EditorialSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/si-sireesha2fe0f368-3efe-4eed-b0d5-e75874810d0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/si-sireesha2fe0f368-3efe-4eed-b0d5-e75874810d0c-415x250-IndiaHerald.jpgఇటీవలే ఓ మహిళా ఎస్సై పొలాల గట్లపై నుంచి ఓ అనాథ శవాన్ని భుజంపై మోసుకుంటూ కిలో మీటర్ నడిచిన సంగతి తెలిసిందే. గ్రామస్తులు నుంచి తన వద్ద పని చేసే కానిస్టేబుల్స్ కూడా నిరాకరించిన పనిని.. మహిళా ఎస్సై ఒక్కరే సమర్ధవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. 2014లో శిరీష ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్పీ ‘ఆఫ్ట్రాల్‌ కానిస్టేబుల్‌’వి అని మందలించడం శిరీష జీవితంలో పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ఆ అవమానంతో శిరీష బాధపడింది. పట్టుదలతో కష్టపడి చదివి ఎస్సైగా నిలిచిందిsi sireesha;shiva;jeevitha rajaseskhar;nithya new;varsha;bharatiya janata party;telangana;mp;district;ananthapuram;police;mandalam;village;marriage;minister;lord siva;husband;anantapuram;girl;traffic police;father;v;annayya;fidaaఏపీలో అనాధ శవాన్ని పొలం గట్లపై మోసి శభాష్ అనిపించుకున్న ఎస్సై శిరీష 'ఆఫ్ట్రాల్' కాదుఏపీలో అనాధ శవాన్ని పొలం గట్లపై మోసి శభాష్ అనిపించుకున్న ఎస్సై శిరీష 'ఆఫ్ట్రాల్' కాదుsi sireesha;shiva;jeevitha rajaseskhar;nithya new;varsha;bharatiya janata party;telangana;mp;district;ananthapuram;police;mandalam;village;marriage;minister;lord siva;husband;anantapuram;girl;traffic police;father;v;annayya;fidaaThu, 04 Feb 2021 17:00:00 GMTపోలీస్ డిపార్ట్మెంట్ అత్యున్నత అధికారుల వరకు అందరూ ఆమెను కొనియాడారు. ఆ మహిళా ఎస్సైలో మూర్తీభవించిన ఆ మానవత్వానికి కారణం ఆమె గతం తాలూకు అనుభవపూర్వక ఇబ్బందులే! గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఎదుర్కొన్న సంఘటనలే.. నేటి ఆమె పరిణితికి, సేవాతత్పరతకు కారణాలు.



శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్‌స్పెక్టర్ (ఎస్సై) శిరీష! ఈ పేరు రెండు రోజుల ముందు వరకు ఆ ప్రాంత ప్రజలకు తప్ప.. ఇంకెవరికీ తెలియదు. కానీ, తాజాగా అనాధ శవం పట్ల ఆమె చూపిన చొరవను చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెకు ఫిదా అయ్యారు. అయితే ఆమె గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఇలా పదిమందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. విశాఖపట్నం సిటీ రామాటాకీస్‌ ప్రాంతంలో కొత్తూరు అప్పారావు (తాపీ మేస్త్రీ), రమణమ్మ(కూలీ) దంపతులకు శిరీష జన్మించింది. ఆడపిల్ల అంటే పరదా చాటున ఉండాల్సిందే అనే కట్టుబాట్లు ఉన్న కులంలో శిరీష పుట్టింది. నిరుపేద కూలీలైన తల్లిదండ్రులు భారంగా భావించి 13 ఏళ్లకే శిరీషకు పెళ్లి చేశారు. ఆ వయసులో ఏం చేయాలో తెలియదు.. తన భర్త వయస్సుకు ఆమె వయస్సుకు అసలు సంబంధమే లేదు. భార్యగా బాధ్యత ఏంటో కూడా తెలియదని వయసు. జీవితం ఎలా నెట్టుకురావాలో తెలియదు. భవిష్యత్తు మొత్తం అంథకారం ఆవహించింది. అప్పుడే జీవిత పోరాటం ప్రారంభించారు శిరీష. చదువుకోవాలని ఉంది.. కానీ, పుస్తకం కొనేందుకు డబ్బులేదు. ఇలా, కష్టాలతో సహవాసం చేయడం నేర్చుకున్నారు శిరీష. చివరికి ఎలాగోలా అత్తింటి నుంచి బయటపడ్డారు. తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేశారు. ఇక అప్పటి నుంచి తండ్రి అప్పారావు వద్దే ఉంటూ చదువు ప్రారంభించారు. అందులోనూ అప్పారావుకు పోలీస్‌ యూనిఫాం అంటే ఎంతో ఇష్టం. కర్తవ్యం సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ విజయశాంతిలా శిరీషను చూడాలన్నది నాన్న కల. అప్పారావు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించారు. శిరీష అన్నయ్య సతీష్‌కుమార్‌ ఇండియన్‌ నేవీలో, సోదరి దేవి వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సాయంతో శిరీష ఎం.ఫార్మసీ చదువు పూర్తి చేశారు. ఈ తరుణంలో 2014లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా శిరీషకు ఉద్యోగం వచ్చింది. తండ్రి ఆశ మేరకు పోలీస్ కానిస్టేబుల్‌గా మద్దిలపాలెం ఎక్సైజ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేశారు.


2014లో శిరీష ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్పీ ‘ఆఫ్ట్రాల్‌ కానిస్టేబుల్‌’వి అని మందలించడం శిరీష జీవితంలో పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ఎస్పీ చేసిన అవమానంతో శిరీష నిద్ర లేని రాత్రులు గడిపారు. ఆ మాటతో బాధపడ్డారు. అయితే ఒక ఎస్పీ ఆఫ్ట్రాల్‌ అంటే మరో ఎస్పీ చదువుకుంటానంటే ప్రోత్సహిస్తానంటూ ముందుకొచ్చారు. దీంతో 8 నెలల పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి శీరిష సెలవు పెట్టారు. జీతం లేకపోయినా సరే ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించాలని సంకల్పించారు. కానిస్టేబుల్‌గా పనిచేసిన కాలంలో సంపాదించిన రూ. 1.50 లక్షలను తీసుకుని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌కు చేరారు. రెండేళ్ల పాటు కఠోర శ్రమతో చదివి 2019లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. చివరికి ఆమెను ఆఫ్ట్రాల్ అన్న ఎస్పీనే విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సన్మానం చేశారు. ‘‘నన్ను ఆఫ్ట్రాల్‌ అన్న ఎస్పీయే సన్మానం చేయడం జీవితంలో మధురానుభూతి.’’ అని ఎస్సై శిరీష విజయగర్వంతో చెప్పారు. ఇక అనాథ శవాన్ని మోయడం గురించి ఎస్సై శిరీష మనసువిప్పారు. ఆ రోజు ఏం జరిగిందో కుండబద్దలు కొట్టారు. ఆ మాటలు ఎస్సై శిరీష మాటల్లోనే.. ‘‘పలాస మండలంలో అడవికొత్తూరు మారుమూల ప్రాంతం. అక్కడికి కనీసం వాహనాలు కూడా వెల్లవు. అయితే అనాథ శవం ఉందని సమాచం రావడంతో సీఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నాం. నేను, ఓ కానిస్టేబుల్, హోంగార్డు కలిసి పొలాల గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూడగా.. ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన వృద్ధుడి శవం కనిపించింది. జాలి వేసింది. కొంతమంది భూత, ప్రేత పిశాచాలని.. ముట్టుకుంటే స్నానం చేయాలని.. అదో అపచారం అంటూ ఏవేవో చెప్పారు. ఇలాంటి మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్న, పెంచి పోషిస్తున్న వారికి కనువిప్పు చేయాలని భావించాను. శవాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శవాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడ లేదు. చివరికి కాశీబుగ్గలో ఉన్న లలితా చారిటబుల్‌ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో స్ట్రెచర్‌ తీసుకురమ్మని చెప్పాను. స్ట్రెచర్‌పై శవాన్ని వేసేందుకు నాతో వచ్చిన కానిస్టేబుల్‌ కూడా ఇష్టపడలేదు. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి సర్దిచెప్పుకున్నాను. చివరికి నేనే స్ట్రెచర్‌పై శవాన్ని ఉంచి మరొకరి సహకారంతో కిలో మీటరు మేర వరి పొలాల గట్లపై శవాన్ని మోశాను. నా దృష్టిలో శివుడైనా... శవమైనా ఒక్కటే.. ఇది నా డ్యూటీ.’’ అని ఎస్సై శీరీష ఆరోజు జరిగిన విషయాలను వివరించారు.



ఇక, గతంలో తనకు ఎదురైన ఇలాంటి అనుభవం గురించి ఎస్సై శిరీష వివరించారు. ‘‘2019లో నాకు ఎస్పైగా నందిగామలో మొదటి పోస్టింగ్. ఆ గ్రామంలో నలుగురు కొడుకులు.. తల్లిదండ్రులను గొడ్లపాకలో కట్టిపడేశారు. వాళ్లకి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదు. దీంతో ఇక నేనే వారికి చిన్న షెడ్డు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేసి.. సొంతంగా బతికే ఏర్పాట్లు చేశాను. ఇలా నాకు బాధ కలిగించిన ఏ సంఘటనలోనైనా నేను పోలీసు డ్యూటీయే కాకుండా నాకు చేతనైనంత సహాయం కూడా చేస్తాను’’ అని ఎస్సై శిరీష తెలిపారు. ఇక, తాను నిత్య విద్యార్థినని, గ్రూప్‌- 1 సాధించి డీఎస్పీ కావాలన్నదే తన లక్ష్యమని ఎస్సై శిరీష తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ఉన్నతాధికారులు కూడా తనకు సహకరిస్తారని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. డీజీపీ గౌతం సవాంగ్‌ స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. హోంమంత్రి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ పోలీసులు, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండిసంజయ్‌ తదితరులు అభినందించడం, మంత్రి సీదిరి అప్పలరాజు సన్మానించడం జీవితంలో మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు. మున్ముందు కూడా తన తండ్రి చూపిన సేవా మార్గంలో నడుస్తానని ఎస్సై శిరీష వెల్లడించారు.


ఉప్పెన ట్రైలర్ : ప్రేమ గొప్పదైతే సమాధుల్లో కనపడాలి..!

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>