులను సంస్థలోని తీసివేసేందుకు సోహన్ రాయ్‌ ఇష్టపడలేదు. అంతేకాదు.. వారికి జీతంలో కనీస కోతలు కూడా లేకుండా పూర్తి స్థాయి జీతాన్ని ఎప్పటిలానే అందించారు. ఇక ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు సోహన్ రాయ్. అదేంటంటే కరోనా సమయంలోనూ వెనక్కి తగ్గకుండా తన సంస్థలో పనిచేసిన ఉద్యోగుల భార్య‌ల‌కు కూడా ఇక నుంచి వేత‌నాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం ప్రస్తుతం రాయ్ కంపెనీ అధికారులు పురుష ఉద్యోగుల భార్యలకు సంబంధించిన డేటాను సేకరించే పనిలో ఉన్నారట. సంస్థలో ఉద్యోగి ఎన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నాడో దాని ఆధారంగా వారి భార్యలకు నెల నెలా జీతాలను నిర్ణయిస్తారట. డేటా మొత్తం సేకరించగానే ఉద్యోగుల భార్యలకు వేతనాలు ఇవ్వడం మొదలు పెడతారట.

దీనిపై రాయ్ మాట్లాడుతూ.. మహమ్మారి సంక్షోభం సమయంలో కూడా కంపెనీ కోసం పనిచేసిన ఉద్యోగులకు పరిహారంగా వారి భార్యలకు శాలరీలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంలో తనకు ఒక ప్రమాద కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ప్రేరణ అని తెలిపారు. ‘ఉద్యోగం చేస్తున్న భర్త శ్రమకు, అతడి భార్య గృహిణిగా చేసే పని ఏమాత్రం తక్కువ కాదని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. అదే ప్రేరణతోటి తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల భార్యలకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించాన’ని చెప్పారు. అంతేగాక ఎరైస్ గ్రూపులో మూడేళ్ళు పూర్తి చేసిన తన ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ కూడా ఇవ్వనున్నట్లు రాయ్ ప్రకటించారు.

సోహ‌న్ రాయ్ ఇప్పటికే వ్యాపార రంగంలో అనేక గొప్ప పురస్కారాలు అందుకున్నారు. సక్సెస్‌పుల్ బిజినెస్‌మెన్‌గా పేరు గడించారు. 2017లో విడుద‌ల చేసిన ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ లీడ‌ర్ల జాబితాలో రాయ్ చోటు ద‌క్కించుకున్నారంటే ఆయన ఏ స్థాయి వ్యాపారవేత్తనో అర్థం చేసుకోవచ్చు.




డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>