PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/private-teaxhers-problemsc218c531-800a-4dad-88f6-4aad564d72f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/private-teaxhers-problemsc218c531-800a-4dad-88f6-4aad564d72f1-415x250-IndiaHerald.jpgప్రైవేటు టీచర్ల జీవితాలు వెట్టి చాకిరీని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం విద్యార్థులు చదివేది ప్రైవేటు పాఠశాలల్లోనే.. కానీ.. వారికి చదువు చెబుతున్న టీచర్ల జీవితాలు అతి దారుణంగా ఉంటున్నాయి. జ్ఞాన దోపిడీలు చేసే దౌర్భాగ్యులు.. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలుగా మారి పీడిస్తున్నాయన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. మామూలు సమయాల్లోనే ప్రైవేట్ టీచర్స్ జీవితాలు దారుణం.. ఇక ఈ కరోనా సమయంలో వారి బాధలు వర్ణనాతీతం.. ప్రైవేటు టీచర్ల రక్తాన్ని.. శ్రమను.. సమయాన్ని ..సంతోషాన్ని.. న్యాయంగా వారికి private-teaxhers-problems;nithya new;schoolటీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?private-teaxhers-problems;nithya new;schoolThu, 04 Feb 2021 09:08:31 GMTస్కూల్ యాజమాన్యాలుగా  మారి పీడిస్తున్నాయన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి.

మామూలు సమయాల్లోనే ప్రైవేట్ టీచర్స్  జీవితాలు దారుణం.. ఇక ఈ కరోనా సమయంలో వారి బాధలు వర్ణనాతీతం.. ప్రైవేటు టీచర్ల రక్తాన్ని.. శ్రమను.. సమయాన్ని ..సంతోషాన్ని.. న్యాయంగా వారికి రావలసిన జీతాలను దోచుకునే చాలా మంది ప్రైవేటు బడుల యజమానులు నిత్యం మన మధ్యే ఉన్నారు. ప్రైవేటు టీచర్స్ చాలా మంది వాళ్ళకు వచ్చే జీతాలను లోకంలో ఎవరికీ తమ నిజమైన జీతాలని చెప్పుకోరు. అందరూ 15-20 వేలుకు పైగా వస్తాయని అబద్దాలు  చెప్పుకునే అమాయకపు అభాగ్యులు ఈ ప్రైవేటు టీచర్స్.

కార్మికులకు కార్మిక సంఘాలు.. రైతులకు రైతు సంఘాలు.. 100 రోజుల పనివాళ్ళకు సంఘాలు ఉన్నాయి కానీ.. ఏ సంఘం కూడా లేనివారు ప్రైవేటు టీచర్స్ మాత్రమే. పొరపాటున ఎవరైనా సంఘం కనుక పెడితే.. సంఘం లో సభ్యులు గా ఉంటే ఆ టీచర్స్ కు ఉద్యోగమే లేకుండా చేస్తారు అందరు స్కూల్ యజమానులు. దాదాపుగా  చాలా ప్రవేటు స్కూల్స్ లో నెలకు Rs.3000/- నుండి Rs.9000/-వరకు మాత్రమే జీతంగా పొందే వారే ఎక్కువ మంది ఉన్నారు.

ఇప్పుడు కరోనా పుణ్యమా అని అది కూడా ఇవ్వడం లేదు. నెలల తరబడి జీతాలు లేక ప్రైవేటు టీచర్లు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎక్కడైనా నెలకు 30రోజుల జీతం ఉంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ లో నెల కు ఒక సెలవు మాత్రమే ఇచ్చి ఒక్కటి ఎక్కువ సెలవు వాడుకున్నా జీతం కట్ చేస్తున్నారు. ఆదివారాలు సెలవులు తీసేసి జీతం ఇస్తుంటారు. సమాజంలో అన్ని వర్గాలు ఇబ్బందులపై పోరాడే పార్టీలు వీరి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.




చి చి... బిజెపిని ఇప్పుడు కూడా తిట్టలేకపోతున్నారా...?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>